Thursday, 28 September 2017

ఎన్‌పీసీఐఎల్‌లో అప్రెంటిస్, మనూలో ఉద్యోగాలు, ఎన్‌ఎస్‌పీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు, సీఐఎంఏఫ్‌ఆర్‌లో సైంటిస్టులు, ఐఐఎస్‌సీలో అసిస్టెంట్ ట్రెయినీలు. Apprenticeship In NPCIL,Jobs in Manu,Executive Trainees at NSPCL,Cimfr Recruitment for scientists,Assistant trainees at IISC

ఎన్‌పీసీఐఎల్‌లో అప్రెంటిస్,

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్)లో కోటా, తారాపూర్ యూనిట్లలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ భారత ప్రభుత్వ పరిధిలోని సంస్థ. ఎన్‌పీసీఐఎల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్. అణుశక్తి విభాగం పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది. ప్రస్తుత ఖాళీలు మహారాష్ట్రలోని తారాపూర్, రాజస్థాన్‌లోని కోటా యూనిట్లలో ఉన్నాయి.

తారాపూర్ యూనిట్‌లో ఖాళీల వివరాలు:
-మొత్తం ఖాళీల సంఖ్య - 79
-ఫిట్టర్ - 11, టర్నర్ - 4, ఎలక్ట్రీషియన్ - 10, వైర్‌మెన్ - 5, వెల్డర్ - 5, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 1, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ - 1, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ - 3, కార్పెంటర్ - 8, మేషన్ -4, ప్లంబర్ - 6, పెయింటర్ - 7, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్) - 2, మెకానిస్ట్ - 3, డీజిల్ మెకానిక్ - 2, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టం మెయింటెనెన్స్ - 2, షీట్ మెటల్ వర్కర్ - 3 ఖాళీలు ఉన్నాయి.
-అప్రెంటిస్ కాలవ్యవధి: ఏడాది
-వయస్సు: 2017, అక్టోబర్ 3 నాటికి 16- 24 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-శారీరక ప్రమాణాలు: ఎత్తు కనీసం 137 సెం.మీ. ఉండాలి. బరువు - 25.4 కేజీలు. ఛాతీ గాలిపీల్చినప్పుడు 3.8 సెం.మీ. వ్యాకోచించాలి. మంచి కంటిచూపు ఉండాలి.
-అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-పూర్తిచేసిన దరఖాస్తులను కింది చిరునామాకు పంపాలి.
Manager (HRM), Nuclear Power Corporation of India Limited Tarapur Maharashtra Site,
PO : TAPP, Tal. & Dist : Palghar PIN : 401 504, Maharashtra
దరఖాస్తు దాఖలకు చివరితేదీ: అక్టోబర్ 3
NPCIL

రాజస్థాన్ రావట్‌భటా యూనిట్‌లో:
-మొత్తం ఖాళీల సంఖ్య - 60
-ట్రేడ్‌ల వారీగా ఖాళీలు: ఫిట్టర్ - 12, టర్నర్ - 9, మెకానిస్ట్ - 9, ఎలక్ట్రీషియన్ - 12, ఎలక్ట్రానిక్ మెకానిక్ - 12, వెల్డర్ - 3, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - 3 ఖాళీలు ఉన్నాయి.
-స్టయిఫండ్: కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - నెలకు రూ. 4514/-, ఇతర ట్రేడ్‌లకు నెలకు రూ. 5078/-
-వయస్సు: 2017, అక్టోబర్ 10 నాటికి 14 - 24 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్రెంటిస్‌షిప్ కాలవ్యవధి- ఏడాది
-అర్హతలు: కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్‌కు ఇంటర్‌లో సైన్స్ లేదా కామర్స్ ఉత్తీర్ణతతోపాటు మూడేండ్ల పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణత. ఐటీఐలో సీవోపీఏ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. వెల్డర్ ట్రేడ్‌కు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత. ఐటీఐలో వెల్డర్ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
-మిగిలిన అన్ని ట్రేడ్‌లకు పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
-శిక్షణ ఇచ్చే ప్రదేశం: న్యూక్లియర్ ట్రెయినింగ్ సెంటర్, రాజస్థాన్ రావట్‌భటా సైట్, కోటాకు దగ్గర్లో.
-శారీరక ప్రమాణాలు: ఎత్తు కనీసం 137 సెం.మీ. ఉండాలి. బరువు కనీసం 25.4 కేజీలు ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి.
-ఎంపిక: ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
-దరఖాస్తు: మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో రిజిస్టర్ కావాలి. అనంతరం దరఖాస్తును పూర్తిచేసి పంపాలి.
-చివరితేదీ: అక్టోబర్ 10
-పూర్తి చేసిన దరఖాస్తులను కింది చిరునామాకు పంపాలి. Dy. Manager(HRM)Recruitment Section, Vijay Bhawan, Rawatbhata Rajasthan Site, NPCIL, P.O.-Anushakti, Via-kota (Rajasthan), Pin- 323303
వెబ్‌సైట్: www.npcil.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మనూలో ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ అండ్ నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తున్నది.

వివరాలు:
హైదరాబాద్ గచ్చిబౌలీలో విశాలమైన 200 ఎకరాల్లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీని 1998న ఏర్పాటుచేశారు.

హైదరాబాద్ క్యాంపస్‌లో మొత్తం టీచింగ్ పోస్టులు:
-ప్రొఫెసర్స్- 11 పోస్టులు (ఇంగ్లిష్-1, ఉమెన్ ఎడ్యుకేషన్-1, ఇస్లామిక్ స్టడీస్-1, పొలిటికల్ సైన్స్-1, బాటనీ-1, ఫిజిక్స్-1, కెమిస్ట్రీ-1, కామర్స్-1, సీపీడీయూఎంటీ-1, సీఎంఎస్-1, డీఈ-1)
-అసోసియేట్ ప్రొఫెసర్స్-17 పోస్టులు (ఇంగ్లిష్-2, హిందీ-1, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం-1, సోషల్ వర్క్-1, సోషియాలజీ-1, ఎక నామిక్స్-1, కెమిస్ట్రీ-1, మ్యాథమెటిక్స్-1, సీఎస్‌ఈ (పాలిటెక్నిక్)-1, హిస్టరీ (డీఈ)-1, బిజినెస్ మేనేజ్‌మెంట్ (డీఈ)-1, సీపీడీయూఎంటీ-1, సీయూసీఎస్-1)
-అసిస్టెంట్ ప్రొఫెసర్స్-6 పోస్టులు (అరబిక్-1, హిస్టరీ-1, సివిల్ ఇంజినీరింగ్-2, బిజినెస్ మేనేజ్‌మెంట్-1, సీపీడీయూఎంటీ-1)
-ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్, శ్రీనగర్ టీచింగ్ పోస్టులు
-అసోసియేట్ ప్రొఫెసర్స్-8 పోస్టులు(ఉర్దూ-1, అరబిక్-1, ఇంగ్లిష్-1, పర్షియన్-1, ఎకనామిక్స్-1, హిస్టరీ-1, పొలిటికల్ సైన్స్-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1)
-అసిస్టెంట్ ప్రొఫెసర్స్-2 పోస్టులు (హిస్టరీ-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1)
-అకడమిక్ పోస్టులు-2 ఖాళీలు (ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డైరెక్టర్ -1, అసిస్టెంట్ డైరెక్టర్-1)
-మోడల్ స్కూల్ టీచర్లు-9 పోస్టులు
విభాగాలు: పీజీటీ ఇంగ్లిష్-1, టీజీటీ ఇంగ్లిష్-2, ఫిజికల్ ఎడ్యుకేషన్-1, యోగా టీచర్-3, ఎలక్ట్రానిక్స్-1, ఎంబ్రాయిడరీ-1
అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం అర్హతలను కలిగి ఉండాలి.
వయస్సు: 35 ఏండ్లకు మించరాదు
అప్లికేషన్ ఫీజు: రూ. 500/- కొన్ని పోస్టులకు రూ. 300/-
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్. సంబంధిత కాపీలను జతచేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చివరితేదీ: అక్టోబర్ 16
వెబ్‌సైట్: www.manuu.ac.in.


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఎస్‌పీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు,
ఎన్‌టీపీసీ-సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌పీసీఎల్) వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఎన్‌ఎస్‌పీసీఎల్ అనేది ఎన్‌టీపీ లిమిటెడ్, సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా 50:50 ఈక్విటీ ఆధారంగా ఏర్పాటు చేశాయి.
మొత్తం ఖాళీలు: 15
విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్-4, మెకానికల్-7, ఇన్‌స్ట్రుమెంటేషన్-2, ఎలక్ట్రానిక్స్-2
అర్హత: ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ బీఈ/ బీటెక్‌లో 60 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం) ఉత్తీర్ణత. గేట్ 2017 స్కోర్ అర్హతను సాధించాలి.
పే స్కేల్: రూ.20,600-46,500/- ఇతర అలవెన్స్‌లుంటాయి.
వయస్సు: 2017 అక్టోబర్ 10 నాటికి 27 ఏండ్లకు మించరాదు.
ఎంపిక: గేట్ 2017 స్కోర్, ఇంటర్వ్యూ
గేట్ 2017 స్కోర్‌కు 85 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఇచ్చి ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేదీ : అక్టోబర్ 10
వెబ్‌సైట్: www.nspcl.co.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఐఎంఏఫ్‌ఆర్‌లో సైంటిస్టులు,
సీఎఎస్‌ఐఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్ (సీఐఎంఏఫ్‌ఆర్) ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
సీఐఎంఏఫ్‌ఆర్ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
పోస్టు పేరు: సైంటిస్ట్/సీనియర్ సైంటిస్ట్
మొత్తం ఖాళీల సంఖ్య-7 పోస్టులు
అర్హత: మైనింగ్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్/ఎంఈ, జియాలజీ, అప్లయిడ్ జియాలజీలో పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ. 15,600-39,100/-
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
వెబ్‌సైట్ : www.cimfr.nic.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్‌సీలో అసిస్టెంట్ ట్రెయినీలు.


బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)లో ఖాళీగా ఉన్న సెక్రటేరియల్ అసిస్టెంట్ ట్రెయినీ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
దేశంలో ఉన్నత విద్య, పరిశోధనల కోసం ఏర్పాటు చేసిన అత్యున్నత విశ్వవిద్యాలయం ఐఐఎస్సీ. దీన్ని 1909లో జంషెడ్జీ టాటా స్థాపించారు.
పోస్టు పేరు: సెక్రటేరియల్ అసిస్టెంట్ ట్రెయినీ
మొత్తం ఖాళీలు: 24 (జనరల్-12, ఓబీసీ-6, ఎస్సీ-4, ఎస్టీ-2)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (ఆర్ట్స్, సైన్స్, కామర్స్)లో ఉత్తీర్ణత లేదా మూడేండ్ల డిప్లొమా (సెక్రటేరియల్/కమర్షియల్ ప్రాక్టీస్)లో ఉత్తీర్ణత. సీనియర్ ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ అండ్ జూనియర్ ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో సర్టిఫికెట్ ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ కేటగిరీ అభ్యర్థులకు సంస్థ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ. 20,000/-
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత సర్టిఫికెట్లను జతపరిచి పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: ASSISTANT REGISTRAR, ESTABLISHMENT SECTION (UNIT-IB), INDIAN INSTITUTE OF SCIENCE, BANGALORE-560012.
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 13
వెబ్‌సైట్: www.iisc.ac.in


0 comments:

Post a Comment