Thursday, 28 September 2017

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటిస్‌లు, ఎంఆర్‌పీఎల్‌లో ఇంజినీరింగ్ పోస్టులు, సీసీఎంబీలో ఉద్యోగాలు, ఎంఏపీఎస్ స్టయిఫండరీ ట్రెయినీలు, సింగరేణిలో స్పెషలిస్ట్ డాక్టర్లు, యూపీఎస్సీ ఉద్యోగాలు, ఎన్‌సీయూఐలో ఉద్యోగాలు. Apprentices in NLC India Limited,Engineering posts in MRPL,Jobs in CCMB,MAPS Trainees,Specialist doctors Jobs In Singareni,UPSC jobs,Jobs at NCUI

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటిస్‌లు,
ఐటీఐ అభ్యర్థులకు అవకాశం
-మైనింగ్ సంస్థలో ట్రెయినింగ్
-చివరితేదీ: అక్టోబర్ 7

తమిళనాడులోని ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ వివిధ ట్రేడ్ విభాగాలలో అప్రెంటిస్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

nlcarchgate
-వివరాలు: నవరత్న హోదా పొందిన ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌ను గతంలో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీ)గా పిలిచేవారు. దీన్ని 1956లో స్థాపించారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోని లిగ్నైట్ మైనింగ్ సంబంధించిన కార్యక్రమాలను, విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థ.
-పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
-మొత్తం ఖాళీల సంఖ్య: 453 
-విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-73, టర్నర్-24, మెకానిక్ (మోటార్ వెహికిల్)-83, ఎలక్ట్రీషియన్-77, వైర్‌మెన్-63, మెకానిక్ (డీజిల్)-17, మెకానిక్ (ట్రాక్టర్)-21, కార్పెంటర్-4, ప్లంబర్-2, వెల్డర్-55, పాసా-17, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (పాథాలజీ అండ్ రేడియాలజీ)-17
-వయస్సు: 2017 అక్టోబర్ 1 నాటికి 14 ఏండ్లు నిండి ఉండాలి. 
-ఐటీఐ ట్రెయినీ : ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ బోర్డుచే గుర్తింపు పొందిన సంస్థ నుంచి పదోతరగతిపాటు సంబంధిత ఐటీఐ (ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ (మోటార్ వెహికిల్), వైర్‌మెన్, మెకానిక్ (డీజిల్, ట్రాక్టర్), కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్, పాసా) ట్రేడ్‌లలో ఉత్తీర్ణత. 
-మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌తోపాటు ఎంఎల్‌టీ కోర్సు ఉత్తీర్ణత.
-పే స్కేల్ : ఏడాదిపాటు ఉంటుంది . ట్రెయినింగ్ పీరియడ్‌లో కన్సాలిడేటెడ్ స్టయిఫండ్‌గా నెలకు రూ. 7,406/-, పాసా అప్రెంటిస్ పోస్టులకు 6,480/-, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌కు మొదటి ఏడాది రూ. 6,480/-, రెండో ఏడాది రూ. 7,406/- చెల్లిస్తారు. 
-ఎంపిక: అకడమిక్, ట్రేడ్ పరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.మొదట అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్ 
(www.apprentiship.gov.in)లో రిజస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటిస్ ట్రెయినింగ్‌కు దరఖాస్తు చేసిన తర్వాత ప్రింట్ తీసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా:The Deputy General Manager,
Learning & Development Centre,
N.L.C India Limited.
Block:20, Neyveli 607 803
-దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 7
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: అక్టోబర్ 12
-వెబ్‌సైట్: www.nlcindia.com----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎంఆర్‌పీఎల్‌లో ఇంజినీరింగ్ పోస్టులు,
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ఆధ్వర్యంలోని మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) గేట్ స్కోర్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
mrpl
వివరాలు: మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అనేది చమురు శుద్ధి కర్మాగార కంపెనీ. ఇది మినీరత్న హోదాను కలిగి ఉన్నది. ఈ సంస్థను ఓఎన్‌జీసీ
అనుబంధంగా 1988లో మంగళూరులో
ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 74
విభాగాలవారీగా ఖాళీలు:
-కెమికల్-23 పోస్టులు (జనరల్-11, ఓబీసీ-8, ఎస్సీ-3, ఎస్టీ-1)
-మెకానికల్-36 పోస్టులు (జనరల్-18, ఓబీసీ-10, ఎస్సీ-5, ఎస్టీ-3)
-ఎలక్ట్రికల్-2 పోస్టులు (జనరల్-1, ఎస్సీ-1)
-ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-5 పోస్టులు (జనరల్-3, ఎస్సీ-1, ఎస్టీ-1)
-సివిల్-8 పోస్టులు (జనరల్-4, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ లేదా బీఈ/బీటెక్ (కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. గేట్-2017 స్కోర్ ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 24,900-50,500/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 750/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నింపేటప్పుడు అభ్యర్థి పూర్తి వివరాలతోపాటు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.రాతపరీక్షకు సంబంధించిన వివరాలను తెలియజేయడానికి వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
-ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 19
-వెబ్‌సైట్ :https://mrpl.co.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీసీఎంబీలో ఉద్యోగాలు,

సీఐఎస్‌ఆర్ - సీసీఎంబీలో హిందీ ఆఫీసర్, ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
CCMB
వివరాలు: 
సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సీఐఎస్‌ఆర్ పరిధిలో పనిచేస్తుంది. సీసీఎంబీ ఆధునిక జీవశాస్త్రంతోపాటు పలు రంగాల్లో అత్యున్నతస్థాయి పరిశోధనలకు నిలయం.
-హిందీ ఆఫీసర్ - 1
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు
-జీతం: నెలకు సుమారుగా రూ. 72,068/-
-అర్హతలు: పీజీ (హిందీ)తోపాటు డిగ్రీస్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి లేదా పీజీ (ఇంగ్లిష్)తోపాటు డిగ్రీస్థాయిలో హిందీ ఒక సబ్జెక్టుగా చదివినవారు లేదా పీజీలో ఏదైనా సబ్జెక్టు చద, డిగ్రీస్థాయిలో ఇంగ్లిష్, హిందీలు సబ్జెక్టుగా చదివి ఉండాలి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ - 1 ఖాళీ
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు
-జీతం: నెలకు రూ. 44,578/-
-అర్హతలు: పీజీలో హిందీ/ఇంగ్లిష్‌తోపాటు డిగ్రీస్థాయిలో ఇంగ్లిష్/హిందీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 23

-వెబ్‌సైట్: http://www.ccmb.res.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎంఏపీఎస్ స్టయిఫండరీ ట్రెయినీలు,
న్యూక్లియర్ సంస్థలో ట్రెయినింగ్ తర్వాత ఉద్యోగం
-రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ద్వారా ఎంపిక
-చివరితేదీ: అక్టోబర్ 20
మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ (ఎంఏపీఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టయిఫండరీ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
MADRAS
వివరాలు: ఎంఏపీఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తున్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ.
-పోస్టు పేరు: స్టయిఫండరీ ట్రెయినీ/టెక్నీషియన్
-మొత్తం పోస్టుల సంఖ్య: 41 (జనరల్-21, ఓబీసీ-11, ఎస్సీ-9)
-విభాగాలు: ప్లాంట్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఫిట్టర్
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి 50 శాతం మార్కులతో పదోతరగతితోపాటు సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. ప్లాంట్ ఆపరేటర్‌కు సైన్స్ గ్రూప్‌తో ఇంటర్ ఉత్తీర్ణత. శారరీక ప్రమాణాలు కలిగి ఉండాలి.
-వయస్సు: 2017 అక్టోబర్ 20 నాటికి 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్టయిఫండ్ : మొదట ఏడాదికి రూ. 6,200, రెండో ఏడాదికి రూ. 7200/- ట్రెయినింగ్ పీరియడ్‌లో చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తయిన తర్వాత రూ. 21,700/- అదనంగా డీఏ, సీడీఏ, సీఈఏ, మెడికల్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
-ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో నిర్ణీత నమూనా ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
-చివరితేదీ: అక్టోబర్ 20
-వెబ్‌సైట్: www.npcilcareers.co.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సింగరేణిలో స్పెషలిస్ట్ డాక్టర్లు,

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
SCCL
వివరాలు:
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనేది రాష్ట్రంలోని బొగ్గును ఉత్తత్తి చేసే కంపెనీ. దీన్నీ 49:51 ఈక్విటీ ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.
-పోస్టు పేరు: స్పెషలిస్ట్ డాక్టర్
-మొత్తం ఖాళీల సంఖ్య- 28
విభాగాలవారీగా ఖాళీలు
-ఫిజిషియన్-4, జనరల్ సర్జన్-5, ఆర్థో సర్జన్-6, గైనకాలజిస్ట్-6, రేడియోలజిస్ట్-2, హెల్త్ ఆఫీసర్-2, ఈఎన్‌టీ సర్జన్-3
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం అర్హతలను కలిగి ఉండాలి.
-ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్. అభ్యర్థులు కరిక్యులమ్ వీటేతోపాటు అవసరమైన ఒరిజినల్ సర్టిపికెట్లతో పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: సింగరేణి భవన్ 2వ అంతస్తు, సింగరేణి కాలరీస్ కో ఆపరేటివ్ లిమిటెడ్,రెడ్ హిల్స్, లక్డీకాపూల్, హైదరాబాద్.
-ఇంటర్వ్యూతేదీ: అక్టోబర్ 11,12
-వెబ్‌సైట్: www.scclmines.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ ఉద్యోగాలు,
కేంద్రప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:యూపీఎస్సీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వంలోని కొలువుల భర్తీకి పరీక్షలను నిర్వహిస్తుంది.
-మార్కెటింగ్ ఆఫీసర్- 3, వెటర్నరీ ఆఫీసర్- 1, లేడీ మెడికల్ ఆఫీసర్- 6, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్-1, అసిస్టెంట్ ఇంజినీర్- 3, జూనియర్ ఇంజినీర్- 4 ఖాళీలు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 12

-వెబ్‌సైట్: www.upsconline.nic.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీయూఐలో  ఉద్యోగాలు.


న్యూఢిల్లీలోని నేషనల్ కో ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీయూఐ) వివిధ విబాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఎన్‌సీయూఐ అనేది సహకార సంస్థలకు ప్రాతినిధ్యం వహించే అపెక్స్ సహకార సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య - 12
విభాగాలవారీగా ఖాళీలు
-అసిస్టెంట్ డైరెక్టర్-5, హిందీ ఆఫీసర్-1, అసిస్టెంట్-2, లోయర్ డివిజన్ క్లర్క్-4
-విద్యార్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/పీజీ, సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ, తత్సమాన మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత. క్లర్క్‌కు టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
-వయస్సు: 2017 జూలై 1 నాటికి 35 ఏండ్లకు (ఎల్‌డీసీ పోస్టులకు 25 ఏండ్లు) మించరాదు.
-ఎంపిక విధానం:రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-చివరితేదీ: అక్టోబర్ 16

-వెబ్‌సైట్: www.ncui.coop


0 comments:

Post a Comment