Friday, 15 September 2017

ఎంఆర్‌పీఎల్‌లో అప్రెంటిస్ ట్రెయినీలు, పీజీసీఐఎల్ డిప్లొమా ట్రెయినీలు, ఎన్‌టీసీఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు, అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, జలంధర్ నిట్‌లో ఉద్యోగాలు. Apprentice Trainees in MRPL,PGCIL Recruitment Diploma Trainees,NTCL Management Trainees,Professors Jobs In Ambedkar University,Jobs in Jalandhar Nit.

ఎంఆర్‌పీఎల్‌లో అప్రెంటిస్ ట్రెయినీలు,

-బీఈ/బీటెక్, డిప్లొమా అభ్యర్థులకు అవకాశం
-రాతపరీక్ష ద్వారా ఎంపిక
-చివరితేదీ: అక్టోబర్ 7

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ఆధ్వర్యంలోని మంగళూర్ రిఫైనరీ & పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ONGC

వివరాలు:
మంగళూర్ రిఫైనరీ & పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అనేది చమురుశుద్ధి కర్మాగారం. దీనికి మినీరత్న హోదా ఉన్నది. ఈ సంస్థను ఓఎన్‌జీసీ అనుబంధంగా 1988లో మంగళూర్‌లో ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 189
-గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్: 85 ఖాళీలు

విభాగాలవారీగా ఖాళీలు:
-కెమికల్ ఇంజినీరింగ్-28 పోస్టులు (జనరల్-14, ఓబీసీ-9, ఎస్సీ-4, ఎస్టీ-1)
-సివిల్ ఇంజినీరింగ్-7 పోస్టులు (జనరల్-4, ఓబీసీ-1, ఎస్సీ-1, ఎస్టీ-1)
-ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-8 పోస్టులు (జనరల్-4, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1)
-ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-10 పోస్టులు (జనరల్-5, ఓబీసీ-2, ఎస్సీ-2, ఎస్టీ-1)
-ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్-9 పోస్టులు (జనరల్-5, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1)
-మెకానికల్ ఇంజినీరింగ్-23 పోస్టులు (జనరల్-12, ఓబీసీ-7, ఎస్సీ-3, ఎస్టీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత బ్రాంచిలో ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్)లో ఉత్తీర్ణత.
-పే స్కేల్ : నెలకు రూ.10,000/ -స్టయిఫండ్‌ను ఇస్తారు.
-టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్: 104 ఖాళీలు

విభాగాలవారీగా ఖాళీలు:
-కెమికల్ ఇంజినీరింగ్-26 పోస్టులు (జనరల్-13, ఓబీసీ-7, ఎస్సీ-4, ఎస్టీ-2)
-సివిల్ ఇంజినీరింగ్-7 పోస్టులు (జనరల్-4, ఓబీసీ-2, ఎస్సీ-1)
-ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-15 పోస్టులు (జనరల్-8, ఓబీసీ-4, ఎస్సీ-2, ఎస్టీ-1)
-ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-10 పోస్టులు(జనరల్-5, ఓబీసీ-3, ఎస్సీ-1, ఎస్టీ-1)
-ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్-6 పోస్టులు (జనరల్-3, ఓబీసీ-2, ఎస్సీ-1)
-మెకానికల్ ఇంజినీరింగ్-25 పోస్టులు (జనరల్-13, ఓబీసీ-6, ఎస్సీ-4, ఎస్టీ-2)
-కమర్షియల్ ప్రాక్టీస్-15 పోస్టులు (జనరల్-8, ఓబీసీ-4, ఎస్సీ-2, ఎస్టీ-1)
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి సంబంధిత బ్రాంచిలో మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత.
-పే స్కేల్ : నెలకు రూ. 7,100/-స్టయిఫండ్‌ను ఇస్తారు.
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-రాతపరీక్ష 50 మార్కులకు ఉంటుంది. దీనిలో 50 ప్రశ్నలను ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
-పరీక్ష పేపర్ ఇంగ్లిష్/ హిందీలో మాత్రమే ఉంటుంది.
-ఏ భాషలో పరీక్ష రాసేది ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయాలి.
-ఈ పరీక్షకు కేటాయించిన సయమం 90 నిమిషాలు
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నింపేటప్పుడు అభ్యర్థి పూర్తి వివరాలతోపాటు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. రాతపరీక్షకు సంబంధించిన వివరాలను తెలియజేయడానికి వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
చివరితేదీ: అక్టోబర్ 7
వెబ్‌సైట్ : www.ongcindia.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పీజీసీఐఎల్ డిప్లొమా ట్రెయినీలు,

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్), పోస్కోల్లో డిప్లొమా ట్రెయినీ, అసిస్టెంట్, జేవోటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
PGCIL

వివరాలు:
పవర్‌గ్రిడ్ పబ్లిక్ సెక్టార్‌లోని నవరత్న కంపెనీ. ఇది కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ (పోస్కో) భారత ప్రభుత్వ సంస్థ. ఇది పవర్‌గ్రిడ్‌కు అనుబంధం కాదు. ఇది కేంద్ర విద్యుత్‌శాఖ పరిధిలో పనిచేస్తుంది. నేషనల్ డిస్పాచ్, రీజినల్ డిస్పాచ్ సెంటర్లను ఇది
నియంత్రిస్తుంది.
పవర్‌గ్రిడ్‌లో ఖాళీలు
-డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్) - 33
-డిప్లొమా ట్రెయినీ (ఐటీ) - 10
-అసిస్టెంట్ (ఫైనాన్స్) - 19
-పోస్కోలో ఖాళీలు
-డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్) - 8
-డిప్లొమా ట్రెయినీ (ఐటీ) - 2
-డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రానిక్స్) - 2
-జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ (హెచ్‌ఆర్) - 4
-అసిస్టెంట్ (ఫైనాన్స్) - 3
అర్హతలు:
-డిప్లొమా ట్రెయినీ: కనీసం 70 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచీలో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 27 మించరాదు.
-అసిస్టెంట్ (ఫైనాన్స్): ప్రథమశ్రేణిలో బీకాం డిగ్రీ ఉత్తీర్ణులు. ఎంకాం ఉత్తీర్ణత ఉంటే అభిలషణీయం.
-వయస్సు: 28 మించరాదు.
-జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ (హెచ్‌ఆర్): రెండేండ్ల ఫుల్‌టైం పీజీ/పీజీ డిప్లొమా లేదా ఎంబీఏ హెచ్‌ఆర్ లేదా పర్సనల్ మేనేజ్‌మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్ లేదా ఎంఎస్‌డబ్ల్యూ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 27 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: డిప్లొమా ట్రెయినీ పోస్టులకు రాతపరీక్ష/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ, అసిస్టెంట్ ఫైనాన్స్ పోస్టులకు సీబీటీ, కంప్యూటర్ స్కిల్ టెస్ట్‌లను నిర్వహిస్తారు.
-పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ, జైపూర్, నోయిడా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 20
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: అక్టోబర్ 2
-రాతపరీక్ష/ సీబీటీ: అక్టోబర్ 23
వెబ్‌సైట్: www.powergridindia.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌టీసీఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు,

న్యూఢిల్లీలోని నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు
దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో టెక్స్‌టైల్ మిల్లులు, రిటైల్ మార్కెటింగ్ అవుట్‌లెట్స్, ఇతర ఆఫీసుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
పోస్టుల వారీగా
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (టెక్స్‌టైల్)
-అర్హతలు: టెక్స్‌టైల్ టెక్నాలజీలో ఇంజినీరింగ్, గేట్-2017 స్కోర్,
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఫైనాన్స్)
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సీఏ లేదా ఎంసీఏ చేసి ఉండాలి.
-వయస్సు: 2017, జూన్ 30 నుంచి
-పే స్కేల్: రూ. 12,600-32,500
-ఎంపిక విధానం: మేనేజ్‌మెంట్ ట్రెయినీ (టెక్స్‌టైల్)కి గేట్-2017 స్కోర్ ఆధారంగా, మేనేజ్‌మెంట్ (ఫైనాన్స్)కు సీఏ లేదా ఎంసీఏ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. వెబ్‌సైట్‌లో ఉన్న అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిగా నింపి, సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి ఆర్డినరీ పోస్టులో మాత్రమే పంపిచాలి.
చిరునామా: National Textile Corporation Ltd, Post Bag No: 7 (Seven), Lodhi Road Head Post Office, New Delhi, Pin 110003
అప్లికేషన్ ఫీజు: రూ. 300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 30
వెబ్‌సైట్: www.ntcltd.org.


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు,

ఆగ్రాలోని బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
గతంలో ఆగ్రా యూనివర్సిటీగా వ్యవహరించేవారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 36
పోస్టు పేరు: ప్రొఫెసర్లు

పోస్టుల వివరాలు:
ప్రొఫెసర్: 08
విభాగాలు: సోషియాలజీ-01, సోషల్ వర్క్-01, హిందీ-01, ఫిజిక్స్-01, మ్యాథమెటిక్స్-01, బాటనీ-01, జువాలజీ-01, చెల్డ్ డెవలప్‌మెంట్-01.
అసోసియేట్ ప్రొఫెసర్: 12
విభాగాలు : సోషియాలజీ-02, స్టాటిస్టిక్స్-02, హిందీ-01, సంస్కృతం-01, లింగ్విస్టిక్స్-01, మ్యాథమెటిక్స్-02, ఫుడ్ & న్యూట్రిషన్-01, చైల్డ్ డెవలప్‌మెంట్-01, లైబ్రేరీ సైన్స్-01.
అసిస్టెంట్ ప్రొఫెసర్: 16
విభాగాలు: సోషియాలజీ-01, స్టాటిస్టిక్స్-01, సోషల్‌వర్క్-01, హిందీ-03, రష్యన్ లాంగ్వేజ్-01, మాస్ కమ్యూనికేషన్-01, లింగ్విస్టిక్స్-01, హోంమేనేజ్‌మెంట్-01, ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్-01, ఫిజియాలజీ-01, సోషియాలజీ (ఐహెచ్‌ఎస్)-01, కంప్యూటర్ సైన్స్-01, హిస్టరీ-02.
అర్హత: యూనిర్సిటీ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉండాలి.
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకుని, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
చిరునామా: Registrar,Dr.B.R.Ambedkar University,Paliwal Park, Agra (U.P.)-282004
చివరితేదీ: సెప్టెంబర్ 28
వెబ్‌సైట్: www.dbrau.org.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జలంధర్ నిట్‌లో ఉద్యోగాలు.




జలంధర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
1987లో ఏర్పాటుచేసిన రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (గతంలో)ని ప్రస్తుతం అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా పిలిస్తున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్: 67 పోస్టులు (జనరల్-32, ఓబీసీ-19, ఎస్సీ-8, ఎస్టీ-6)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉండాలి. నిబంధనల ప్రకారం సంబంధిత విభాగంలోఅనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 500)
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చిరునామా Registrar, Dr B R Ambedkar National Institute of Technology, PO-REC Campus, Jalandhar
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 10
దరఖాస్తు హార్డ్‌కాపీలు దాఖలు చేయడానికి చివరితేదీ: అక్టోబర్ 17
వెబ్‌సైట్: www.nitj.ac.in

0 comments:

Post a Comment