Friday, 22 September 2017

అగ్రికల్చర్ ఇన్సూరెన్స్‌లో ఏవోలు, డీటీయూ స్టెనోగ్రాఫర్స్ ఉద్యోగాలు. agricultural insurance Recruitment Ao jobs,Dtu stenographers jobs

అగ్రికల్చర్ ఇన్సూరెన్స్‌లో ఏవోలు,
డిగ్రీ, పీజీ అభ్యర్థులకు అవకాశం
-రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-మంచి జీతభత్యాలు, భరోసానిచ్చే ఉద్యోగం
-దరఖాస్తుకు చివరితేదీ- అక్టోబర్ 10

న్యూఢిల్లీలోని అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఐసీఎల్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఐసీఎల్) అనేది 2002 డిసెంబర్ 20న ఏర్పాటుచేయగా, 2003 ఏప్రిల్ 1న తన వ్యాపారాన్ని అధికారికంగా ప్రారంభించింది.
పోస్టు పేరు : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
విభాగాలు: అగ్రికల్చరల్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, లీగల్, స్టాటిస్టిక్స్, మార్కెటింగ్, జనరలిస్ట్
మొత్తం ఖాళీల సంఖ్య -50 (జనరల్ -25, ఓబీసీ-13, ఎస్సీ-8, ఎస్టీ-4, పీహెచ్‌సీ-2**)
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగం అనుసరించి బీఎస్సీ (అగ్రికల్చర్), అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ , ఎమ్మెస్సీ (అగ్రికల్చర్), కంప్యూటర్ సైన్స్/ఐటీలో బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ, ఎంటెక్/మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ మేనేజ్‌మెంట్, బీకాం, ఐసీఏఐ, ఐసీఎస్‌సీ, ఐసీడబ్ల్యూఏఐ, ఎంబీఏ (ఫైనాన్స్), గ్రాడ్యుయేట్/పీజీ ఇన్ లా, బీఎస్సీ/ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్), మార్కెటింగ్/సేల్స్‌లో బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 సెప్టెంబర్ 1 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ట్రెయినింగ్ పీరియడ్: ఏడాది
పే స్కేల్: రూ. 32,795-1610(14)-55,335-1745(4)-62,315/-. మెట్రోపాలిటన్ నగరాల్లో నెలకు సుమారుగా రూ. 51,000/- జీతం ఉంటుంది. వీటికి తోడు బ్యాంక్ నిబంధనల ప్రకారం మరికొన్ని అలవెన్స్‌లు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 650/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 100/-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
జనరలిస్ట్ పోస్టులకు ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో 230 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఈ పరీక్షలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (50 మార్కులు), టెస్ట్ ఆఫ్ రీజనింగ్ (50 మార్కులు), టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు), టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్ (50 మార్కులు) , డిస్క్రిప్టివ్ ఇంగ్లిష్ టెస్ట్ (30 మార్కులు) అంశాలపైన ప్రశ్నలు ఇస్తారు.
జనరలిస్ట్ పోస్టులు కాకుండా మిగతా పోస్టులకు పై అంశాలలో టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్‌కు బదులుగా సంబంధిత ప్రొఫెషనల్ సబ్జెక్ట్ (50 మార్కులు) అంశాలపైన ప్రశ్నలు ఇస్తారు.
ఈ పరీక్షను 150 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్షకు 120 నిమిషాలు, డిస్క్రిప్టివ్ పరీక్షకు 30 నిమిషాలు.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ (ఎస్సే, ప్రిసైస్ రైటింగ్, కాంప్రహెన్షన్) పై పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి డిస్క్రిప్టివ్ రాతపరీక్ష నిర్వహిస్తారు.
ఆన్‌లైన్ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. 1/4 వంతు మార్కులను కోతవిధిస్తారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్ /రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మంతోసహా దేశవ్యాప్తంగా మొత్తం 100 ఎగ్జామినేషన్ సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 10
ఆన్‌లైన్ ఎగ్జామ్: నవంబర్ 10
వెబ్‌సైట్: www.aicofindia.com----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీటీయూ స్టెనోగ్రాఫర్స్ ఉద్యోగాలు.

ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ) స్టెనోగ్రాఫర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు: 
డీటీయూను ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దీన్ని గతంలో ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌గా పిలిచేవారు.
పోస్టు: స్టెనోగ్రాఫర్ (గ్రేడ్ 2, 3)
మొత్తం ఖాళీల సంఖ్య - 11
గ్రేడ్ 2 స్టెనోగ్రాఫర్స్ - 3
పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,200/-
గ్రేడ్ - 3 స్టెనోగ్రాఫర్స్ - 8 ఖాళీలు ఉన్నాయి. 
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,400/-
విద్యార్హతలు: పై రెండు పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు స్టెనోగ్రఫి, కంప్యూటర్‌పై టైపింగ్ చేసే సామర్థ్యం ఉండాలి.
వయస్సు: 35 ఏండ్ల మించరాదు. 
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చివరితేదీ: నవంబర్ 6

వెబ్‌సైట్: http://dtu.ac.in0 comments:

Post a Comment