Friday, 15 September 2017

బీఎస్‌ఎన్‌ఎల్‌లో 996 జేఏవోలు, ఫుడ్ కార్పొ రేషన్‌లో 860 పోస్టులు, సీఎస్‌ఐఆర్‌లో సైంటిస్ట్‌లు, ఎన్‌సీఈఆర్‌టీ ఉద్యోగాలు, మేనేజ్‌లో ఉద్యోగాలు, డీఈబీఈఎల్‌లో జేఆర్‌ఎఫ్‌లు, హెచ్‌సీఎల్‌లో అప్రెంటిస్‌లు. BSNL Recruitment For 996 JAO Posts, Food Corporation Of India Recruitment 860 posts,Scientists at CSIR, NCERT jobs,Jobs in MANAGE,JRFs Jobs in DEBEL, HCL Recruitment Apprenticeships.

బీఎస్‌ఎన్‌ఎల్‌లో 996 జేఏవోలు,

ఎంకాం, సీఏ, ఐసీడబ్ల్యూఏ,సీఎస్ అభ్యర్థులకు అవకాశం
-కేంద్ర ప్రభుత్వ పరిధిలోని టెలికం సంస్థలో కొలువు.
-ఆకర్షణీయమైన జీతం,
-ఆన్‌లైన్ పరీక్ష ద్వారా
-ఏ రాష్ట్ర అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు

BSNLoffers
భారత ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న టెలికమ్యూనికేషన్స్ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( బీఎస్‌ఎన్‌ఎల్) ఓపెన్ మార్కెట్ ద్వారా వివిధ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న జూనియర్ అకౌంట్ ఆఫీసర్( జేఏవో) పోస్టుల భర్తీకి అర్హులైన
అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనేది న్యూఢిలీ ్ల కేంద్రంగా పనిచేస్తున్న భారత ప్రభుత్వ రంగ టెలికమ్యూనికేషన్ సంస్థ. దీన్ని 2000 సెప్టెంబర్ 15న ఏర్పాటు చేశారు. ఇది దేశవ్యాప్తంగానున్న 646 జిల్లాల్లో, 4519 పట్టణాలు, 6.25 లక్షల గ్రామాలల్లో తన నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నది.
-పోస్టు పేరు: జూనియర్ అకౌంట్ ఆఫీసర్( జేఏవో)
-మొత్తం పోస్టుల సంఖ్య: 996 (జనరల్-497, ఓబీసీ-269, ఎస్సీ-153, ఎస్టీ-77). మొత్తం ఖాళీల్లో 30 పోస్టులను పీహెచ్‌సీలకు కేటాయించారు.
-సర్కిళ్లవారీగా ఖాళీలు: తెలంగాణ-19, ఆంధ్రప్రదేశ్-72, మహారాష్ట్ర-135, కర్ణాటక-62, కేరళ-41, చెన్నై టెలికమ్ డిస్ట్రిక్ట్-23, తమిళనాడు-34, అండమాన్ అండ్ నికోబార్ దీవులు-4, అసోం-32, బీహార్-22, చండీగఢ్-19, గుజరాత్-71, హిమాచల్‌ప్రదేశ్-18, జమ్ముకశ్మీర్-16, జార్ఖండ్-11, కోల్‌కతా టెలికమ్ డిస్ట్రిక్ట్-8, మధ్యప్రదేశ్-38, నార్త్ ఈస్ట్ (పార్ట్1)-14, నార్త్ ఈస్ట్ (పార్ట్2)-5, నార్త్ టెలికం రీజియన్-16, ఒడిశా-20, పంజాబ్-61, రాజస్థాన్-46, ఉత్తరప్రదేశ్ (ఈస్ట్)-65, ఉత్తరప్రదేశ్ (వెస్ట్)-41, ఉత్తరాఖండ్-11, పశ్చిమ బెంగాల్-56

-విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంకాం, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. విద్యార్హతకు సంబంధించిన డిగ్రీ/సర్టిఫికెట్‌ను 2017 జనవరి1 నాటికి పొంది ఉండాలి.
-వయస్సు: 2017 జనవరి 1 నాటికి కనిష్ఠంగా 20, గరిష్ఠంగా 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: ఎగ్జిక్యూటివ్( E1 స్థాయి)లో రూ. 16,400-40,500/- జీతం చెల్లిస్తారు. ఏడాది ఇంక్రిమెంట్, ఐడీఏ, హెచ్‌ఆర్‌ఏ, వైద్యసౌకర్యాలు, ప్రోత్సహాకాలు బీఎస్‌ఎన్‌ఎల్ నిబంధనల ప్రకారం ఇస్తారు.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 500/- ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించాలి.
-బాండ్ అండ్ ట్రెయినింగ్: ఎంపికైన అభ్యర్థులు ఐదేండ్ల వరకు బీఎస్‌ఎన్‌లోనే పనిచేయాల్సి ఉంటుంది.
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా. మెరిట్ ప్రకారం వివిధ సర్కిల్‌లో ఖాళీల ప్రకారం అభ్యర్థులను షార్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ తర్వాత అభ్యర్థులకు రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేస్తారు. శిక్షణ సమయంలో చూపిన ప్రతిభ ఆధారంగా దేశంలోని ఏ సర్కిల్‌లోనైనా (ఏక్కడైనా) పోస్టింగ్‌ను ఇస్తారు.

-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో అభ్యర్థి పూర్తి వివరాలతోపాటు నిర్ణీత నమూనా ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
-ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 11
-ఆన్‌లైన్ దరఖాస్తులు చివరితేదీ: అక్టోబర్ 15
-ఆన్‌లైన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ : నవంబర్ 5
-వెబ్‌సైట్ :www.externalexam.bsnl.co.in

-రాతపరీక్ష విధానం: ఆన్‌లైన్ టెస్ట్ రెండు భాగాలుగా ఉంటుంది. సబ్జెక్ట్ -1 (పేపర్ -1), సబ్జెక్ట్ -2 (పేపర్ -2)
-పేపర్-1లో జనరల్ ఇంగ్లిష్ (షార్ట్ ఆన్సర్స్/ ఆబ్జెక్టివ్ టైప్)-100 మార్కులు, జనరల్ ఆప్టిట్యూడ్/అవేర్‌నెస్ (ఆబ్జెక్జివ్ టైప్)-50 మార్కులు.
-దీనికి కేటాయించిన సమయం 3 గంటలు. దీనిలో ఇంగ్లిష్ విభాగం నుంచి కాంప్రహెన్షన్ ప్యాసేజ్, గ్రామర్, వొకాబులరీ, జనరల్‌ఆప్టిట్యూడ్ /అవేర్‌నెస్ నుంచి జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్స్, ఇండియన్‌పాలిటీ, ఎకానమీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్‌ల అంశాల నుంచి ప్రశ్నలను ఇస్తారు.
-పేపర్-2లో ఫైనన్షియల్ మేనేజ్‌మెంట్, కాస్ట్ అకౌంటింగ్, ట్యాక్స్ అండ్ కమర్షియల్ లా (ఆబ్జెక్టివ్ టైప్)-300 మార్కులు. దీనికి కేటాయించిన సమయం 3 గంటలు. దీనిలో అడ్వాన్స్‌డ్ అకౌంటింగ్, ఆడిటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజేస్), బార్ యాక్ట్స్ నుంచి ప్రశ్నలు ఇస్తారు


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఫుడ్ కార్పొ రేషన్‌లో 860 పోస్టులు,

పంజాబ్ రీజియన్‌లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
foodcorporation
వివరాలు:
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)ను 1964లో ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: వాచ్‌మెన్
-మొత్తం పోస్టుల సంఖ్య: 860 (జనరల్-431, ఓబీసీ-180, ఎస్సీ-249, ఎస్టీ-16, )
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 ఆగస్టు1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

-పే స్కేల్: రూ. 8,100-18,070/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 250/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
-ఎంపిక: ఆబెక్టివ్ రాతపరీక్ష, పీఈటీ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నింపేటప్పుడు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.

-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 20
-పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు
-వెబ్‌సైట్: www.fcipunjabapply.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఐఆర్‌లో సైంటిస్ట్‌లు,

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ (ఎన్‌ఐఎస్‌సీఏఐఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్/సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NISCAIR
వివరాలు:
ఎన్‌ఐఎస్‌సీఏఐఆర్ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 7
-పోస్టు పేరు: సైంటిస్ట్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్/ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ లేదా ఎంటెక్/ఎంఈ, మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్/ఎండీలో ఉత్తీర్ణత. సైన్స్/కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, సైన్స్ రైటింగ్, ప్రొడక్షన్ ఆఫ్ రేడియో, ఫిలిం ప్రొడక్షన్, మేనేజ్‌మెంట్, ఫారెన్ లాంగ్వేజేస్‌లో డిగ్రీ/డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

-వయస్సు: 32 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 67,700/-
-పోస్టు పేరు: సీనియర్ సైంటిస్ట్
-అర్హత: ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ లేదా సైన్స్‌లో పీహెచ్‌డీతోపాటు రెండేండ్ల అనుభవం, ఎంటెక్/ఎంఈ, మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్/ఎండీతోపాటు మూడేండ్ల అనుభవం ఉండాలి. సైంటిఫిక్/అకడమిక్ లేదా మీడియా ఆర్గనైజేషన్, సైన్స్ కమ్యూనికేషన్ ప్రోగ్రాంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

-వయస్సు: 37 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 78,800/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పంపిన తర్వాత, ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను డౌన్‌లోడ్ చేసుకొని సర్టిఫికెట్లు జతచేసి రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి పోస్ట్ ద్వారా పంపాలి.
-చివరితేదీ: అక్టోబర్ 1
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: అక్టోబర్ 8
-వెబ్‌సైట్: www.niscair.res.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎన్‌సీఈఆర్‌టీ ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) ప్రాజెక్ట్ స్టాఫ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
bsnl 
వివరాలు:

ఎన్‌సీఈఆర్‌టీ పరిధిలోని ఎడ్యుకేషనల్ సర్వే డివిజన్ 10 తరగతి (సైకిల్ 2) ఆర్‌ఎస్‌ఎంఏ కింద చేపట్టనున్న నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే ప్రాజెక్టులో పనిచేయడానికి కింది స్టాఫ్‌ను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
సీనియర్ కన్సల్టెంట్ - 1
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్/మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, సోషల్ స్టడీస్, కామర్స్, ఎడ్యుకేషన్‌లలో పీజీ చేసినవారు, యూజీసీ నిబంధనల ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అర్హతగల అభ్యర్థులు, సంబంధిత రంగంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ. 60,000/-
కన్సల్టెంట్ - 1
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీలో సైన్స్/స్టాటిస్టిక్స్ లేదా మ్యాథ్స్, సోషల్/ కామర్స్ లేదా ఎడ్యుకేషన్ చేసినవారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి యూజీసీ నిబంధన ప్రకారం అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు.
జీతం: నెలకు రూ. 45,000/-
డాటా మేనేజర్ కం అనలిస్ట్ - 1
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీలో సైన్స్ / స్టాటిస్టిక్స్ లేదా మ్యాథ్స్ లేదా కామర్స్ లేదా ఎకనామిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు. కనీసం ఎనిమిదేండ్ల అనుభవం ఉన్నవారు అర్హులు. 

జీతం: నెలకు రూ. 60,000/-
సర్వే అసోసియేట్ - 1, అకౌంటెంట్ - 1, డీటీపీ ఆపరేటర్ - 1, ప్రాజెక్ట్ హెల్పర్ - 1 ఖాళీ ఉన్నాయి.
ఎంపిక: వాక్ ఇన్ ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూలు సెప్టెంటర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు నిర్వహిస్తారు. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
పూరి వివరాల కోసం 
http://www.ncert.nic.in చూడవచ్చు

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మేనేజ్‌లో ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్)లో ఖాళీగా ఉన్న మేనేజర్, కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
MANAGE 
వివరాలు:
మేనేజ్‌ను 1987లో ఏర్పాటుచేశారు. ఈ సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రెయినింగ్, కన్సల్టెన్సీ, మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్, రిసెర్చ్, సమాచార సేవలు గురించి మెలకువలు నేర్పిస్తారు.
-ప్రోగ్రాం మేనేజర్-1
-కన్సల్టెంట్-1
-అర్హత: పోస్టు గ్రాడ్యుయేట్ (అగ్రికల్చర్/ఐల్లెడ్) మాస్టర్ ఇన్ సైన్స్/ఏబీఎంలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 45 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: మేనేజర్‌కు రూ. 75,000/-, కన్సల్టెంట్‌కు రూ. 42,000/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఈ-మెయిల్ (acabc.incubation@manage.gov.in) ద్వారా పంపాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 25
-వెబ్‌సైట్: www.manage.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఈబీఈఎల్‌లో జేఆర్‌ఎఫ్‌లు,
బెంగళూరులోని డిఫెన్స్ బయోఇంజినీరింగ్ & ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ (డీఈబీఈఎల్) ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
DEBEL 
వివరాలు:
డీఈబీఈఎల్ అనేది డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో పనిచేస్తుంది. 
-జేఆర్‌ఎఫ్-3 పోస్టులు 
-అర్హత: పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఫిజిక్స్)లో ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్ జేఆర్‌ఎఫ్/యూజీసీ జేఆర్‌ఎఫ్, డీఎస్‌టీ ఇన్‌స్పైర్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: గరిష్ఠంగా 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- పే స్కేల్: రూ. 25,000+ హెచ్‌ఆర్‌ఏ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా లేదా అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత, ఎక్స్‌పీరియన్స్ తదితర సర్టిఫికెట్లను జతపరిచి పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: డైరెక్టర్, డీఈబీఈఎల్, పోస్టు బాక్స్ నంబర్-9326, సీవీ రామన్ నగర్, బెంగళూరు-560093
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో (సెప్టెంబర్ 2- 8) వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపాలి. 
-వెబ్‌సైట్: www.drdo.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌సీఎల్‌లో అప్రెంటిస్‌లు.


హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 
Hindustancooper 
వివరాలు:
హెచ్‌సీఎల్ భారత ప్రభుత్వరంగ సంస్థ. ప్రస్తుత ఖాళీలు మధ్యప్రదేశ్ బాల్‌ఘాట్ జిల్లాలోని మలాంజ్‌ఖండ్ యూనిట్‌లో ఉన్నాయి.
-మొత్తం ఖాళీలు - 75. విభాగాల వారీగా ఖాళీలు..
-ఎలక్ట్రీషియన్ - 25, అర్మేచుర్ వైండర్ - 2, మెకానిక్ డీజిల్ - 10, వెల్డర్ (జీ అండ్ ఈ) - 7, ఫిట్టర్ - 10, టర్నర్ - 5, ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్ మెకానిక్ - 2, డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్ - 3, డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్ - 3, సర్వేయర్ - 3, కార్పెంటర్ - 3, ప్లంబర్ - 2
-అర్హతలు: పదోతరగతి/మెట్రిక్‌తోపాటు ఐటీఐలో సంబంధిత ట్రేడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
-అప్రెంటిస్ (శిక్షణ) పై ట్రేడులన్నింటికి ఏడాది.
-వయస్సు: 2017, సెప్టెంబర్ 10 నాటికి 25 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: అక్టోబర్ 8
-వెబ్‌సైట్: http://www.hindustancopper.com

 

0 comments:

Post a Comment