Thursday, 28 September 2017

రైట్స్‌లో ఇంజినీర్లు, సీఈఆర్‌ఐ ప్రాజెక్ట్ అసిస్టెంట్లు, రక్షణశాఖలో ఉద్యోగాలు, వ్యాప్కోస్‌లో 47 ఉద్యోగాలు. Rites Recruitment For Engineers,CERI Project Assistants jobs,Jobs in the Indian Army,47 jobs in Wapco.

రైట్స్‌లో ఇంజినీర్లు,

మినిస్ట్రీ ఆఫ్ రైల్వే పరిధిలో పనిచేస్తున్న రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్) ఖాళీగా ఉన్న మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
rites-office
వివరాలు: ఇది ఒక ప్రముఖ ఇంజినీరింగ్, కన్సల్టెన్సీ కంపెనీ. రైట్స్ భనవ్ గుర్గావ్‌లో ఉంది. రవాణా రంగంలోని ప్రాథమిక సదుపాయాలను కల్పించడానికి 1974లో ఏర్పాటుచేసిన కన్‌స్ట్రక్షన్ కంపెనీ. ఈ సంస్థ 2002లో మినీరత్న హోదా పొందినది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 21
విభాగాలవారీగా ఖాళీలు:
-ఇంజినీర్ (మెకానికల్) - 8. ఇవి జనరల్
కేటగిరీలో ఉన్నాయి.
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో ప్రథమశ్రేణి లో ఉత్తీర్ణులై ఉండాలి. ఫుల్‌టైం/రెగ్యులర్ విధానంలో పూర్తిచేసి ఉండాలి.
-వయస్సు: 31 ఏండ్లు మించరాదు.
-అనుభవం: కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
-ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 13. వీటిలో జనరల్-4, ఓబీసీ-6, ఎస్సీ- 1, ఎస్టీ- 2 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత. ఫుల్‌టైం/రెగ్యులర్ విధానంలో పూర్తిచేసి ఉండాలి.
-అనుభవం: కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
-వయస్సు: 31 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను స్క్రీనింగ్ చేస్తారు. అర్హులైన వారిని రాతపరీక్ష/ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 28
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: అక్టోబర్ 5
-వెబ్‌సైట్: www.rites.com



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఈఆర్‌ఐ ప్రాజెక్ట్ అసిస్టెంట్లు,

తమిళనాడులోని సెంట్రల్ గ్లాస్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈఆర్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్/సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
cecrI
వివరాలు:
సీఈఆర్‌ఐ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 4
-పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్
-పే స్కేల్: రూ.25,000+ హెచ్‌ఆర్‌ఏ, తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
-అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) లేదా బీఈ/బీటెక్ (కెమికల్, మెటలర్జికల్, కెమికల్, మెటీరియల్ సైన్స్)లో 55 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ 50 శాతం మార్కులు) ఉత్తీర్ణత.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా .
-దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, ఇంటర్వ్యూ రోజున రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
చిరునామా: Central Electrochemical Research Institute, Karaikudi
-ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 3
-వెబ్‌సైట్: www.cecri.res.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రక్షణశాఖలో ఉద్యోగాలు,
రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎంబీ ఏరియా పీఆర్‌వో యూనిట్ (ఆర్మీ) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
DEFENCE
వివరాలు: ఎంబీ ఏరియా పీఆర్‌వో యూనిట్ (ఆర్మీ) భారత ప్రభుత్వ పరిధిలోని రక్షణమంత్రిత్వశాఖ కింద పనిచేస్తుంది.
-పెయింటర్ - 1
-అర్హతలు: పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, ఏడాది అనుభవం ఉండాలి.
-వయస్సు: 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: పేబ్యాండ్ - 1
(రూ. 5,200 - 20,200)
-కార్పెంటర్ - 1
-అర్హతలు: పదోతరగతి, కార్పెంటర్ ట్రేడ్‌లో ఐటీఐ, ఏడాది అనుభవం ఉండాలి.
-వయస్సు: 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: పేబ్యాండ్ - 1
(రూ. 5,200 - 20,200)
-ఈబీఆర్ - 1
-అర్హతలు: పదోతరగతి, ఈబీఆర్ ట్రేడ్‌లో ఐటీఐ, ఏడాది అనుభవం ఉండాలి.
-వయస్సు: 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: పేబ్యాండ్ - 1
(రూ. 5,200 - 20,200)
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ప్రాక్టికల్ టెస్ట్, ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా
నోట్: పై పోస్టులన్ని గ్రూప్ సీ క్యాడర్ పోస్టులు
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: అక్టోబర్ 15
పూర్తి చేసిన దరఖాస్తులను కింది చిరునామాకు పంపాలి. కమాండింగ్ ఆఫీసర్ ఆఫ్ ఎంబీ ఏరియా, ప్రోవోస్ట్ యూనిట్,
పిన్ - 901124, C/o 56 APO



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వ్యాప్కోస్‌లో 47 ఉద్యోగాలు.




వ్యాప్కోస్ లిమిటెడ్ సదరన్ రీజియన్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
WAPCOS
వివరాలు:
వ్యాప్కోస్ లిమిటెడ్ ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఐఎస్‌వో 9001 - 2008, మినీరత్న హోదా కలిగిన సంస్థ. కింది పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన సదరన్ రీజియన్‌లో భర్తీ చేయనున్నది.
-జియాలజిస్ట్ - 2, బ్లాస్ట్ ఇంజినీర్ - 1, మెరైన్ ఇంజినీర్ - 1, స్ట్రక్చర్ ఇంజినీర్ - 2, లైట్నింగ్ ఇంజినీర్ - 1, ఫైర్ ఫైటింగ్ - 1, సీనియర్ సైట్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) - 10, జూనియర్ సైట్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) - 14, హెచ్‌ఏవీసీ ఇంజినీర్ - 1, ఎలక్ట్రికల్ ఇంజినీర్ - 1, క్యూఏ/క్యూసీ ఇంజినీర్ - 2, డ్రాఫ్ట్స్‌మెన్ - 5 ఖాళీలు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 7
-వెబ్‌సైట్: http://www.wapcos.co.in

0 comments:

Post a Comment