Friday, 8 September 2017

ఎయిమ్స్‌లో 433 ఉద్యోగాలు, డీఆర్‌డీవో-ఏడీఈలో అప్రెంటిస్‌లు. AIIMS Recruitment Various 433 Posts,Apprentices Posts in DRDO-ADE.

ఎయిమ్స్‌లో 433 ఉద్యోగాలు,

పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులకు అవకాశం
-కేంద్ర ప్రభుత్వ కొలువులు
-మంచి జీతభత్యాలు, ఆకర్షణీయమైన అలవెన్స్‌లు

రుషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) గ్రూప్ ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
AIIMS

వివరాలు: 
ఎయిమ్స్ రుషికేష్ అత్యున్నత వైద్యసంస్థల్లో ఒకటి. 2012 సెప్టెంబర్ 20న ఏర్పాటైన ఈ సంస్థ ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది. 

పోస్టులు - ఖాళీలు - అర్హతలు:
-లా ఆఫీసర్ - 1
-అర్హత: లా డిగ్రీ, కనీసం 6 ఏండ్లు లా ప్రాక్టీస్ చేసి ఉండాలి.
-వయస్సు: 30 - 45 ఏండ్ల మధ్య ఉండాలి. 
-పేస్కేల్: రూ. 15, 600 - 39,100 + గ్రేడ్ పే రూ. 5,400/-
-డైటీషియన్ - 12 (జనరల్ - 8, ఓబీసీ - 3, ఎస్సీ - 1)
అర్హత: ఎమ్మెస్సీ (హోం సైన్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్) లేదా ఎమ్మెస్సీ (క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటీషియన్) లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. 200 పడకల వైద్యశాలలో కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 21 - 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,600/-
-అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ - 1
-అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పీజీ డిగ్రీ/డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్‌మెంట్ లేదా డిగ్రీలో మెటీరియల్ మేనేజ్‌మెంట్‌తోపాటు మూడేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 18 - 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,600/-
-ఆడియాలజిస్ట్ - 1
-అర్హత: బ్యాచిలర్స్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-వయస్సు: 21 - 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,300/-
-స్టోర్ కీపర్ - 20 పోస్టులు
-అర్హతలు: డిగ్రీతోపాటు పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణత. 
-వయస్సు: 18 - 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,200/-
-జూనియర్ వార్డెన్ (హౌస్ కీపర్స్) - 10 (జనరల్ - 7, ఓబీసీ - 2, ఎస్సీ - 1)
-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత. ఏదైనా కాలేజీలో రెండేండ్లు జూనియర్ వార్డెన్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. 
-వయస్సు: 30 -45 ఏండ్ల మధ్య ఉండాలి. 
-పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
-గ్రేడ్ - 2 ల్యాబ్ అటెండెంట్ - 41 (జనరల్ - 22, ఓబీసీ - 10, ఎస్సీ - 6, ఎస్టీ - 2)
-అర్హతలు: ఇంటర్, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ
-వయస్సు: 18 - 27 ఏండ్ల మధ్య ఉండాలి. 
-పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
-లోయర్ డివిజన్ క్లర్క్ - 32 (జనరల్ - 18, ఓబీసీ - 8, ఎస్సీ - 4, ఎస్టీ - 2)
-అర్హత: ఇంటర్‌తోపాటు కంప్యూటర్‌పై ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు టైపింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. 
-వయస్సు: 18 - 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
-మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ - 38 (జనరల్ - 21, ఓబీసీ - 10, ఎస్సీ - 5, ఎస్టీ - 2)
-అర్హతలు: బీఎస్సీ (మెడికల్ రికార్డ్స్) లేదా ఇంటర్ (సైన్స్ గ్రూప్)తోపాటు మెడికల్ రికార్డు కీపింగ్‌లో ఆరు నెలల కోర్సు సర్టిఫికెట్/డిప్లొమాతోపాటు 2 ఏండ్ల అనుభవం ఉండాలి. 
-వయస్సు: 18 - 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,400/-
-మోడలర్ (ఆర్టిస్ట్) - 14 పోస్టులు
-అర్హతలు: డిప్లొమా /సర్టిఫికెట్ ఇన్ ఫైన్ ఆర్ట్స్‌తోపాటు రెండేండ్లు అనుభవం ఉండాలి.
-వయస్సు: 21 -35 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,800/-
-ఆఫీస్/స్టోర్స్ అటెండెంట్ (మల్టీ టాస్కింగ్) - 40 పోస్టులు
-అర్హత: పదోతరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణత
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు
-పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
-గ్రేడ్ - 2 ఫార్మాసిస్ ్ట - 27 పోస్టులు
-అర్హతలు: డిప్లొమా ఇన్ ఫార్మసి లేదా తత్సమాన కోర్సుతోపాటు ఫార్మాసిస్ట్‌గా రిజిస్టర్ అయి ఉండాలి.
-వయస్సు: 21 - 27 ఏండ్లు మధ్య ఉండాలి.
-పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,800/-
-స్టెనోగ్రాఫర్ - 34 పోస్టులు
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సుతోపాటు స్టెనోగ్రఫీ
-వయస్సు: 21 - 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-వయస్సు: 5, 200 - 20, 200 + గ్రేడ్ పే రూ. 2, 400/-
-అప్పర్ డివిజన్ క్లర్క్ - 3, అకౌంట్స్ ఆఫీసర్ - 2, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ - 1, నర్సింగ్ సూపరింటెండెంట్ - 3, రిజిస్ట్రార్ - 1, సీనియర్ ప్రొక్యూర్‌మెంట్ కమ్ స్టోర్స్ ఆఫీసర్ - 1, స్టోర్ ఆఫీసర్ - 2, లైబ్రేరియన్ సెలక్షన్ గ్రేడ్ - 1, చీఫ్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ - 1, చీఫ్ డైటీషియన్ - 1, చీఫ్ మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ - 1, జూనియర్ ఇంజినీర్ (ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్) - 4, ఫార్మాసిస్ట్ - 3, సీనియర్ మెకానిక్ - 2, బయో మెడికల్ ఇంజినీర్ - 1, టెక్నికల్ ఆఫీసర్ (డెంటల్)/డెంటల్ టెక్నీషియన్ - 4, టెక్నికల్ ఆఫీసర్ ఆప్తాల్మాలజీ - 4, వార్డెన్ (హాస్టల్ వార్డెన్) - 4, లీగల్ అసిస్టెంట్ - 1, మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ - 1, మెడికల్ రికార్డ్ ఆఫీసర్ - 4 (జనరల్ - 3, ఓబీసీ -1), మెడికో సోషల్ వర్కర్ - 3 (జనరల్), మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (ఫిజియోథెరపిస్ట్) - 4, పీఏసీఎస్ అడ్మినిస్ట్రేటర్ - 1, సైక్రియాట్రిక్ సోషల్ వర్కర్ - 3, స్పీచ్ పాథాలజిస్ట్ - 1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: అక్టోబర్ 16

-వెబ్‌సైట్: www. aiimsrishikesh.edu.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవో-ఏడీఈలో అప్రెంటిస్‌లు.బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్/ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఏడీఈ అనేది డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో పనిచేస్తుంది.
మొత్తం అప్రెంటిస్‌ల సంఖ్య: 81
పోస్టు పేరు: డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్/ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీ.
DRDO

ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రెయినీ ..
ఏరోనాటికల్-2, మెకానికల్-10, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-10, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్-2, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ-8
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత ఇంజినీరింగ్/టెక్నాలజీ సబ్జెక్ట్‌లో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.

డిప్లొమా అప్రెంటిస్ ట్రెయినీ..
మెకానికల్-5, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-5, ఎలక్ట్రికల్ -5, కంప్యూటర్ సైన్స్-5
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి సంబంధిత ఇంజినీరింగ్/టెక్నాలజీ సబ్జెక్ట్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.

ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీ ..
మెషినిస్ట్-2, ఫిట్టర్-6, టర్నర్-2, ఎలక్ట్రికల్-3, ఎలక్ట్రానిక్స్-6, వెల్డర్-2, ఆటోమొబైల్-2, ఎలక్ట్రోప్లేటర్-1
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోపా)-5
అర్హత : గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
వయస్సు: కనీసం18 ఏండ్లు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లవరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
స్టయిఫండ్: బీఈ/బీటెక్ అభ్యర్థులకు రూ. 4984/-, డిప్లొమా అభ్యర్థులకు రూ. 3542/-చెల్లిస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ ద్వారా. బీఈ/బీటెక్ లేదా డిప్లొమా అభ్యర్థులు(www.mhrdnats. gov.in), ఐటీఐ అభ్యర్థులు (https:// ncvtmis.gov.in) వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ రిజిస్టర్ ఫామ్ దరఖాస్తుతోపాటు, సంబంధిత సర్టిఫికెట్లు, ఫొటో జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: The Director Aeronautical Development Establishment (ADE)
DRDO, Ministry of Defence New Thippasandra Post, Bengaluru 560 075.
ఎంపిక: అకడమిక్ మార్కులు ద్వారా
చివరితేదీ: ఐటీఐ అభ్యర్థులకు సెప్టెంబర్ 14, గ్రాడ్యుయేట్/డిప్లొమా అభ్యర్థులకు సెప్టెంబర్ 21
వెబ్‌సైట్: www.drdo.gov.in

0 comments:

Post a Comment