Thursday, 28 September 2017

ఈసీఐఎల్‌లో 275 ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు, సీసీఐఎల్‌లో ఉద్యోగాలు. ECIL Recruitment 275 trade apprentices jobs,Jobs at CCL

ఈసీఐఎల్‌లో 275 ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు,

కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్ అవకాశం
-ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులు
-అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక
-నెలనెల స్టయిఫండ్


హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ట్రేడ్ అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఈసీఐఎల్ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ పరిధిలో పనిచేస్తున్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ. న్యూక్లియర్, డిఫెన్స్, సెక్యూరిటీ, ఏరోస్పేస్, ఐటీ, టెలికం ఇలా పలు రంగాలకు సంబంధించిన ఉత్పత్తులను, పరిశోధనలను చేస్తున్న జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య - 275
ట్రేడ్‌ల వారీగా ఖాళీల సంఖ్య: 
-ఫిట్టర్ - 62, టర్నర్ - 10, మెషినిస్ట్ - 2, మెషనిస్ట్ (జి) - 2, షీట్ మెటల్ వర్కర్ - 3, ఎలక్ట్రీషియన్ - 60, టూల్ మెయింటెనెన్స్ మెకానిక్ - 3, టూల్ అండ్ డై మేకర్ - 2, మెకానిక్ ఆర్ అండ్ ఏసీ - 9, మోటార్ వెహికిల్ మెకానిక్ - 2, ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఆర్ అండ్ టీవీ - 85, పెయింటర్ (జీ) - 3, కోపా - 16, వెల్డర్ - 7, ప్లంబర్ - 3, కార్పెంటర్ - 3, డీజిల్ మెకానిక్ - 3 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: అక్టోబర్ 1 నాటికి 14 ఏండ్లు నిండి ఉండాలి. 
-అప్రెంటిస్ కాలవ్యవధి: ప్లంబర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్ పోస్టులకు రెండేండ్లు. ఈ ట్రేడులకు మొదటి ఏడాది నెలకు రూ. 7694/-, రెండో ఏడాది నెలకు రూ. 8655/- ఇస్తారు.
-మిగిలిన ట్రేడ్‌ల కాలవ్యవధి ఏడాది. వీరిలో కోపా, వెల్డర్ ట్రేడ్‌లకు రూ. 7694/- ఇస్తారు. మిగిలిన ట్రేడ్‌లన్నింటికి నెలకు రూ. 8655/-
-శిక్షణనిచ్చే ప్రదేశం: ఈసీఐఎల్, హైదరాబాద్
-ఎంపిక: ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
-దరఖాస్తు: మొదట మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో రిజిస్టర్ కావాలి. తర్వాత ఈసీఐఎల్ వెబ్‌పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.
-నిర్ణీత నమూనాలో దరఖాస్తును పూర్తిచేసి కింది చిరునామాకు పంపాలి.
డిప్యూటీ జనరల్ మేనేజర్ (సీఎల్‌డీసీ), నలందా కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్ బిల్డింగ్ దగ్గర,
ఈసీఐఎల్ (పోస్టు), హైదరాబాద్ - 62
ఫోన్ నంబర్లు - 040 - 27186454/2279
చివరితేదీ: అక్టోబర్ 4

వెబ్‌సైట్: http://www.ecil.co.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీసీఐఎల్‌లో ఉద్యోగాలు.
న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ రైల్వే పరిధిలో పనిచేస్తున్న కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది నవరత్నహోదా కలిగిన సంస్థ.
మొత్తం పోస్టుల సంఖ్య: 16
విభాగాలవారీగా ఖాళీలు: 
ఎలక్ట్రీషియన్- 3, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్-1, మెకానిక్ డీజిల్-3, సర్వేయర్-3, సెక్రటేరియల్ అసిస్టెంట్-2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టం మెయిన్‌టెనెన్స్-3 , ప్రోగ్రామింగ్ అండ్ సిస్టం అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్-1
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ లేదా బోర్డు నుంచి ఇంటర్ లేదా పదోతరగతితోపాటు సంబంధిత ఐటీఐలో ఉత్తీర్ణత.
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: Group General Manager(HR)Container Corporation of India Limited C-3, Mathura Road, New Delhi - 110076
చివరితేదీ: అక్టోబర్ 15

వెబ్‌సైట్: www.concorindia.com 


.

0 comments:

Post a Comment