Friday, 8 September 2017

ఉద్యాన యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉద్యోగాలు, ఈఈఎస్‌ఎల్‌లో 138 ఉద్యోగాలు, హాల్‌లో ఉద్యోగాలు, నేవల్ డాక్‌యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు. Professors Jobs at Horticulture University,138 jobs in EESL,Hall Recruitment,Apprentice posts in Naval Dockyard.

ఉద్యాన యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉద్యోగాలు,

పీజీ, నెట్/పీహెచ్‌డీ అభ్యర్థులకు అవకాశం
- స్కోర్ కార్డ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
- మంచి జీతభత్యాలు, ఉద్యోగ భద్రత
- చివరితేదీ అక్టోబర్ 3

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Horticulture 
వివరాలు:ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ నాయకుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ జ్ఞాపకార్థంగా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 2014 డిసెంబర్ 23న ఏర్పాటుచేశారు.
- మొత్తం పోస్టుల సంఖ్య: 80
- వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి.
- ప్రొఫెసర్-6 పోస్టులు విభాగాలవారీగా ఖాళీలు: 
- ఫ్లోరి కల్చర్- 2, ఫ్రూట్ సైన్స్- 1, పీఎస్‌ఎంఏ-1, వెజిటబుల్స్- 2
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. రిసెర్చ్ పేపర్/బుక్స్‌లో 10 పబ్లికేషన్స్ ప్రచురితమై ఉండాలి. టీచింగ్ లేదా రిసెర్స్‌లో కనీసం ఎనిమిదేండ్ల అనుభవం ఉండాలి. 
- పే స్కేల్: రూ. 37,400-67,000+ అకడమిక్ గ్రేడ్ పే రూ. 10,000/-
- అసోసియేట్ ప్రొఫెసర్-26 పోస్టులువిభాగాలవారీగా ఖాళీలు: 
- బయోకెమిస్ట్రీ-1, క్రాప్ ఫిజియాలజీ-2, ఎంటమాలజీ- 1, ఫ్లోరికల్చర్-3,ఫ్రూట్ సైన్స్-7, జీపీబీఆర్- 2, ప్లాంట్ పాథాలజీ-1, పీఎస్‌ఎంఏ-3, స్టాటిస్టిక్స్-1, వెజిటబుల్ సైన్స్-5

- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ చేసి ఉండాలి. రిసెర్చ్ పేపర్స్ లేదా బుక్స్‌లో కనీసం ఐదు పబ్లికేషన్స్ ప్రచురితమై ఉండాలి. దీంతోపాటు బోధన లేదా రిసెర్చ్‌లో ఎనిమిదేండ్ల అనుభవం ఉండాలి. 
- పే స్కేల్: రూ. 37,400-67,000+ అకడమిక్ గ్రేడ్ పే రూ. 9,000 /-
- అసిస్టెంట్ ప్రొఫెసర్-48 పోస్టులువిభాగాలవారీగా ఖాళీలు: 
- అగ్రికల్చర్ ఎకనమిక్స్-2, అగ్రికల్చర్ ఇంజినీరింగ్-2, అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్-2, ఆగ్రానమీ-2, బయోకెమిస్ట్రీ-1, క్రాప్ ఫిజియాలజీ-2, ఎంటమాలజీ-4, ఫ్లోరికల్చర్-4, ఫ్రూట్ సైన్స్-6, జీపీబీఆర్-2, ప్లాంట్ పాథాలజీ-4, పీఎస్‌ఎంఏ-4,ఎస్‌ఎస్‌ఏసీ-3, స్టాటిస్టిక్స్-2, వెజిటబుల్ సైన్స్-7
- అర్హత: గుర్తింపు పొందిన అగ్రిలక్చర్ యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీతోపాటు 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. పీహెచ్‌డీ లేదా హార్టికల్చర్/ఐైల్లెడ్ సైన్సెస్ సబ్జెక్ట్‌లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హతను సాధించాలి. ప్రాంతీయ/తెలుగు భాషలో పరిజ్ఞానం ఉండాలి.
- పే స్కేల్: రూ. 15,600-39,100 + అకడమిక్ గ్రేడ్ పే రూ. 6,000/-

- అప్లికేషన్ ఫీజు: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు జనరల్/బీసీ అభ్యర్థులు రూ. 1500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 750/-చెల్లించాలి. 
- అసోసియేట్ ఫ్రొఫెసర్/ ప్రొఫెసర్ పోస్టులకు జనరల్/బీసీ అభ్యర్థులు రూ. 2000/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 1000/-చెల్లించాలి. ఫీజును కింది అడ్రస్‌కు చెల్లించాలి.ది రిజిస్ట్రార్, ది కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్రనగర్ (హైదరాబాద్)లో చెల్లించే విధంగా డిమాండ్ డ్రాఫ్టు (డీడీ) తీయాలి.
- ఎంపిక విధానం: సెల్ఫ్ అసెస్‌మెంట్ స్కోర్ కార్డు (అకడమిక్ మార్కులు)కు 75 మార్కులు, ఇంటర్వ్యూకు 25 మార్కులు. 
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తును పూర్తిగా నింపి, సంబంధిత సర్టిఫికెట్లను, డీడీని జతచేసి కింది అడ్రస్‌కు పంపించాలి. 
చిరునామా: REGISTRAR Sri Konda Laxman Telangana State Horticu ltural University Rajendranagar, Hyderabad - 500 030
- దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 3

- వెబ్‌సైట్: www.skltshu.ac.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈఈఎస్‌ఎల్‌లో 138 ఉద్యోగాలు,

ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్/ఇంజినీర్ పోస్టుల (తాత్కాలిక, రెగ్యులర్ పద్ధతిలో) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
EESL 
వివరాలు: ఈఈఎస్‌ఎల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తుంది. 
- మొత్తం పోస్టుల సఖ్య: 138

రెగ్యులర్ పద్ధతిలో భర్తీచేసే పోస్టులు.. 
- డిప్యూటీ మేనేజర్- 8 పోస్టులు
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ+ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ (ఫైనాన్స్)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో నాలుగేండ్ల అనుభవం. 
- అసిస్టెంట్ మేనేజర్-1 పోస్టు
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి కంపెనీ సెక్రటరీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
- ఆఫీసర్/అసిస్టెంట్-7 పోస్టులు
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి కంపెనీ సెక్రటరీ, ఎంకాం, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (హెచ్‌ఆర్, పర్సనల్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్, సైకాలజీ), ఎంబీఏలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాదిపాటు అనుభవం ఉండాలి.
- వయస్సు: 30 ఏండ్లకు మించరాదు (అసిస్టెంట్ మేనేజర్‌కు 37 ఏండ్లు మించరాదు).

క్రాంటాక్ట్ పద్ధతిలో భర్తీచేసే పోస్టులు.. 
- అసిస్టెంట్ మేనేజర్-2 పోస్టులు
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ+ మాస్టర్ డిగ్రీ (ఇంటర్నేషనల్/గ్లోబల్ బిజినెస్)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో రెండేండ్లపాటు అనుభవం ఉండాలి.
- వయస్సు: 37 ఏండ్లకు మించరాదు.
- అసిస్టెంట్ ఇంజినీర్ (గ్రేడ్-3)-115 పోస్టులు (జనరల్-52, ఓబీసీ-35, ఎస్సీ-19, ఎస్టీ-9)
- అర్హత: ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత.
- వయస్సు: 27 ఏండ్లకు మించరాదు.
- అసిస్టెంట్ ఇంజినీర్ (గ్రేడ్-2)-5 పోస్టులు
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాదిపాటు అనుభవం ఉండాలి.
- వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
- అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 1000/-, ఓబీసీ అభ్యర్థులకు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
- ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ 
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబర్ 15
- దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 25 

- వెబ్‌సైట్: http://recruitment.eeslindia.org


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హాల్‌లో ఉద్యోగాలు,
వివరాలు: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఒక నవరత్న కంపెనీ. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ సంస్థ. ఈ సంస్థ ఎయిర్‌క్రాఫ్ట్స్, హెలికాప్టర్లు, ఏరో ఇంజిన్స్, ఏవియానిక్స్ అండ్ సిస్టమ్స్, స్ట్రక్చరల్ కాంపొనెంట్స్‌లను ఉత్పత్తి చేస్తుంది.
- పోస్టులు - ఖాళీల సంఖ్య
- స్టాఫ్ నర్స్- 5, ల్యాబ్ టెక్నీషియన్- 1, ఫార్మాసిస్ట్- 2, రిఫ్రాక్షనిస్ట్- 1, డ్రెస్సర్- 4 ఖాళీలు ఉన్నాయి.
- ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా.
- వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
- చివరితేదీ: సెప్టెంబర్ 14

- వెబ్‌సైట్: www.hal-india.com 



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేవల్ డాక్‌యార్డ్‌లో అప్రెంటిస్ పోస్టులు.





ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో పలు ట్రేడుల్లో అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్ కోసం డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
navaldockyard
వివరాలు: నేవల్ డాక్‌యార్డ్ కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోపనిచేస్తుంది. అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం శిక్షణ కోసం ఈ నోటిఫికేషన్‌ను విడుదలచేసింది.
- మొత్తం ఖాళీల సంఖ్య- 111. వీటిలో జనరల్ - 69, ఓబీసీ- 21, ఎస్టీ- 9, ఎస్సీ- 12 ఖాళీలు ఉన్నాయి.

ట్రేడుల వారీగా ఖాళీలు - అర్హతలు:
- ఎలక్ట్రికల్ ఫిట్టర్- 49
- అర్హతలు: ఐటీఐలో ఎలక్ట్రానిక్ మెకానిక్ లేదా మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్‌లో ఉత్తీర్ణులు.

జీటీ ఫిట్టర్- 25
- అర్హతలు: ఐటీఐలో డీజిల్ మెకానిక్
కంప్యూటర్ ఫిట్టర్ - 10
- అర్హతలు: ఐటీ/ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ లేదా ఎలక్ట్రానిక్ మెకానిక్/మెకానిక్ రేడియో అండ్ టీవీ లేదా మెకానిక్స్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టం ట్రేడుల్లో ఉత్తీర్ణులు.

బాయిలర్ మేకర్- 12
- అర్హతలు: షిప్‌రైట్ స్టీల్/వెల్డర్ లేదా ఫిట్టర్ లేదా ప్రాగర్ అండ్ హీట్ ట్రీటర్ ట్రేడులలో ఉత్తీర్ణులు.

వెపన్ ఫిట్టర్- 15
- అర్హతలు: మెకానిక్ మెషీన్ టూల్ మెయింటెనెన్స్ లేదా మిల్‌రైట్ మెయింటెనెన్స్ మెకానిక్ ట్రేడుల్లో ఉత్తీర్ణులు అర్హులు.
- వయస్సు: పై అన్ని ట్రేడులకు 14-21 ఏండ్ల మధ్య ఉండాలి.
- శారీరక ప్రమాణాలు: కనీసం 137 సెం.మీ. ఎత్తు ఉండాలి. బరువు కనీసం 25.4 కిలోలు ఉండాలి. గాలిపీల్చినప్పుడు ఛాతీ కనీసం 3.6 సెం.మీ. వ్యాకోచించాలి.
- స్టయిఫండ్: మొదటి ఏడాది సెమీస్కిల్డ్ వర్కర్స్‌కు ఇచ్చే కనీస వేతనాల్లో 70 శాతం వేతనం ఇస్తారు. రెండో ఏడాది 80 శాతం వేతనం ఇస్తారు.
- ఎంపిక: రాతపరీక్ష ద్వారా
- రాతపరీక్ష: సెప్టెంబర్ 17.
- పరీక్ష కాలవ్యవధి 2 గంటలు. 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
- పరీక్షలో రెండు పార్ట్‌లు ఉంటాయి.. పార్ట్- ఏలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్/రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
- పార్ట్ -బీలో సంబంధిత ట్రేడుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
- పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు. మెరిట్‌లిస్ట్ ప్రకారం అభ్యర్థులకు వైద్యపరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపికచేస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. (www.bhartiseva.com)
- చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడదలైన 21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.
- పూర్తి వివరాల కోసం 022-22751969లో సంప్రదించవచ్చు

0 comments:

Post a Comment