Friday, 22 September 2017

ఏఏఐలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, హైదరాబాద్‌లో 126 సైట్ ఇంజినీర్లు, ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో ఆఫీసర్లు, ఎస్‌ఆర్‌డీఎస్‌లో మేనే జర్లు, సెబీలోఅసిస్టెంట్ మేనేజర్లు. AAI Recruitment Junior executives,There are 126 site engineers Jobs in Hyderabad,Officers in the RCFL,Managers Jobs in SRDS,Assistant Managers Jobs in SEBI

ఏఏఐలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లు,

-ఇంజినీరింగ్ అభ్యర్థులకు అవకాశం
-గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక
-విమానయాన శాఖలో ఉద్యోగం
-మంచి జీతభత్యాలు, ఉద్యోగభద్రత

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ (గేట్ స్కోర్-2016 ఆధారంగా) పోస్టుల భర్తీకి అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
మినీరత్న గుర్తింపు పొందిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వంలోని పౌర విమానయాన శాఖ ఆధ్వర్యలో నడుస్తున్న సంస్థ.
పోస్టు పేరు: జూనియర్ ఎగ్జిక్యూటివ్
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, సివిల్, ఎలక్ట్రికల్
మొత్తం పోస్టుల సంఖ్య: 200
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్)-50 పోస్టులు (జనరల్-27, ఓబీసీ-13, ఎస్సీ-7, ఎస్టీ-3)
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్)-100 పోస్టులు (జనరల్-66, ఓబీసీ-17, ఎస్సీ-11, ఎస్టీ-6 )
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్)-50 పోస్టులు (జనరల్-27, ఓబీసీ-13, ఎస్సీ-7, ఎస్టీ-3)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/డీమ్డ్ యూనివర్సిటీ లేదా ఐఐటీ సంస్థ నుంచి ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (బీఈ/బీటెక్) ఉత్తీర్ణత. సంబంధిత బ్రాంచిలో గేట్-2016 స్కోర్‌ను కలిగి ఉండాలి.
వయస్సు: 2017 సెప్టెంబర్ 30 నాటికి గరిష్ఠంగా 27 ఏండ్లకు మించరాదు. ఏఏఐ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ. 16400-3%-40500 /-, ప్రాథమిక చెల్లింపుతోపాటు, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ బెనిఫిట్స్ తదితర సౌకర్యాలతోపాటు ఏడాదికి రూ. 7.2 లక్షలు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ. 300/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తు ఫీజును కేవలం ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
ఎంపిక విధానం: గేట్ 2016 స్కోర్ ఆధారంగా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొనేటప్పుడు వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబరును తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ : అక్టోబర్ 17
వెబ్‌సైట్: www.aai.aero


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హైదరాబాద్‌లో 126 సైట్ ఇంజినీర్లు,
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్‌ఏసీ) సైట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:
హైదరాబాద్‌లోని ఎన్‌ఏసీని 1998లో ఏర్పాటుచేశారు. ప్రస్తుత పోస్టులు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రాజెక్టుల కోసం జీఎస్‌ఎస్ ఇన్ఫోటెక్ ద్వారా అవుట్‌సోర్సింగ్ కింద భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను బీఈ/బీటెక్ లేదా ఏఎంఐఈలో మెరిట్ ఆధారంగా భర్తీచేస్తారు.
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సులో సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
వయస్సు: 21 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ. 20,000/-
కాంట్రాక్టు కాలవ్యవధి: ఏడాది
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
చివరితేదీ: సెప్టెంబర్ 20 (సాయంత్రం 5)
ఎంపికైన అభ్యర్థుల వివరాలను సెప్టెంబర్ 22న ఎన్‌ఏసీ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తారు.
సెప్టెంబర్ 26న అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇస్తారు.
అక్టోబర్ 3లోగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: http://nac.edu.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో ఆఫీసర్లు,
ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్) ఫైనాన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఫెర్టిలైజర్స్, ఇండస్ట్రియల్ కెమికల్స్ రంగంలో తయారీ, మార్కెటింగ్ చేస్తున్న సంస్థ.
పోస్టు పేరు: ఆఫీసర్
మొత్తం పోస్టుల సంఖ్య: 14
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సీఏ/సీఎంఏ, బీకాం + ఎంబీఏ/ఎంఎంఎస్ లేదా పీజీ/తత్సమాన పరీక్షలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 సెప్టెంబర్ 1 నాటికి 35 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 16,400-40,500/-
దరఖాస్తు ఫీజు: రూ. 700/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 13
వెబ్‌సైట్: www.rcfltd.com----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌ఆర్‌డీఎస్‌లో మేనే జర్లు,
సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఎస్‌ఆర్‌డీఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ (కాంట్రాక్టు ప్రాతిపదికన ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఎస్‌ఆర్‌డీఎస్ అనేది తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
అసిస్టెంట్ మేనేజర్ (విజిలెన్స్)-29 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఎంబీఏ/మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత.
పే స్కేల్: రూ. 20,000/-
డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్-14 పోస్టులు
అర్హత: ఐఆర్‌ఎంఏ నుంచి పీజీడీఆర్‌ఎం లేదా ఎంఏ (రూరల్ డెవలప్‌మెంట్)/తత్సమాన పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత.
పే స్కేల్: రూ. 40,000/-
వయస్సు: 38 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరితేదీ: సెప్టెంబర్ 24
వెబ్‌సైట్:www.rdhrms.telangana.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెబీలోఅసిస్టెంట్ మేనేజర్లు.


ముంబైలోని సెక్యూరిటీస్ & ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఐటీ విభాగం లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
సెబీని 1992 ఏప్రిల్ 12న ఏర్పాటు చేశారు.
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్
ఖాళీల సంఖ్య: 4
అర్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ప్రథమశ్రేణి బీఈ/బీటెక్ లేదా ఎంసీఏలో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 జూన్ 30 నాటికి 27 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 28,150-55,600/-
అప్లికేషన్ జు: రూ. 600/-, ఎస్సీ , ఎస్టీ పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 100/-
ఎంపిక : ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 29
ఆన్‌లైన్ పరీక్షతేదీ: అక్టోబర్ 29
వెబ్‌సైట్: www.sebi.gov.in


0 comments:

Post a Comment