Friday, 22 September 2017

ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు, బీఎస్‌ఎఫ్‌లో 1074 కొలువులు, ఇస్రోలో 80 సైంటిస్ట్/ఇంజినీర్లు, బీపీసీఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు, Special Cadre Officers in SBI,BSF Recruitment 1074 Posts,80 scientists engineers Jobs in ISRO,Management Trainees Jobs In BPCL,

ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు,

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) లా విభాగంలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్‌బీఐని 1955 జూలై1న ఏర్పాటుచేశారు.
పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్ (లా)
మొత్తం పోస్టుల సంఖ్య: 40 (జనరల్-21, ఓబీసీ-10, ఎస్సీ-6, ఎస్టీ-3)
పోస్టు పేరు: డిప్యూటీ జనరల్ మేనేజర్ (లా)-1 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడేండ్ల/ఐదేండ్ల లా డిగ్రీలో ఉత్తీర్ణత. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎన్‌రోల్ చేసుకొని ఉండాలి. బ్యాంక్స్/ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లలో లీగల్ డిపార్ట్‌మెంట్‌లో లేదా సంబంధిత బ్యాంకింగ్ రంగంలో ఎక్స్‌పీరియన్స్‌ను కలిగి ఉండాలి.
వయస్సు: 2017 సెప్టెంబర్ 1 నాటికి 35 ఏండ్లకు (డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 45 ఏండ్లు) మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 100/-
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
డిప్యూటీ మేనేజర్‌కు రాతపరీక్ష+ఇంటర్వ్యూ, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపికచేస్తారు.
రాతపరీక్షలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, సంబంధిత ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అంశాల నుంచి ప్రశ్నలను ఇస్తారు.
మొత్తం 220 మార్కులకుగాను 170 ప్రశ్నలను ఇస్తారు. 135 నిమిషాలలో పరీక్షను పూర్తిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా . ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పంపిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకొని, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌తో పాటు సంబంధిత జిరాక్స్ సర్టిఫికెట్లను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పోస్ట్ ద్వారా పంపించాలి.
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: అక్టోబర్ 6
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: అక్టోబర్ 10
-ఆన్‌లైన్ పరీక్షతేదీ: నవంబర్ 11
-వెబ్‌సైట్: www.statebankofindia.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఎస్‌ఎఫ్‌లో 1074 కొలువులు,
10వ తరగతి + ఐటీఐ ఉత్తీర్ణులకు అవకాశం
-రాతపరీక్ష ద్వారా ఎంపిక
-అన్ని రాష్ర్టాల అభ్యర్థులకు అవకాశం

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్)లో కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను డైరెక్టరేట్ ఆఫ్ జనరల్, బీఎస్‌ఎఫ్ ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
బీఎస్‌ఎఫ్ దేశ సరిహద్దుల్లో రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన దళం. ఇది కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది.
పోస్టు: కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్)
మొత్తం ఖాళీల సంఖ్య - 1074.

విభాగాల వారీగా ఖాళీలు...
కాబ్లర్ - 67, టైలర్ - 28, కార్పెంటర్ - 2, డ్రాఫ్ట్స్‌మెన్ - 1, పెయింటర్ - 5, కుక్ - 332, వాటర్ క్యారియర్ - 177, వాషర్‌మ్యాన్ - 131, బార్బర్ -85, స్వీపర్ - 212, వెయిటర్ - 27, మాలి - 1, ఖోజి - 6 ఖాళీలు ఉన్నాయి.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,000/- ( 7వ పే కమిషన్‌లో పే మ్యాట్రిక్స్ లెవల్ 3 ప్రకారం వేతనాలు ఇస్తారు)
వయస్సు: 2017, ఆగస్టు 1 నాటికి 18 - 23 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్స్‌లో కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి లేదా సంబంధిత ట్రేడుల్లో ఏడాది కాలవ్యవధిగల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణత లేదా రెండేండ్ల ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణత.
BSF

శారీరక ప్రమాణాలు:
కనీసం 167.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ - 78 సెం.మీ. ఉండాలి. గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి.
ఎస్టీ, ఆదివాసి, మిజో, నాగా అభ్యర్థులు 162.5 సెం.మీ. ఎత్తు ఉంటే సరిపోతుంది. ఛాతీ 76 సెం.మీ., గాలిపీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి.
ఎంపిక విధానం: కింది పద్ధతుల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ)
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఎఫ్‌టీ) దీనిలో 24 నిమిషాల్లో 5 కి.మీ. దూరాన్ని పరుగెత్తాలి.
పీఎఫ్‌టీ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు.
ఒక్క అభ్యర్థిని ఒక్క ట్రేడ్ టెస్ట్‌కు మాత్రమే అనుమతిస్తారు.
ట్రేడ్‌టెస్ట్‌లో క్వాలిఫై అయినవారికి రాతపరీక్ష నిర్వహిస్తారు.

రాతపరీక్ష:
-100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు.
-జనరల్, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు 35 శాతం మార్కులు, ఇతర అభ్యర్థులకు 33 శాతం మార్కులు క్వాలిఫయింగ్ మార్కులుగా నిర్ణయించారు.
-రాతపరీక్షలో జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లేదా హిందీలో ప్రాథమిక నాలెడ్జ్‌ను పరీక్షిస్తారు.
-రాతపరీక్షలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించినవారికి పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లో దరఖాస్తును పూర్తిచేసి పంపాలి. ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో సెప్టెంబర్ 12న ప్రచురితమైంది.
వెబ్‌సైట్: www.bsf.nic.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇస్రోలో 80 సైంటిస్ట్/ఇంజినీర్లు,
డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్/ఇంజినీర్స్ (ఎస్‌సీ) ఉద్యోగాల భర్తీకి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఐసీఆర్‌బీ) అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ISRO

వివరాలు:
బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఏర్పాటుచేసిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను విక్రమ్ సారాభాయ్ 1969 ఆగస్టు 15న స్థాపించారు. ఇది అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ.
పోస్టు పేరు: సైంటిస్ట్/ఇంజినీర్స్(ఎస్‌సీ)
మొత్తం పోస్టుల సంఖ్య: 80
సైంటిస్ట్/ఇంజినీర్స్(ఎస్‌సీ) - 35 పోస్టులు (ఎలక్ట్రానిక్స్)
సైంటిస్ట్/ఇంజినీర్స్(ఎస్‌సీ) - 35 పోస్టులు (మెకానికల్)
సైంటిస్ట్/ఇంజినీర్స్(ఎస్‌సీ) - 10 పోస్టులు (కంప్యూటర్ సైన్స్)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ ( ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్)లో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సీజీపీఏ 6.84 టెన్ స్కేల్ క్వాలిఫైయింగ్ డిగ్రీ/ఏఎమ్‌ఐఈ/గ్రేడ్ ఐఈటీఈలో సీజీపీఏ 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 అక్టోబర్ 5 నాటికి 35 ఏండ్లకు మించరాదు
పేస్కేల్: రూ. 56,100/- అదనంగా ఇంటిఅద్దె, రవాణా అలవెన్స్, ఉద్యోగుల కొత్త పెన్షన్ పథకం, గ్రూప్ ఇన్సూరెన్స్, వైద్య తదితర ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.
పనిచేసే ప్రదేశం: దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో సెంటర్/యూనిట్లలో
అప్లికేషన్ ఫీజు: రూ. 100/- ఫీజును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలానా ద్వారా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: అకడమిక్ ప్రతిభ, బయోడేటా ఆధారంగా మొదట స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత అర్హత గల అభ్యర్థులకు రాతపరీక్షను, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
-రాతపరీక్షకు షార్ట్‌లిస్ట్ పొందిన అభ్యర్థులకు ఈ- మెయిల్ ద్వారా 2017 డిసెంబర్ రెండో/మూడో వారంలో తెలియజేస్తారు.
-రాతపరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో సంబంధిత సబెక్ట్ నుంచి 80 ప్రశ్నలు ఇస్తారు. అంటే పరీక్ష 80 మార్కులకు ఉంటుంది.
-రాత పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
-రాతపరీక్ష తేదీ: డిసెంబర్ 24
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, భోపాల్, చండీగఢ్, చెన్నై, గువాహటి, లక్నో, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, తిరువనంతపురం.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఇస్రో వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్‌చేయాలి. ఫీజు బ్యాంక్ చలానాను సంబంధిత పర్సనల్ అధికారికి ఆర్డినరీ పోస్ట్‌లో పంపాలి.
చిరునామా: Administrative Officer [ICRB], ISRO Headquarters, Bengaluru
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 5
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీ పంపడానికి చివరితేదీ:అక్టోబర్ 12
-వెబ్‌సైట్: http://www.isro.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీపీసీఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు,


భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)లో గేట్- 2018 స్కోర్ ఆధారంగా ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ
అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచిలో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 50 శాతం) మార్కులతో బీఈ/బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
వయస్సు: 2018 జూన్ 1 నాటికి 25 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 24,900-50,500/-. ట్రెయినింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఏడాదికి రూ. 14.10 లక్షలు జీతం చెల్లిస్తారు.
ఎంపిక: గేట్ 2018 స్కోర్ + గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరితేదీ: అక్టోబర్ 5 (గేట్ 2018 )
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 2
వెబ్‌సైట్: bharatpetroleum.com


0 comments:

Post a Comment