Thursday, 17 August 2017

బీఎమ్‌ఆర్‌సీఎల్‌లో సెక్షన్ ఇంజినీర్లు, ఐఆర్‌డీఏలో అసిస్టెంట్ మేనేజర్లు. Section Engineers jobs in BMRCL,Assistant Managers jobs in IRDA.

బీఎమ్‌ఆర్‌సీఎల్‌లో సెక్షన్ ఇంజినీర్లు,

కర్ణాటకలోని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎమ్‌ఆర్‌సీఎల్) ఖాళీగా ఉన్న సెక్షన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి (తాత్కాలిక ప్రాతిపదికన) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Metrorail
వివరాలు: బీఎమ్‌ఆర్‌సీఎల్ అనేది కేంద్ర ం, కర్ణాటక ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్.
పోస్టు పేరు: సెక్షన్ ఇంజినీర్
-మొత్తం పోస్టుల సంఖ్య -20
విభాగాలవారీగా ఖాళీలు: టెలికం-2, రోలింగ్‌స్టాక్-2, ట్రాక్షన్-2, ఏఎఫ్‌సీ-2, సిగ్నలింగ్-1, సివిల్/ఆర్‌ఎస్‌ఎస్-2, సిస్టమ్ డిజైన్-2, లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్, ఈ అండ్ ఎం-3, టీవీఎస్ అండ్ ఈసీఎస్-2, డిపో-2
అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి
పే స్కేల్: రూ. 35,910 (కన్సాలిడేటెడ్ పే),
వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
ఎంపిక: ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. పూర్తి వివరాలతోపాటు వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను నిర్ణీత తేదీలోగా సంబంధిత
పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: General Manager (HR), Bangalore Metro Rail Corporation Limited, III Floor, BMTC Complex, K.H.Road, Shanthinagar, Bangalore 560027
చివరితేదీ: ఆగస్టు 26
వెబ్‌సైట్: www.bmrc.co.in





----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఆర్‌డీఏలో అసిస్టెంట్ మేనేజర్లు.





.ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏ)లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. irda వివరాలు: ఐఆర్‌డీఏను పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటుచేశారు. ఇది ప్రభుత్వ పరిధిలోని సంస్థ. ప్రస్తుత నోటిఫికేషన్‌ను హైదరాబాద్ కార్యాలయం విడుదల చేసింది. పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ -ఖాళీల సంఖ్య - 30. వీటిలో జనరల్ - 16, ఓబీసీ - 7, ఎస్సీ-4, ఎస్టీ - 3 ఖాళీలు ఉన్నాయి. నోట్: వీటిలో 4 పోస్టులు యాక్చురియల్, నాలుగు అకౌంట్స్, 2 లీగల్ స్పెషలైజేషన్స్ పోస్టులుగా గుర్తించారు. అర్హతలు: యాక్చురియల్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చురియస్ ఆఫ్ ఇండియా నుంచి 9 పేపర్లు ఉత్తీర్ణత. అకౌంట్స్ పేపర్‌కు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, ఏసీఏ, ఏఐసీడబ్ల్యూ, ఏసీఎంఏ, సీఎఫ్‌ఏల్లో ఏదో ఒక కోర్సు ఉత్తీర్ణత. -లీగల్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత. -జనరల్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: 2017, సెప్టెంబర్ 5 నాటికి 21 - 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు. ఎంపిక: ఫేజ్ - Iలో ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. -ఫేజ్ - II డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. దీనిలో మూడు పేపర్లు ఉంటాయి. -ఫేజ్ - III ఇంటర్వ్యూ. పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్ దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చివరితేదీ: సెప్టెంబర్ 5 వెబ్‌సైట్: https://www.irdai.gov.in

0 comments:

Post a Comment