Wednesday, 9 August 2017

సీఎస్‌ఎంసీఆర్‌ఐలో సైంటిస్టులు, ఎన్‌సీసీలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు, ఎన్‌సీడీసీలో ఉద్యోగాలు. Scientists at CSMCRI,Multi-tasking staff in NCC,Trade Apprentice Jobs at NPCIL,Jobs in the Bank of Maharashtra,Jobs in NCDC

సీఎస్‌ఎంసీఆర్‌ఐలో సైంటిస్టులు,

సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రిసెర్చ్ (సీఎస్‌ఎంసీఆర్‌ఐ) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు: సీఎస్‌ఎంసీఆర్‌ఐ జాతీయ పరిశోధన సంస్థ. ఈ సంస్థ సీఎస్‌ఐఆర్ పరిధిలో పనిచేస్తుంది.
సీనియర్ సైంటిస్ట్ - 1
జీతం: రూ. 91,564/-
వయస్సు: 37 ఏండ్లు మించరాదు
సైంటిస్ట్ (లెవల్ 11)- 8 పోస్టులు.
జీతం: రూ. 79, 190/-
వయస్సు: 32 ఏండ్లు మించరాదు
సైంటిస్ట్/సీనియర్ సైంటిస్ట్ - 1
జీతం: రూ. 79, 190/-
వయస్సు: 32 ఏండ్లు మించరాదు
పనిచేయాల్సిన ప్రదేశం: భావ్‌నగర్, గుజరాత్
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఫీజు: రూ. 100/-
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: సెప్టెంబర్ 8
వెబ్‌సైట్: http://www.csmcri.org
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీసీలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్,

సికింద్రాబాద్‌లోని నేషనల్ క్యాడిట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) డైరెక్టరేట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోని డీఏవీపీ (నోడల్ ఏజెన్సీ) ఆధ్యర్యంలో ఎన్‌సీసీ నడుస్తుంది.
పోస్ట్ పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్
పోస్టుల సంఖ్య-4 పోస్టులు (ప్యూన్-2, సైకీ టెక్నికల్ అటెండెంట్-1, కారు డ్రైవర్ టెక్నికల్ అటెండెంట్-1)
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలోఉత్తీర్ణత
వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి
ఎంపిక : రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చివరి తేదీ: సెప్టెంబర్ 4
చిరునామా: NCC Directorate, Andhra Pradesh & Telangana
Gen.Choudhari Road, Secunderabad - 500 003
వెబ్‌సైట్: www.davp.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌పీసీఐఎల్‌లో  ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు,

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐఎల్) ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు: 
ఎన్‌పీసీఐఎల్ ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ. అటామిక్ ఎనర్జీ విభాగం కింద ఇది పనిచేస్తుంది. దీన్ని 1987లో ప్రారంభించారు. 
పోస్టు: ట్రేడ్ అప్రెంటిస్
ఖాళీల సంఖ్య - 80
విభాగాల వారీగా ఖాళీలు..
-ఫిట్టర్ - 15, టర్నర్ - 5, మెకానిస్ట్ - 5
-ఎలక్ట్రీషియన్ - 20, వెల్డర్ - 10
-ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ - 15
-ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 10
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. 
వయస్సు: 18- 24 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పనిచేయాల్సిన ప్రదేశం: దేశవ్యాప్తంగా ఎక్కడైనా
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: ఆగస్టు 24

వెబ్‌సైట్: http://www.npcil.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు,

జాతీయ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సెక్యూరిటీ ఆఫీసర్ (మేనేజర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: పుణె ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా 29 రాష్ర్టాల్లో 1895 బ్రాంచి నెట్‌వర్క్‌లను కలిగి ఉంది. 
పోస్టు పేరు: సెక్యూరిటీ ఆఫీసర్ (మేనేజర్)
మొత్తం పోస్టుల సంఖ్య: 13 పోస్టులు (జనరల్-9, ఓబీసీ-3, ఎస్సీ-1)
వేతనం: రూ. 31,705-45,950+ నింబంధన ప్రకారం అలవెన్స్‌లు చెల్లిస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, పారామిలిటరీ, పోలీస్ విభాగాల్లో నిర్దేశిత హోదాల్లో ఐదేండ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయస్సు: 25 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి. 
అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 100/-
ఎంపిక: రాతపరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో అభ్యర్థి ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. 
చివరితేదీ: సెప్టెంబర్ 9

వెబ్‌సైట్:www.bankofmaharashtra.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీడీసీలో ఉద్యోగాలు.

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: ఎన్‌సీడీసీని 1909లో హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రారంభించారు. మొదట ఈ సంస్థ అంటువ్యాధుల సంబంధిత అంశాలపై దేశవ్యాప్తంగా సేవలు అందించేది.తదనంతర కాలంలో ఇది విస్తృతమైంది.
రిసెర్చ్ అసోసియేట్ - 1, మెడికల్ సోషల్ వర్కర్ - 6, ల్యాబ్ టెక్నీషియన్ - 3, ఫీల్డ్ వర్కర్ - 3 ఖాళీలు ఉన్నాయి. 
ఎంపిక: రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
ఇంటర్వ్యూతేదీ: ఆగస్టు 23

వెబ్‌సైట్: http://www.ncdc.gov.in


0 comments:

Post a Comment