Wednesday, 9 August 2017

కెన్‌ఫిన్‌లో ప్రొబేషనరీ అసిస్టెంట్లు, నిట్ రూర్కెలాలో ప్రొఫెసర్లు, ఐఐఎస్‌సీలో ఇన్‌స్ట్రక్టర్లు, టీవీవీపీలో డాక్టర్లు. Probationary Assistants in Canfin,Professors jobs at Nit Rourkela,Instructs jobs in IISC,Doctors jobs in TVVP.

కెన్‌ఫిన్‌లో ప్రొబేషనరీ అసిస్టెంట్లు,

బెంగళూరులోని కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ అసిస్టెంట్ ( క్లరికల్ క్యాడర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ అనేది కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ
-పోస్టు పేరు: ప్రొబేషనరీ అసిస్టెంట్
-మొత్తం పోస్టుల సంఖ్య-30
-ప్రాంతాలవారీగా ఖాళీలు: బెంగళూరు-8, చెన్నై-4, హైదరాబాద్-5, ముంబై-4, జైపూర్-2, భోపాల్-1, ఇండోర్-1, ఢిల్లీ/నోయిడా-5
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఏదైనా పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత. కంప్యూటర్ అప్లికేషన్/డాటా ఎంట్రీలో పరిజ్ఞానం ఉండాలి. ప్రాంతీయభాషతోపాటు ఇంగ్లిష్‌లో రాయడం, మాట్లాడటం, చదవడం రావాలి.
-వయస్సు: 2017 మే 1 నాటికి 21 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
-ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
-పే స్కేల్ : రూ. 9200-28750/- అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర అలవెన్సులు ఇస్తారు.
-డ్రైవర్ కమ్ ఫ్యూన్-2 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత. మోటారుకారు డ్రైవింగ్‌లైసెన్స్ ఉండాలి.
-పే స్కేల్: రూ. 15,000+ ఇతర అలవెన్సులు నెలకు రూ. 2000/- ఇస్తారు.
-వయస్సు: 36 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరి తేదీ: ఆగస్టు 14 ( డ్రైవర్ కమ్ ఫ్యూన్, పోస్టుకు ఆగస్టు 16)
-వెబ్‌సైట్: www.canfinhomes.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిట్ రూర్కెలాలో ప్రొఫెసర్లు,
రూర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నతవిద్యను అభ్యసించడానికి దీన్ని ఏర్పాటుచేశారు. గతంలో దీన్ని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్ రూర్కెలా గా పిలిచేవారు.
-పోస్టు పేరు: ప్రొఫెసర్. వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ . సంబంధిత పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. టీచింగ్/రిసెర్చ్‌లో అనుభవం ఉండాలి.
-వయస్సు: సంస్థ నింబంధనల ప్రకారం అర్హతలను కలిగి ఉండాలి.
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరి తేదీ: సెప్టెంబర్ 11
-వెబ్ సైట్: www.nitrkl.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్‌సీలో ఇన్‌స్ట్రక్టర్లు,

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)లో ఖాళీగా ఉన్న ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి అర్హులై అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:దేశంలోనే ఐఐఎస్సీ ఉన్నత విద్య, పరిశోధనల కోసం నిర్దేశించిన అత్యున్నత విశ్వవిద్యాలయం. 1909లో జంషెడ్జీ టాటా స్థాపించారు.
-పోస్టు పేరు: ఇన్‌స్ట్రక్టర్
-విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, మెటీరియల్స్
-మొత్తం ఖాళీలు: 7 (జనరల్-2, ఓబీసీ-3, ఎస్సీ-1, ఎస్టీ-1).
-వేతనం: రూ. 52,000 నుంచి రూ. 77,000.
-అర్హతలు: సంబంధిత విభాగాలను అనుసరించి పీహెచ్‌డీ, రెండేండ్ల ఉద్యోగానుభవం.
-వయోపరిమితి: 2017 ఆగస్టు 11 నాటికి 35 ఏండ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ కేటగిరీ అభ్యర్థులకు సంస్థ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక విధానం: సీవీ, ఇంటర్వ్యూ
-దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా. నిర్దేశిత నమూనాలో దరఖాస్తు పత్రాన్ని నింపి, దానికి తాజా రెజ్యూమే లేదా సీవీని జతచేసి ఈ-మెయిల్ ద్వారా(recruitment@admi-.iisc.ernet.in లేదా ugpr@ug.iisc.in ) నిర్ణీత గడువులోగా పంపాలి.
-దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 11
-వెబ్‌సైట్: www.iisc.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీవీవీపీలో డాక్టర్లు.
రంగారెడ్డి జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఏరియా హాస్పిటల్లో ఖాళీగా ఉన్న స్పెషాలిటీ డాక్టర్ పోస్టుల (నిర్ణీత కాలానికి) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖలో అనుబంధగా ఉన్న టీవీవీపీ మొత్తం 102 హాస్పిటల్స్‌ను పర్యవేక్షిస్తున్నది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 12 పోస్టులు (గైనకాలజీ-5, పీడియాట్రిక్స్-4, అనస్థీషియా-3)
-పోస్టు పేరు: స్పెషాలిటీ డాక్టర్
-ఏరియా హాస్పిటల్ కొండాపూర్, ఏరియా హాస్పిటల్ వనస్థలిపురం, సీహెచ్‌సీ షాద్‌నగర్‌లో ఈ ఖాళీలను భర్తీచేస్తారు.
-అర్హత: గుర్తింపు పొదిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-ఎంపిక: అకడమిక్ మెరిట్/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనా దరఖాస్తులను నింపి పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: సూపరింటెండెంట్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, కొండాపూర్, రంగారెడ్డి జిల్లా
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 21
-వెబ్‌సైట్: http://vvp.telangana.gov.in


0 comments:

Post a Comment