Monday, 28 August 2017

ఫెడరల్ బ్యాంక్‌లో ఆఫీసర్/క్లర్క్‌లు, ఏఐఈఎస్‌ఎల్‌లో టెక్నీషియన్లు. Officer / Clerks Jobs in Federal Bank,Technicians Jobs in AIESL.

ఫెడరల్ బ్యాంక్‌లో ఆఫీసర్/క్లర్క్‌లు,

బ్యాంక్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్, క్లరికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
ఫెడరల్ బ్యాంక్ అనేది దేశంలో ప్రైవేట్ సెక్టార్‌లోని ఒక లీడింగ్ బ్యాంక్.
- పోస్టు పేరు: క్లర్క్
- అర్హత: పొందిన యూనివర్సిటీ నుంచి 60 బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
- వయస్సు: 2017 జూలై 1 నాటికి 24 ఏండ్లకు మించరాదు.
- పోస్టు పేరు: ఆఫీసర్

- అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
- వయస్సు: 2017 జూలై 1 నాటికి 26 ఏండ్లకు మించరాదు.
- పే స్కేల్: క్లర్క్‌కు రూ. 11765-31540/- ,ఆఫీసర్‌కు రూ. 23700-42020/- ప్రదేశాన్ని బట్టి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏతోపాటు బ్యాంక్ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు. మెడికల్ బిల్లు, హెల్త్ స్కీమ్, కన్సెషన్ లీవ్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ తదితర సౌకర్యాలు ఉంటాయి.
- అప్లికేషన్ ఫీజు: ఆఫీసర్ పోస్టులకు రూ. 700/- జనరల్, ఓబీసీ అభ్యర్థులు (రూ. 350/- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు)
- క్లర్క్ పోస్టులకు రూ. 500/- జనరల్, ఓబీసీ అభ్యర్థులు (రూ. 250/- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు)
- ప్రొబేషనరీ పీరియడ్: క్లర్క్‌కు 6 నెలలు, ఆఫీసర్‌కు రెండేండ్లు.

- ఎంపిక: ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.
- పరీక్ష సిలబస్: క్లర్క్ పోస్టుకు వెర్బల్ ఎబిలిటీ/ఇంగ్లిష్ లాంగ్వేజ్, లాజికల్ ఆప్టిట్యూడ్/రీజనింగ్, క్వాంటిటేటివ్/న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్, సోషియో ఎకనామిక్ అండ్ బ్యాంకింగ్ అవేర్‌నెస్, కంప్యూటర్ అవేర్‌నెస్, డిజిటల్ బ్యాంకింగ్ అంశాలపై 90 మార్కులకుగాను, 90 ప్రశ్నలు ఇస్తారు. ఆఫీసర్ పోస్టుకు పైన పేర్కొన్నఅంశాలతో మొత్తం 150 మార్కులకుగాను 150 ప్రశ్నలు ఇస్తారు.
- ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు.
- ఈ పరీక్ష తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. దీన్ని 15 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.

- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై (మనకు దగ్గరలో ఉన్న సెంటర్లు).
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, విద్యార్హతలు, తదితర వివరాలను ఎంటర్ చేయాలి.నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
- దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 4
- ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్: సెప్టెంబర్ చివరివారం
- వెబ్‌సైట్: www.federalbank.co.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఐఈఎస్‌ఎల్‌లో టెక్నీషియన్లు.


ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Air-India-logo
వివరాలు:ఏఐఈఎస్‌ఎల్ అనేది ఎయిర్ ఇండియా లిమిటెడ్
ఆధ్వర్యంలో నడిచే సంస్థ.
- మొత్తం పోస్టుల సంఖ్య: 14
- అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ లేదా డీజీసీఏ లైసెన్స్‌తో పాటు ఏఎంఈ డిప్లొమా/సర్టిఫికెట్, డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రేడియో ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత.
- వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.ట్రేడ్స్‌మేన్-5 పోస్టులు
- అర్హతలు: సంబంధిత ఐటీఐలో ఉత్తీర్ణత
- వయస్సు: 45 ఏండ్లకు మించరాదు.
- అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-
- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
- దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 1
- ఇంటర్వ్యూతేదీ: సెప్టెంబర్ 14
- వెబ్‌సైట్: www.airindia.in


0 comments:

Post a Comment