Wednesday, 9 August 2017

బీఈసీఐఎల్‌లో ఆఫీస్ అసిస్టెంట్లు, ఎన్‌ఐఎన్ హైదరాబాద్‌లో ఖాళీలు, ఆనంద్ అగ్రికల్చర్ వర్సిటీలో ఉద్యోగాలు, సీఎంఎఫ్‌ఆర్‌ఐ ఉద్యోగాలు. The office assistants jobs in BECIL,NIN Hyderabad Recruitment,Anand Agriculture University Recruitment,CMFRI Recruitment.

బీఈసీఐఎల్‌లో ఆఫీస్ అసిస్టెంట్లు,

ఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
మినీరత్న కంపెనీ అయిన బీఈసీఐఎల్‌ను 1995 మార్చి 24న స్థాపించారు. ఇది రేడియో, టెలివిజన్ ప్రసారాలు, ఇంజినీరింగ్ క్షేత్రాలు, ఉపగ్రహ, కేబుల్ ప్రసారం, ప్రత్యేకమైన కమ్యూనికేషన్, పర్యవేక్షణ, రక్షణకు, పోలీసు శాఖ, వివిధ పారామిలిటరీ ఫోర్సెస్‌కు సహాయపడుతుంది.
-పోస్టు పేరు: ఆఫీస్ అసిస్టెంట్
-మొత్తం ఖాళీల సంఖ్య : 25
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు మూడేండ్లపాటు గవర్నమెంట్, పీఎస్‌యూ, అటానమస్ సంస్థలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అనుభవం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, టైపింగ్ రైటింగ్‌లో ప్రావీణ్యం ఉండాలి.
-వయస్సు: 21 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: రూ.21,000/- (కన్సాలిడేటెడ్ పే)
-అప్లికేషన్ ఫీజు: రూ. 300/-
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: Assistant General Manager (HR), BECILs Corporate Office, BECIL Bhawan, C-56/A-17, Sector-62, Noida-201307
-చివరి తేదీ : ఆగస్టు 18
-వెబ్‌సైట్: www.becil.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఎన్ హైదరాబాద్‌లో ఖాళీలు,

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్)లో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
-సైంటిస్ట్-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ/ఎండీ, ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత.
-డాటా ఎంట్రీ ఆపరేటర్-1
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-మల్టీ టాస్కింగ్ స్టాఫ్-1
-అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో రెండేండ్లపాటు అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆగస్టు 22న సంబంధిత పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
చిరునామా: NATIONAL INSTITUTE OF NUTRITION (NIN), Conference Hall, Tarnaka, JAMAI-OSMANIA, HYDERABAD - 500 007
-వెబ్‌సైట్: http://ninindia.org
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆనంద్ అగ్రికల్చర్ వర్సిటీలో ఉద్యోగాలు,

గుజరాత్‌లోని ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. 

వివరాలు:
ఈ యూనివర్సిటీని 2004లో ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య:70
-విభాగాలు: అగ్రికల్చర్, డెయిరీ, ఐఏబీఎంఐ, వెటర్నరీ, అగ్రికల్చర్, 
-డైరెక్టర్-ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్-1, రిజిస్ట్రార్-1
-ప్రొఫెసర్-14
-పే స్కేల్: రూ. 37,400-67,000+అకడమిక్ గ్రేడ్ పే రూ. 10,000/-
-అసోసియేట్ ప్రొఫెసర్-24
-పే స్కేల్: రూ. 15,600-39,100+అకడమిక్ గ్రేడ్ పే రూ. 8,000/-
-అసిస్టెంట్ ప్రొఫెసర్-30
-పే స్కేల్: రూ. 15,600-39,100+అకడమిక్ గ్రేడ్ పే రూ. 6,000/-
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీతోపాటు సంబంధిత సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత రిసెర్చ్/టీచింగ్ విభాగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీ, ఎస్‌ఈబీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 250/-
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 22
-ఆన్‌లైన్‌హార్డ్‌కాపీలకు చివరితేదీ: ఆగస్టు 24

-వెబ్‌సైట్: www.aau.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎంఎఫ్‌ఆర్‌ఐ ఉద్యోగాలు.





సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) వివిధ రీజినల్ సెంటర్‌ల్లో ఖాళీగా ఉన్న లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
వ్యవసాయ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను 1947 ఫిబ్రవరిలో స్థాపించారు. దీనిని 1967 నుంచి ఐసీఏఆర్ పరిధిలోకి చేర్చారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 5
-పోస్టు పేరు: లోయర్ డివిజన్ క్లర్క్
-అర్హతలు: పదో తరగతి, ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి సంబంధిత సర్టిఫికెట్లను జతపరిచి పర్సనల్ అధికారికి పంపాలి.
-చివరి తేదీ: ఆగస్టు 17
-వెబ్‌సైట్:www.cmfri.org.in

0 comments:

Post a Comment