Monday, 28 August 2017

ఎన్‌ఐఏబీలో సైంటిస్టులు, నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ట్రయినీలు, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ఇర్కాన్‌లో మేనేజర్ పోస్టులు. NIAB Recruitment scientists,National Fertilizers Trainee jobs,Graduate Apprentice at ISRO Propulsion Complex,Manager posts in IRCON.

ఎన్‌ఐఏబీలో సైంటిస్టులు,

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్టు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
niab-labs
వివరాలు:

ఎన్‌ఐఏబీ అనేది స్వతంత్ర సంస్థ. ఇది కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
సైంటిస్ట్- 6 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
టెక్నికల్ ఆఫీసర్- 4 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, బీవీఎస్సీ, బీఫార్మసీ, బీఈలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
సీనియర్ మేనేజర్ (అడ్మిన్ అండ్ ఫైనాన్స్)- 1
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ, ఎంబీఏలో ఉత్తీర్ణత.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులను ప్రింట్ తీసి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపించాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: సెప్టెంబర్ 18
ఆన్‌లైన్ హార్డ్‌కాపీకి చివరితేదీ: సెప్టెంబర్ 23
వెబ్‌సైట్: www.niab.org.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ట్రయినీలు,

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
National
వివరాలు:
నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ అనేది కేటగిరీ-1 హోదా కలిగిన ప్రభుత్వరంగ మినీరత్న కంపెనీ. ఇది రసాయనిక ఎరువులు, సేంద్రీయ ఎరువులు, పారిశ్రామిక రసాయనాలను ఉత్పత్తి చేసే ప్రధాన భారతీయ కంపెనీ. దీన్ని 1974 ఆగస్టు 23న ఏర్పాటుచేశారు..
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ
మొత్తం పోస్టుల సంఖ్య: 36
విభాగాలవారీగా ఖాళీలు: హెచ్‌ఆర్- 12,మార్కెటింగ్- 24
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ/పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా/బీఎస్సీతోపాటు ఎమెస్సీ, బీఎస్సీ+ పీజీడీబీఎంలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
వయస్సు: 2017 ఆగస్టు 31 నాటికి 29 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులు పదేండ్లవరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ. 16,400-40,500/-
దరఖాస్తు ఫీజు: రూ. 735/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 6
వెబ్‌సైట్: www.nationalfertilizers.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్,
తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ISROPropulsion
వివరాలు:
ప్రొపల్షన్ కాంప్లెక్స్ అనేది ఇస్రో పరిధిలో పనిచేస్తున్నది. ఈ సంస్థలో ఇస్రోకు సంబంధించిన ప్రొఫెషనల్ సిస్టమ్ సెంటర్లలో టెస్టింగ్, చోధక వ్యవస్థలను సమగ్రపరచడం, అసెంబ్లింగ్ చేయడం, ్రప్రొపల్లెంట్ స్టోరేజ్ చేస్తారు.
-పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
-మొత్తం పోస్టుల సంఖ్య: 41
-విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-10,ఎలక్ట్రికల్- 5, ఎలక్ట్రానిక్స్- 10, ఇన్‌స్ట్రుమెంటేషన్- 2, కెమికల్- 2, కంప్యూటర్‌సైన్స్- 5, సివిల్- 4, లైబ్రెరీ సైన్స్- 3
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. లైబ్రెరీ సైన్స్ పోస్టులకు డిగ్రీ (లైబ్రెరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్)లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: అకడమిక్ ప్రతిభ, బయోడేటా ఆధారంగా స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత అర్హత గల అభ్యర్థులకు రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, స్కిల్‌టెస్ట్‌లు నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరి తేదీ: ఆగస్టు 31
-వెబ్‌సైట్: www. iprc.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇర్కాన్‌లో మేనేజర్ పోస్టులు.





న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ircon
వివరాలు:
ఇర్కాన్ భారత ప్రభుత్వరంగ సంస్థ. ఇది రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం ఖాళీల సంఖ్య- 4
-డిప్యూటీ జనరల్ మేనేజర్ (లీగల్)- 1
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఫుల్‌టైం ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత. కనీసం ఏడాది అనుభవం ఉండాలి. లేదా 55 శాతం మార్కులతో ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత. అనుభవం తప్పనిసరి.
-పేస్కేల్: రూ. 32,900 - 58,000/-
-డిప్యూటీ మేనేజర్ (లీగల్)- 3
-పేస్కేల్: రూ. 24,900 - 50,500/-
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ, అనుభవం ఉండాలి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఆగస్టు 28
-వెబ్‌సైట్: www.ircon.org

0 comments:

Post a Comment