Monday, 28 August 2017

కోస్ట్‌గార్డ్‌లో నావిక్ పోస్టులు, బీఈసీఐఎల్‌లో మానిటర్లు, మజ్‌గావ్‌డాక్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు, సీఎస్‌ఐఆర్ - నెట్, ఎఫ్‌సీఐలో ఖాళీలు. Navik posts in coastguard,Monitors at BECIL,Executive trainees in MAZAGON,CSIR - Net,Vacancies in FCI

కోస్ట్‌గార్డ్‌లో నావిక్ పోస్టులు,

ఇంటర్ ఉత్తీర్ణులకు అవకాశం
-డిఫెన్స్ సర్వీసెస్‌లో ఉద్యోగం
-రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక
-చివరితేదీ: సెప్టెంబర్ 4
-రాతపరీక్ష: అక్టోబర్/నవంబర్‌లలో నిర్వహిస్తారు

INDIANCOASTGUARD
ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ ఆఫ్ యూనియన్‌లో ఖాళీగా ఉన్న నావిక్ జనరల్ డ్యూటీ (10+2 ఎంట్రీ స్కీం) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఇంటర్ అర్హత. చాలెంజింగ్ కెరీర్, మంచి జీతభత్యాలు, ఆకర్షణీయమైన సౌకర్యాలు, అలవెన్స్‌లు. చిన్నవయస్సులో కేంద్ర కొలువు. దేశరక్షణలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం. వీటన్నింటి సమాహారమే ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్ పోస్టులు. దరఖాస్తు చివరితేదీ సెప్టెంబర్ 4. ఈ సందర్భంగా నోటిఫికేషన్ వివరాలు సంక్షిప్తంగా మీకోసం....
-పోసు ్ట పేరు: నావిక్ (జనరల్ డ్యూటీ)10+2 ఎంట్రీ - 1/2018 బ్యాచ్ కింద వీటిని భర్తీ చేస్తారు.
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10+2 లేదా ఇంటర్ ఉత్తీర్ణత. ఇంటర్‌లోని మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌ల్లో తప్పనిసరిగా కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
-వయస్సు: 18 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. 1996, ఫిబ్రవరి 1 నుంచి 2000 జనవరి 31 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు:
-ఎత్తు - 157 సెం.మీ.
-ఛాతీ - శరీరానికి తగ్గ అనుపాతంలో ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం తప్పనిసరి.
-బరువు - ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-కంటిచూపు - 6/6, 6/9
-ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను ప్రతి జోన్ పరిధిలోని సెంటర్ ప్రకారం షార్ట్‌లిస్ట్ చేస్తారు.
-షార్ట్‌లిస్ట్ పొందిన అభ్యర్థులకు రాతపరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష అక్టోబర్/నవంబర్ 2017లో ఉంటుంది.
-రాతపరీక్షలో క్వాలిఫైయింగ్ మార్కులు ఆయా జోన్‌సెంటర్‌లను బట్టి ఎక్కవ, తక్కువగా ఉంటాయి.
-రాతపరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో ఇంటర్ స్థాయిలోని మ్యాథ్స్, ఫిజిక్స్, బేసిక్ కెమిస్ట్రీ, ఇంగ్లిష్ నాలెడ్జ్ , జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
-రాతపరీక్షలో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్‌లను నిర్వహిస్తారు.
-ఈ పరీక్షల నిర్వహణకు 2 నుంచి 3 రోజులు పడుతుంది.
-అన్ని పరీక్షలు పూర్తిచేసిన మెరిట్ అభ్యర్థుల వివరాలను జోన్‌పరిధిలోని ఖాళీలసంఖ్య ఆధారంగా డిసెంబర్ 2017/జనవరి 2018లో ఇండియన్ కోస్ట్‌గార్డ్ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
-శిక్షణ: ఫిబ్రవరి 2018 నుంచి ప్రారంభమవుతుంది. ఐఎన్‌ఎస్ చిల్కాలో కేటాయించిన ట్రేడ్‌కు సంబంధించి సముద్రంలో ప్రొఫెషనల్ ట్రెయినింగ్‌ను ఇస్తారు.

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో..
-7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరాన్ని పూర్తిచేయాలి.
-20 ఉతక్ బైటక్‌లు చేయాలి.
-10 ఫుష్ అప్‌లు
-పై అన్ని పరీక్షల్లో క్వాలిఫై అయినవారికి వైద్యపరీక్షలను నిర్వహించి జూలైలో ఫలితాలను వెల్లడిస్తారు.
-జీతభత్యాలు: 7వ వేతన సంఘం సిఫార్సు అనుసరించి నెలకు జీతం రూ. 21,700/- వీటికి తోడు డీఏ, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్, ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
-ఉచితంగా రేషన్, దుస్తులు, వైద్యం అందిస్తారు. (కుటుంబ సభ్యులకు కూడా)
-నామమాత్రపు లైసెన్స్ ఫీజుతో వసతి సౌకర్యం కల్పిస్తారు.
-45 రోజులపాటు ఆర్జితసెలవులు, 8 ఆకస్మిక సెలవులు,లీవ్ ట్రావెల్ ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి.
-క్యాంటీన్, పలు రకాల రుణసదుపాయాలను అందిస్తారు.
-రిటైర్ అయిన తర్వాత ఈసీహెచ్‌ఎస్ మెడికల్ సౌకర్యం ఉంటుంది.
-పదోన్నతులు: నావిక్ నుంచి ప్రధాన అధికారి హోదా వరకు వెళ్లవచ్చు. ప్రధాన అధికారి పేస్కేల్ 7వ వేతన సంఘం సిఫార్సు అనుసరించి 47,600/- ఉంటుంది.
-పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా వివిధ జోన్లలోని మొత్తం 19 ఎగ్జామినేషన్ సెంటర్లలో పరీక్షను నిర్వహిస్తారు.
-తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభ్యర్థులు ఈస్ట్‌జోన్ పరిధిలోకి వస్తారు.
-ఈస్ట్‌జోన్ పరిధిలోని పరీక్ష కేంద్రాలు- సికింద్రాబాద్, మండపం, చెన్నై, విశాఖపట్నం ఉన్నాయి
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.పూర్తి వివరాలతోపాటు వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, పర్సనల్ మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. నిర్ణీత నమూనాలో అభ్యర్థి ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
-దరఖాస్తులకు చివరితేదీ : సెప్టెంబర్ 4(సాయంత్రం 5 గంటలవరకు)
-వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈసీఐఎల్‌లో మానిటర్లు,
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కంటెంట్ ఆడిటర్, సీనియర్ మానిటర్, మానిటర్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BECIL
వివరాలు:
బీఈసీఐఎల్ అనేది ఒక మినీరత్న కంపెనీ. దీన్ని 1995 మార్చి 24న ఏర్పాటుచేశారు. ఈ సంస్థ రేడియో, టెలివిజన్ ప్రసారాలు, ఇంజినీరింగ్ క్షేత్రాలు, ఉపగ్రహ, కేబుల్ ప్రసారం, ప్రత్యేకమైన కమ్యూనికేషన్, పర్యవేక్షణ, రక్షణ, పోలీసు శాఖ, వివిధ పారామిలిటరీ ఫోర్సెస్‌కు సహాయపడుతుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 42
-కంటెంట్ ఆడిటర్-1
-అర్హత: పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్‌లో ఉత్తీర్ణత. మీడియా / న్యూస్ ఏజెన్సీ రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-సీనియర్ మానిటర్-3
-అర్హత: పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజంలో ఉత్తీర్ణత. మీడియా / న్యూస్ ఏజెన్సీ రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-మానిటర్-38 (అస్సామీ-4,బెంగాలీ-2, గుజరాత్-1, కన్నడ-6, మలయాళం-6, మరాఠీ-3, పంజాబ్-2, తమిళ్-6, తెలుగు-6, ఉర్దూ-1, భోజ్‌పురి-1
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్‌లో ఉత్తీర్ణత. మీడియా/ న్యూస్ పేపర్‌లో ఏడాదిపాటు అనుభవం ఉండాలి.
-పే స్కేల్: కంటెంట్ ఆడిటర్‌కు- రూ. 49,800/, సీనియర్ మానిటర్‌కు -రూ. 37,350/-,మానిటర్‌కు -రూ. 28,635/-
-అప్లికేషన్ పీజు: రూ. 300/-(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు)
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-చివరితేదీ : సెప్టెంబర్ 15
-వెబ్‌సైట్: www.becil.com----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మజ్‌గావ్‌డాక్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు,
భారత రక్షణ శాఖ పరిధిలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్ లిమిటెడ్ (ఎండీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
MAZAGONDOCK-LIMITED
వివరాలు:
భారత రక్షణ దళానికి కావల్సిన యుద్ధనౌకలను, సబ్‌మెరైన్స్‌ను ఈ డాక్‌లో నిర్మిస్తారు. ఇది ప్రపంచస్థాయి కలిగిన యార్డ్.
-మొత్తం ఖాళీల సంఖ్య: 32
విభాగాలవారీగా ఖాళీలు:
-మేనేజర్/చీఫ్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్)-2
-అసిస్టెంట్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్)-2
-అర్హత: ఎంబీఏ, మాస్టర్ డిగ్రీ (సోషల్ వర్క్, సోషల్ వెల్ఫేర్, లేబర్ వెల్ఫేర్, పీఎం, ఐఆర్) పీజీతోపాటు రెండేండ్ల పీజీ డిప్లొమా ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ -13
-విభాగాలు: అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ రిలేషన్స్, ఫైనాన్స్
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి సీఏ, సీఎంఏలో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఈఆర్‌పీ ఎన్విరాన్‌మెంట్‌లో పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-13
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో నాలుగేండ్ల బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. గేట్ 2015/2016 స్కోర్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
-వయస్సు: సీనియర్ ఇంజినీర్స్‌కు 30 ఏండ్లు (ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ 28 ఏండ్లు) మించరాదు. సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్‌ను అనుసరించి ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 340/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఫీజు లేదు.
-ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ. కొన్ని పోస్టులకు కేవలం ఇంటర్వూ ద్వారానే ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రింట్ తీసీ,సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: CM (HR-CR) Executives Recruitment Section, 2nd Floor, Mazdock House Mazagon Dock Shipbuilders Limited, Dockyard Road,Mumbai - 400010
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 31
-వెబ్‌సైట్: www.mazagondock.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఐఆర్ - నెట్,
-ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్, బీఈ, బీటెక్, బీఫార్మా చేసినవారికి అవకాశం
-ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పరిశోధనలకు జేఆర్‌ఎఫ్
-అసిస్టెంట్ ప్రొఫెసర్/డిగ్రీ లెక్చరర్ పోస్టుల కోసం లెక్చరర్‌షిప్
-డిసెంబర్ 17న పరీక్ష

STUDENTS
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఐఎస్‌ఆర్) - యూజీసీ సంయుక్తంగా దేశంలోని యూనివర్సిటీ లేదా కాలేజీల్లో పరిశోధన లేదా లెక్చరర్లుగా పనిచేయడానికి ప్రతి యేటా నిర్వహించే సీఎస్‌ఐఆర్ -నెట్ నోటిఫికేషన్
విడుదలైంది.

వివరాలు:
దేశంలోని యూనివర్సిటీల్లో, అనుబంధ కాలేజీల్లో లెక్చరర్లుగా చేరేందుకు, సైన్స్ రంగాలో పరిశోధనలు చేసేందుకు ఈ పరీక్ష అర్హత కల్పిస్తున్నది.
సీఐఎస్‌ఆర్ - యూజీసీ నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటి టెస్ట్ (నెట్) ద్వారా జేఆర్‌ఎఫ్, లెక్చరర్‌షిప్ పేరుతో ఏడాదికి రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తున్నది.

-సబ్జెక్టులు: మొత్తం ఐదు సబ్జెక్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. అవి...
-కెమికల్ సైన్సెస్
-ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషియన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్
-లైఫ్ సైన్సెస్
-మ్యాథమెటికల్ సైన్సెస్
-ఫిజికల్ సైన్సెస్
-అర్హతలు: ఎమ్మెస్సీ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత. లేదా ఇంటిగ్రేటెడ్ బీఎస్- ఎంఎస్ లేదా నాలుగేండ్ల బీఈ/బీటెక్ లేదా బీఫార్మా, ఎంబీబీఎస్‌లో జనరల్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు పై అర్హత పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
నోట్: ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు లేదా ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సుల ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయనున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు నిర్ణీత గడువులోగా పైన పేర్కొన్న మార్కులతో రెండేండ్లలోగా అర్హత సాధించాలి.

-బీఎస్సీ (ఆనర్స్) లేదా తత్సమాన డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ - పీహెచ్‌డీలో ప్రవేశాలు తీసుకొన్న అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పీజీ కోర్సును రెండేండ్లలో పూర్తిచేయాలి.
-వయస్సు: 2017 జూలై 1 నాటికి జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) పరీక్షకు 28 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్ క్రిమిలేయర్ లేయర్), పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-లెక్చరర్‌షిప్ కోసం నెట్ రాసేవారికి ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం:
-బహుళైచ్ఛిక ప్రశ్నలతో కూడిన పరీక్ష డిసెంబర్ 17న నిర్వహిస్తారు.
-మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
-పరీక్షను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు. మధ్యాహ్నం సెషన్‌లో 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు.
-పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు
-నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. అయితే సబ్జెక్టుల వారీగా విధానం మారుతుంది.

పరీక్ష కేంద్రాలు:
-బెంగళూరు, భావనగర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, కొచ్చిన్, ఢిల్లీ, గుంటూరు, గువాహటి, హైదరాబాద్, ఇంఫాల్, జమ్ము, జంషెడ్‌పూర్, జోర్హట్, కరైకూడి, కోల్‌కతా, లక్నో, నాగ్‌పూర్, పిలానీ, పుణె, రాయ్‌పూర్, రూర్కీ, శ్రీనగర్, తిరువనంతపురం, ఉదయ్‌పూర్, వారణాసి.
-ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 1,000/-
-ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) - రూ. 500/-
-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ - రూ. 250/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: సెప్టెంబర్ 15
-దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 16
-ఆన్‌లైన్‌లో కాపీ ప్రింట్‌ను సెప్టెంబర్ 23లోగా ఢిల్లీలోని కార్యాలయానికి పంపాలి.
-పరీక్షతేదీ: డిసెంబర్ 17
-వెబ్‌సైట్: www.csirhrdg.res.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎఫ్‌సీఐలో ఖాళీలు.
పంజాబ్ రీజియన్‌లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
FCI-Logo
వివరాలు:
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)ను 1964లో ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: వాచ్‌మెన్
-మొత్తం పోస్టుల సంఖ్య: 860 (జనరల్-431, ఓబీసీ-180, ఎస్సీ-249, ఎస్టీ-16, )
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

-పే స్కేల్: రూ. 8,100-18,070/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 250/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
-ఎంపిక: ఆబెక్టివ్ రాతపరీక్ష, పీఈటీ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపేటప్పుడు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి.

-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 20
-పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు.
-వెబ్‌సైట్: www.fciregionaljobs.com

0 comments:

Post a Comment