Thursday, 17 August 2017

సీడీఎస్ (II) - 2017, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు, నిట్ రూర్కెలాలో 203 ఉద్యోగాలు, ఎన్‌హెచ్‌డీసీలో ట్రెయినీ ఆఫీసర్లు UPSC CDS (II) - 2017,Jobs in Indian Air Force,203 jobs in Nit Rourkela,Trainee Officers in NHDC.

సీడీఎస్ (II) - 2017,

త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు
-డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు సువర్ణావకాశం
-పదోన్నతులు, చాలెంజింగ్ కెరీర్
-దేశసేవ చేసుకొనే అవకాశం
-మంచి జీతభత్యాలు, ఆకర్షణీయమైన అలవెన్స్‌లు

CDS-IndianArmy
త్రివిధ దళాల్లో ఉన్నత హోదా ఉద్యోగాలు. కేంద్ర కొలువులు. భద్రమైన జీవితానికి భరోసా. చాలెంజింగ్ కెరీర్ కావాలనుకొనే వారికి ఇదొక మంచి అవకాశం. ఏటా రెండుసార్లు నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వాటి వివరాలు సంక్షిప్తంగా...

సీడీఎస్ -2017

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2017 (II) నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.
వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య - 414. వీటిలో..
-ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్) - 100
-ఇండియన్ నేవల్ అకాడమీ (ఎజిమల) - 45
-ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్) - 32
-ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ (చెన్నై) - 225(పురుష అభ్యర్థులకు మాత్రమే. వీటిలో ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ అభ్యర్థులకు 50 పోస్టులు కేటాయించారు)
-ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ (చెన్నై) - 12(నాన్ టెక్నికల్, మహిళా అభ్యర్థులకు మాత్రమే)

విద్యార్హతలు:

ఐఎంఏ అండ్ ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత.

ఇండియన్ నేవల్ అకాడమీ

General
-గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ ఎయిర్ ఫోర్స్ అకాడమీ
-గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
వయస్సు: 2018, జూలై 1 నాటికి 20 - 24 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1994, జూలై 2 నుంచి 1998, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
నోట్: అభ్యర్థులు అవివాహితులై ఉండాలి. శిక్షణ సమయంలో కూడా వివాహం చేసుకోకూడదు.
శారీరక ప్రమాణాలు: కనీసం 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. నేవీకి 157 సెం.మీ., ఎయిర్‌ఫోర్స్‌కు 162.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
ఫిజికల్ కండిషనింగ్: రన్నింగ్ - 15 నిమిషాల్లో 2 - 4 కి.మీ. పరుగెత్తాలి.
-ఫుష్ అప్స్ - సిట్ అప్స్- కనీసం 20, చిన్ అప్స్- కనీసం 8, రోప్ ైక్లెంబింగ్ - 3 - 4 మీటర్లు.
ఫీజు: రూ. 200/- (ఎస్సీ/ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)

పరీక్ష విధానం:

-రాతపరీక్ష + ఇంటర్వ్యూ ద్వారా
-ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీల్లో

రాతపరీక్ష విధానం:

-రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
-ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.
-ప్రశ్నపత్రంలో మ్యాథ్స్ పదోతరగతి స్థాయిలో ఉంటుంది.
-నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు తదితర పట్టణాల్లో ఉన్నాయి.

ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ టెస్ట్

English
-ఇవి రెండు దశల్లో ఉంటాయి. స్టేజ్ -1లో అర్హత సాధించిన వారిని స్టేజ్ -2లోకి అనుమతిస్తారు.
-స్టేజ్ -1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్‌లు ఉంటాయి. వీటిలో పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్‌లు ఉంటాయి.
-స్టేజ్ -2లో ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్స్, సైకాలజీ టెస్ట్‌లు ఉంటాయి.
-అభ్యర్థి వ్యక్తిత్వాన్ని ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, సైకాలజిస్ట్‌లు పరీక్షిస్తారు.

శిక్షణ వివరాలు:

-వైద్యపరీక్షల అనంతరం శిక్షణకు ఎంపికచేస్తారు.
-ఫ్లయింగ్ బ్రాంచీ (పైలట్)కి ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో 74 వారాల శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ. 21,000/-స్టయిఫండ్ చెల్లిస్తారు.
-ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీలో శిక్షణకు ఎంపికైన వారికి 49 వారాల శిక్షణ ఇస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: 2017, సెప్టెంబర్ 8 (సాయంత్రం 6)
వెబ్‌సైట్: www.upsconline.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు,
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్)లోని ఎయిర్‌ఇండియా హెడ్‌క్వార్టర్ (న్యూ ఢిల్లీ) ఖాళీగా ఉన్న గ్రూప్ సీ (స్టోర్ కీపర్, సూపరింటెండెంట్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
AIRFORCE
వివరాలు:
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ భారతదేశానికి చెందిన త్రివిధ దళాల్లో అత్యంత ముఖ్యమైన సేనా విభాగం. దీన్ని 1932 అక్టోబర్ 8న ఏర్పాటుచేశారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 95 (జనరల్-72, ఓబీసీ-15, ఎస్సీ-8)
-స్టోర్ కీపర్-40 పోస్టులు (జనరల్-32, ఓబీసీ-5, ఎస్సీ-3)
-గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి ఇంటర్/10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. పబ్లిక్/ప్రైవేట్ సంస్థలో స్టోర్స్ , అకౌంట్స్ విభాగంలో అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ.1,900/-
-సూపరింటెండెంట్ - 55 పోస్టులు (జనరల్-40, ఓబీసీ-10, ఎస్సీ-5)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. పబ్లిక్/ప్రైవేట్ సంస్థలో స్టోర్స్, అకౌంట్స్ విభాగంలో అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ. 5,200-20,200 + గ్రేడ్ పే రూ.2,400/-
వయస్సు : 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
-రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి అవసరమైన సర్టిఫికెట్లను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారి కి ఆర్డినరీ పోస్టులో మాత్రమే పంపాలి.
చిరునామా: Director PC (AHC), Air Headquater, J Block, New Delhi-110106
చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లోగా పంపాలి. ప్రకటన పూర్తి వివరాలకు ఆగస్టు 12-18న వెలువడిన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో చూడవచ్చు----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిట్ రూర్కెలాలో 203 ఉద్యోగాలు,
రూర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ (తాత్కాలిక/రెగ్యులర్ పద్ధతి) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NIT-R
వివరాలు:
ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యసించడానికి దీన్ని ఏర్పాటుచేశారు. గతంలో దీన్ని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్ రూర్కెలా గా పిలిచేవారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 203 (జనరల్-40, ఓబీసీ-82, ఎస్సీ-40, ఎస్టీ-26)
విభాగాలు: ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ డిజైన్, ఆర్కిటెక్చర్, సైన్సెస్/ హ్యూమనిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్
పోస్టు పేరు: ప్రొఫెసర్.
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్ పద్ధతి)
పే స్కేల్: రూ. 15,600-39,100+ గ్రేడ్ పే రూ. 6000 లేదా రూ.7000/-
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (రెగ్యులర్ పద్ధతి)
పే స్కేల్: రూ. 15,600-39,100+ గ్రేడ్ పే రూ. 8000/-
-అసోసియేట్ ప్రొఫెసర్ (రెగ్యులర్ పద్ధతి)
పే స్కేల్: రూ. 37,400-67,000+గ్రేడ్ పే రూ. 9500/-
-ప్రొఫెసర్ (రెగ్యులర్ పద్ధతి)
పే స్కేల్: రూ. 37,400-67,000+ గ్రేడ్ పే రూ. 10,500/-
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో బీఈ/బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, బీఆర్క్/ఎంఆర్క్, మాస్టర్ డిగ్రీ, పీజీడీబీఎం/ఎంబీఏతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత పీజీ/డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. టీచింగ్/రిసెర్చ్‌లో అనుభవం ఉండాలి.
వయస్సు: సంస్థ నింబంధనల ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 30 లేదా 35 ఏండ్లు, పోస్టులను బట్టి వేర్వేరుగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరితేదీ: సెప్టెంబర్ 11
వెబ్ సైట్: www.nitrkl.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌హెచ్‌డీసీలో ట్రెయినీ ఆఫీసర్లు.మధ్యప్రదేశ్‌లోని ఎన్‌హెచ్‌డీసీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
వివరాలు:
ఎన్‌హెచ్‌డీసీ లిమిటెడ్ అనేది నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌పీసీ), మధ్యప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పాటు చేసిన సంస్థ.
-మెడికల్ ఆఫీసర్-2 పోస్టులు
-ట్రెయినీ ఆఫీసర్-9 పోస్టులు 
-సూపర్‌వైజర్ (సేప్టీ)-1 పోస్టు
అర్హత: ఎంబీబీఎస్, లా డిగ్రీ, కంపెనీ సెక్రటరీ (సీఎస్), సీఏ, డిప్లొమాలో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 జూలై 31 నాటికి 30 ఏండ్లకు (మెడికల్ ఆఫీసర్‌కు 33 ఏండ్లు) మించరాదు.
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
చివరితేదీ: ఆగస్టు 22
వెబ్‌సైట్:www.nhdcindia.com

0 comments:

Post a Comment