Wednesday, 9 August 2017

ఉద్యాన వర్సి టీలో డిప్లొమా కోర్సు, హెచ్‌ఎంటీలో మేనే జర్లు. Diploma Course in Horticulture University, Managers Jobs in HMT

ఉద్యాన వర్సి టీలో డిప్లొమా కోర్సు,

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ ఉద్యాన విశ్వవిద్యాలయం 2017-18 విద్యా సంవత్సరానికి రెండేండ్ల ఉద్యాన డిప్లొమా కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
గ్రామాల్లో నివసించే యువతీయువకులు స్వయం ఉపాధి కల్పించుకోవాలనే లక్ష్యంతోనూ, వారు కాలేజీల్లో చేరి డిగ్రీలు చదువలేరనే ఉద్దేశంతో వారికి ఉద్యాన పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడానికి ఈ పాలిటెక్నిక్‌లను ఏర్పాటుచేశారు.
-కోర్సుపేరు:రెండేండ్ల ఉద్యాన డిప్లొమా
-మొత్తం సీట్ల సంఖ్య: 50
-ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజ్, దసనాపూర్ (ఆదిలాబాద్)-25 సీట్లు
-ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజ్, రామగిరి ఖిల్లా (కరీంనగర్)-25 సీట్లు
-అర్హత: తెలంగాణలోని అభ్యర్థులు వారి పదేండ్ల చదువు కాలంలో కనీసం నాలుగేండ్లు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదివినవారు మాత్రమే అర్హులు. ఇంటర్ పాసైనవారు, డిగ్రీ చదివినవారు అర్హులుకారు.
-వయస్సు: 2017 ఆగస్టు 31 నాటికి 15 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రూ. 500/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 250/- చెల్లించాలి)
-ఎంపిక: గ్రేడ్ పాయింట్ యావరేజ్ ప్రకారం విద్యార్ధి ఎంపిక ఉంటుంది. డిప్లొమా కోర్సు ఎంపికలో రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఉంటాయి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పూర్తిచేసి, డిమాండ్ డ్రాఫ్ట్‌ను జతపరిచి కింది అడ్రస్‌కు పంపాలి.
చిరునామా: The Registrar, Sri Konda Laxman Telangana State Horticu ltural University Rajendranagar, Hyderabad - 500 030
-దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 16
-వెబ్‌సైట్: www.skltshu.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

హెచ్‌ఎంటీలో మేనే జర్లు.


బెంగళూరులోని హెచ్‌ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్ సేల్స్ అండ్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: హెచ్‌ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్ అనేది హెచ్‌ఎంటీ లిమిటెడ్ అనుబంధ సంస్థ.
-పోస్టు పేరు : ఏజీఎం, మేనేజర్, డిప్యూటీ మేనేజర్
-మొత్తం పోస్టులు: 12
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్, ఎంబీఏ (మార్కెటింగ్) ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 33 ఏండ్లకు మించరాదు (మేనేజర్, ఏజీఎం పోస్టులకు 35 ఏండ్లు/ 37 ఏండ్లు)
-పే స్కేల్ : డిప్యూటీ మేనేజర్‌కు రూ. 10,750-16,750/-
-మేనేజర్‌కు రూ. 13000-18,250/-, ఏజీఎంకు 14,500-18,700/- అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ తదితర అలవెన్స్‌లు ఉంటాయి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-చిరునామా: The Deputy General Manager (MP/HR), HMT Machine Tools Limited, HMT Bhavan, #59, Bellary Road, Bangalore -32
-దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 18
-వెబ్‌సైట్ : www.hmtindia.com

0 comments:

Post a Comment