Wednesday, 9 August 2017

సింగరేణిలో 665 ఉద్యోగాలు, రైల్‌టెల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు. 665 jobs in Singareni, Jobs at Railtel Corporation

సింగరేణిలో 665 ఉద్యోగాలు,
ఖమ్మం (కొత్తగూడెం)లోని ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అండర్ గ్రౌండ్ విభాగంలో ఖాళీగా ఉన్న బదిలీ వర్కర్ (పురుషులకు మాత్రమే) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల (ఎస్టీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో బొగ్గును ఉత్తత్తి చేసే కంపెనీ. దీన్ని 51:49 ఈక్విటీ ఆధారంగా తెలంగాణ, కేంద్రం కలిసి ఏర్పాటు చేశాయి. 1886లో హైదరాబాద్ దక్కన్‌గా, 1920లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పేరు మార్చుకొని, 1956 రాష్ట్రస్థాయి పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌గా పరిగణిస్తున్నారు. దీనికి మినీరత్నహోదాను 2006లో
కల్పించారు.
-మొత్తం ఖాళీల సంఖ్య:
 665. ఈ పోస్టులకు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులు మాత్రమే అర్హులు.
-పోస్టు పేరు: బదిలీ వర్కర్
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 604.33/- (ఒక రోజుకి)
-వయస్సు: 2017 జనవరి 1 నాటికి 18 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి. 
-ఎంపిక: తెలుగులో రాతపరీక్ష ద్వారా
-పదోతరగతి స్థాయిలో పరీక్ష ఉంటుంది.
-ఆబ్జెక్టివ్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున పరీక్ష నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా . ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలతోపాటు, నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.ఆన్‌లైన్ దరఖాస్తులను సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: జీఎం, పర్సనల్ /ఆర్‌సీ, ఐఆర్ అండ్ పీఎం, ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, రిక్రూట్‌మెంట్ సెల్, కొత్తగూడెం కాలరీస్, భద్రాద్రి కొత్తగూడెం-507101
-దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు7
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 2
-ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్‌కు చివరితేదీ: సెప్టెంబర్ 12
-వెబ్‌సైట్: www.scclmines.com


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రైల్‌టెల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.


రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్
అసిస్టెంట్, టెక్నికల్ లీడ్ పోస్టుల (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఇది మినీరత్న కంపెనీ. దీన్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 50
-ప్రాజెక్ట్ డైరెక్టర్/ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్ట్-1
-సీనియర్ ఆర్కిటెక్ట్-2
-సీనియర్ ఆర్కిటెక్ట్-డాటాబేస్ అడ్మినిస్ట్రేషన్-1
-సీనియర్ ఈఆర్‌పీ టెక్నో ఫంక్షనల్(ఒరాకిల్)- 4
-టెక్నికల్ లీడ్ (ఎస్‌ఏపీ, డాట్‌నెట్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, జావా డెవలపర్, నెట్‌వర్క్‌బ్యాండ్‌విడ్త్)- 14
-టెక్నికల్ కన్సల్టెంట్ (ఓఎస్, సర్వర్, హార్డ్‌వేర్ అడ్మినిస్ట్రేషన్, జావా, డాట్‌నెట్, డీబీఏ, ఒరాకిల్, ఈఆర్‌పీ, ఎస్‌ఏపీ, స్టోరేజ్, సెక్యూరిటీ, నెట్‌వర్క్- 25
-ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్- 2
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బీఈ/బీటెక్, బీఎస్సీ, ఎంసీఏ, బీసీఏ, డిప్లొమాలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 21 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి (పోస్టులను బట్టి వేర్వేరుగా వయోపరిమితిలో ఉన్నాయి)
-రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-దరఖాస్తు ఫీజు: రూ. 1000. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
-ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరి తేదీ: 2017, జూలై 17
-వెబ్‌సైట్: : http://www.railtelindia.com

0 comments:

Post a Comment