Monday, 28 August 2017

ఐబీపీఎస్ 3562 ప్రొబేషనరీ ఆఫీసర్లు, స్పైసిస్ బోర్డులో ఓఎన్‌జీసీలో ఎగ్జిక్యూటివ్‌లు. IBPS Recruitment 3562 Probationary ,Spice board Recruitment Notification,Executives at ONGC

ఐబీపీఎస్ 3562 ప్రొబేషనరీ ఆఫీసర్లు,

ఐబీపీఎస్ సీడబ్ల్యూఈ పీవో/ఎం.టీ.
-ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు అవకాశం
-ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) దేశవ్యాప్తంగా ఉన్న 20 జాతీయబ్యాంక్‌లలో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఉమ్మడి రాతపరీక్ష
(సీడబ్ల్యూఈ పీవో/ఎంటీ-VII) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

వివరాలు:
ఐబీపీఎస్ అనేది స్వతంత్ర సంస్థ. దేశంలోని జాతీయ బ్యాంకులు, ఆర్‌బీఐ, ఎల్‌ఐసీ, నాన్ ఫైనాన్షియల్ సెక్టార్ సంస్థలు, రీజినల్ రూరల్ బ్యాంకుల్లో వివిధ పోస్టుల భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించి, అవసరమైన అభ్యర్థులను ఎంపికచేస్తుంది.

పాల్గొనే సంస్థలు:అలహాబాద్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, విజయా బ్యాంక్.
పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేనాటికి విద్యార్హత సర్టిఫికెట్ చెల్లుబాటు అయ్యేవిధంగా ఉండాలి.
వయస్సు: 2017, ఆగస్టు 1 నాటికి కనిష్టంగా 20 ఏండ్ల నుంచి గరిష్టంగా 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 3562
బ్యాంక్‌లవారీగా ఖాళీలు:
అలహాబాద్ బ్యాంక్-235 పోస్టులు (జనరల్-116, ఓబీసీ-64, ఎస్సీ-36, ఎస్టీ-19, పీహెచ్‌సీ-25**)
ఆంధ్రాబ్యాంక్-625 పోస్టులు (జనరల్-318, ఓబీసీ-168, ఎస్సీ-93, ఎస్టీ-46, పీహెచ్‌సీ-25**)
బ్యాంక్ ఆఫ్ ఇండియా-200 పోస్టులు (జనరల్-101, ఓబీసీ-54, ఎస్సీ-30, ఎస్టీ-15, పీహెచ్‌సీ-8**)
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర-100 పోస్టులు (జనరల్-51, ఓబీసీ-27, ఎస్సీ-15, ఎస్టీ-7, పీహెచ్‌సీ-4**)
కెనరా బ్యాంక్-1350 పోస్టులు (జనరల్-675, ఓబీసీ-364, ఎస్సీ-203, ఎస్టీ-108, పీహెచ్‌సీ-71**)
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-100 పోస్టులు (జనరల్-49, ఓబీసీ-28, ఎస్సీ-15, ఎస్టీ-8, పీహెచ్‌సీ-3**)
కార్పొరేషన్ బ్యాంక్-100 పోస్టులు (జనరల్-50, ఎస్సీ-28, ఎస్టీ-22, పీహెచ్‌సీ-4**)
యూకో బ్యాంక్-530 పోస్టులు (జనరల్-251, ఓబీసీ-178, ఎస్సీ-75, ఎస్టీ-26, పీహెచ్‌సీ-61**)
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-322 పోస్టులు (జనరల్-127, ఓబీసీ-78, ఎస్సీ-83, ఎస్టీ-34, పీహెచ్‌సీ-41**)
గమనిక: పైన సూచించిన ఖాళీల సంఖ్య బ్యాంక్ అవసరమేరకు పెరగవచ్చు/తగ్గవచ్చు.
పీహెచ్‌సీ స్టార్ మార్క్(**) గుర్తు ఉన్న పోస్టులు మొత్తం పోస్టుల్లో కలుపుకొని కేటాయించారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 600/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 100/-)
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఉమ్మడి రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలను ఆన్‌లైన్ విధానం లో నిర్వహిస్తారు.
ప్రిలిమినరీ-100 మార్కులు, మెయిన్-225 మార్కులు.
పరీక్షలు పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.
పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.

IBPS

పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు కోత విధిస్తారు.
ఆన్‌లైన్ టెస్ట్‌లో మెరిట్ పొందిన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ ఉమ్మడి రాతపరీక్ష కేవలం ఇంగ్లిష్/హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే ఉంటుంది.
ఆన్‌లైన్ ఉమ్మడి రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్) ప్రతి విభాగంలో కనీస అర్హత మార్కులను సాధించాల్సి ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, విజయవాడ, వైజాగ్, బెంగళూరు, ముంబై, చెన్నైలతో పాటు దేశవ్యాప్తంగా 216 ఎగ్జామినేషన్ సెంటర్లలో ప్రిలిమినరీ పరీక్ష, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, బెంగళూరు, ముంబైలతోపాటు దేశవ్యాప్తంగా 69 సెంటర్లలో మెయిన్ పరీక్షను నిర్వహిస్తారు.
తాత్కాలిక షెడ్యూల్.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఆగస్టు 16 నుంచి ప్రారంభం
దరఖాస్తు/ఫీజు చెల్లింపు చివరితేదీ: సెప్టెంబర్ 5
హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్ (ప్రిలిమినరీ పరీక్ష): సెప్టెంబర్‌లో
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: అక్టోబర్ 7,8,14,15
ప్రిలిమినరీ ఫలితాలు విడుదల: అక్టోబర్‌లో..
మెయిన్ పరీక్ష తేదీ: నవంబర్ 26
మెయిన్ ఫలితాలు విడుదల: డిసెంబర్‌లో..
ఇంటర్వ్యూకు కాల్‌లెటర్స్ డౌన్‌లోడింగ్: జనవరి 2018
ఇంటర్వ్యూ తేదీ: జనవరి/ఫిబ్రవరి 2018
తాత్కాలిక ఫలితాలు విడుదల: 2018 ఏప్రిల్
వెబ్‌సైట్: www.ibps.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
స్పైసిస్ బోర్డులో
కొచ్చిన్‌లోని స్పైసిస్ బోర్డ్ రిసెర్చ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎస్సీ)కు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలో స్సైసెస్ బోర్డు పనిచేస్తుంది.
స్సైసెస్ రిసెర్చ్ ట్రెయినీ (ఎస్‌ఆర్‌టీ)
అర్హతలు: ఎమ్మెస్సీ బాటనీ/బయోటెక్నాలజీ లేదా కెమిస్ట్రీ/ఆగ్రానమి లేదా సాయిల్ సైన్స్ లేదా మైక్రోబయాలజీ లేదా అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.
ఖాళీల సంఖ్య - 24
వయస్సు: 35 ఏండ్లు మించరాదు
స్టయిఫండ్: నెలకు రూ. 17,000/-
కాలపరిమితి: మొదట ఏడాది కాలానికి తీసుకొంటారు. తర్వాత పొడిగింపు ఉండవచ్చు.
ఎంపిక: ఆగస్టు 22న నిర్వహించే ఇంటర్వ్యూ
వెబ్‌సైట్: http://www.indianspices.com



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఓఎన్‌జీసీలో ఎగ్జిక్యూటివ్‌లు.


ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఓఎన్‌జీసీ భారత ప్రభుత్వరంగ సంస్థ. ఇది ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ. ఆసియాలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన దీన్ని 1956, ఆగస్టు 14న స్థాపించారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 27
హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటివ్-20 పోస్టులు
అర్హత: ఎంబీఏ (పర్సనల్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్‌డీ/హెచ్‌ఆర్‌ఎం), పోస్టు గ్రాడ్యుయేట్/పీజీ డిప్లొమా (పర్సనల్ మేనేజ్‌మెంట్, ఐఆర్, లేబర్ వెల్ఫేర్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్-5 పోస్టులు
అర్హత: ఎంబీఏ (ఫైనాన్స్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫీసర్-2 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ (హిందీ)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 జనవరి 1 నాటికి 30 ఏండ్లకు మించరాదు. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫీసర్ 40 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: యూజీసీ నెట్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో నిర్ణీత నమూనా ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాలను ఈ-మెయిల్ ఐడీ ద్వారా తెలియజేస్తారు.
దరఖాస్తులకు చివరితేదీ : సెప్టెంబర్ 19
పర్సనల్ ఇంటర్వ్యూ : జనవరి 2018
వెబ్‌సైట్ :www.ongcindia.com

0 comments:

Post a Comment