Monday, 28 August 2017

ఎల్ ఐసీలో 264 పోస్టులు, ఫారెస్ట్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా, సీఈఈఆర్‌ఐలో ఉద్యోగాలు. LIC Recruitment 264 posts,Diploma in Forest Management,Jobs in CEERI

ఎల్ ఐసీలో 264 పోస్టులు,

డిగ్రీ, ఎంబీఏ విద్యార్థులకు అవకాశం
- ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
- చివరితేదీ సెప్టెంబర్ 7
STUDENTS
ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎల్‌ఐసీ అనుబంధ సంస్థ. దీన్ని 1989, జూన్ 19న ప్రారంభించారు. దీర్ఘకాలిక గృహరుణాలు అందిచడం దీని ప్రధాన లక్ష్యం.

- అసిస్టెంట్ మేనేజర్ - 100 ఖాళీలు
- అసిస్టెంట్స్- 164 ఖాళీలు
- రాష్ర్టాల వారీగా ఖాళీలు.. తెలంగాణ- 5, ఛత్తీస్‌గఢ్- 4, మధ్యప్రదేశ్- 10, బీహార్- 9,జార్ఖండ్- 1, ఒడిశా- 9, అసోం- 2, సిక్కిం- 1, త్రిపుర-1, పశ్చిమబెంగాల్- 10, ఉత్తరప్రదేశ్ (ఎన్‌సీఆర్ మినహాయించి)- 20, ఉత్తరాఖండ్- 1, ఢిల్లీ (ఎన్‌సీఆర్ కలుపుకొని)- 5, హర్యానా (ఎన్‌సీఆర్ మినహాయించి)- 1, పంజాబ్- 3, రాజస్థాన్- 9, చండీగఢ్- 3, కర్ణాటక- 10, గోవా- 1, ఆంధ్రప్రదేశ్- 11, పాండిచ్చేరి- 1, తమిళనాడు-22, గుజరాత్-10, మహారాష్ట్ర-15.
నోట్: అసిస్టెంట్ మేనేజర్‌లు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా ఒక రాష్ర్టాన్ని మాత్రమే ఎంచుకోవాలి.

- పేస్కేల్: అసిస్టెంట్ పోస్టు బేసిక్ పే నెలకు రూ. 13,890/- వీటికి అదనంగా అలవెన్స్‌లు కలుపుకొని నెలకు సుమారుగా రూ. 21, 236/- వరకు జీతం వస్తుంది.
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు బేసిక్ పే నెలకు రూ. 32,815/-, వీటికి అదనంగా అలవెన్స్‌లు ఇస్తారు. అన్ని కలుపుకొని నెలకు సుమారుగా రూ. 49,805/- జీతం వస్తుంది.

- ప్రొబేషనరీ పీరియడ్: అసిస్టెంట్ పోస్టు- 6 నెలలు. అసిస్టెంట్ మేనేజర్- ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ. 25 వేలు చెల్లిస్తారు. తర్వాత పోస్టును రెగ్యులర్ చేస్తారు.
- వయస్సు: పై రెండు పోస్టులకు 2017, జూలై 1 నాటికి 21 -28 ఏండ్ల మధ్య ఉండాలి.
- విద్యార్హతలు: అసిస్టెంట్ పోస్టు- ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టు- కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ ఉత్తీర్ణత. ఎంపిక విధానం:
- అసిస్టెంట్ - ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ
- అసిస్టెంట్ మేనేజర్- ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ

ఆన్‌లైన్ ఎగ్జామ్:
- అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు వేర్వేరుగా పరీక్షను నిర్వహిస్తారు.
- ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
- పరీక్ష కాలవ్యవధి- 2 గంటలు
- పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్- 50 మార్కులు, 50 ప్రశ్నలు, 35 నిమిషాలు.
- లాజికల్ రీజనింగ్- 50 మార్కులు, 50 ప్రశ్నలు, 35 నిమిషాలు.
- జనరల్ అవేర్‌నెస్- 50 మార్కులు, 50 ప్రశ్నలు, 15 నిమిషాలు.
- న్యూమరికల్ ఎబిలిటీ- 50 మార్కులు,50 ప్రశ్నలు, 35 నిమిషాలు.
- మొత్తం 200 ప్రశ్నలు 120 మార్కులు.
- నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోతవిధిస్తారు.

ఇంటర్వ్యూ:
- పోస్టుల సంఖ్యనుబట్టి ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో కటాఫ్ మార్కులను నిర్ణయించి, అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
నోట్: ఇంటర్వ్యూలు పూర్తయిన తర్వాత వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించినవారికి పోస్టింగ్‌లు ఇస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

- ఫీజు: అసిస్టెంట్/అసిస్టెంట్ మేనేజర్- రూ. 500/-
- చివరితేదీ: సెప్టెంబర్ 7
- ఆన్‌లైన్ ఎగ్జామ్ తేదీలు: అసిస్టెంట్ మేనేజర్- అక్టోబర్ 10
- అసిస్టెంట్- అక్టోబర్ 12
-పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే ఉన్నాయి.
- వెబ్‌సైట్: http://www.lichousing.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఫారెస్ట్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా,
భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఐఎఫ్‌ఎం) 2018-20 అకడమిక్ ఇయర్‌కు పీజీ డిప్లొమా ఇన్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
IIFM
వివరాలు:
పర్యావరణం, అడవులు & పర్యావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఆధ్యర్యంలో పనిచేస్తున్న ఈ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ (ఐఐఎఫ్‌ఎం)ను 1982లో స్థాపించారు.
- పీజీ డిప్లొమా ఇన్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎఫ్‌ఎం)
- కోర్సు వ్యవధి: రెండేండ్లు
- మొత్తం సీట్ల సంఖ్య: 120
- అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ పీహెచ్‌సీ అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్-2017, గ్జాట్-2018 స్కోర్ కార్డ్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.


- పర్‌ఫార్మెన్స్ ఆధారంగా మొత్తం 120 సీట్లలో 20 సీట్లకు స్కాలర్‌షిప్ ఇస్తారు.
- కోర్సు ఫీజు: ట్యూషన్+ హాస్టల్ ఫీజులు కలుపుకొని రూ. 4,80,000 (జనరల్, ఓబీసీ అభ్యర్థులు), రూ. 2,88,000 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు)
- టైప్ ఆఫ్ ప్రోగ్రామ్: ఫుల్‌టైమ్ రెసిడెన్షియల్ ప్రోగ్రాం
- అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 500/-)
- రిజర్వేషన్‌లు: వచ్చిన దరఖాస్తుల్లో ఎస్సీ-15%, ఎస్టీ 7.5%, పీహెచ్‌సీ-3%, ఓబీసీ అభ్యర్థులకు 27% సీట్లను కేటాయిస్తారు.

- ఎంపిక: క్యాట్/గ్జాట్ స్కోర్, గ్రూప్ డిష్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
- గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ జరిగే ప్రదేశాలు:భోపాల్, బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్‌కతా
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చిరునామా: Chairperson,PGDFM Admission Indian Institute of Forest Management,Nehru Nagar, Bhopal-462 003
- వెబ్‌సైట్:www.iifm.ac.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఈఈఆర్‌ఐలో ఉద్యోగాలు.


సీఎస్‌ఐఆర్ - సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈఈఆర్‌ఐ)లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
CEERI
వివరాలు: సీఎస్‌ఐఆర్ - సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. ఈ కార్యాలయం రాజస్థాన్‌లోని పిలానీలో ఉంది.
- సైంటిస్ట్ - 16 ఖాళీలు (జనరల్ - 7, ఓబీసీ -4, ఎస్సీ- 3, ఎస్టీ - 2) 
- పేస్కేల్: రూ. 77,178/-
- వయస్సు: 2017, సెప్టెంబర్ 11 నాటికి 32 ఏండ్లు మించరాదు. 
- సీనియర్ సైంటిస్ట్- 2 పోస్టులు. 
- పేస్కేల్: రూ. 89,832/-
- వయస్సు: 37 ఏండ్లు మించరాదు.
- ప్రిన్సిపాల్ సైంటిస్ట్- 2
- జీతం: నెలకు రూ. 13,5090/-
- వయస్సు: 45 ఏండ్లు మించరాదు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: సెప్టెంబర్ 11

- వెబ్‌సైట్: www.ceeri.res.in


 .

0 comments:

Post a Comment