Wednesday, 9 August 2017

ఎయిమ్స్‌లో 243 ఉద్యోగాలు, ఎఫ్‌సీఐలో 187 ఉద్యోగాలు, వైల్డ్‌లైఫ్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు ఉద్యోగాలు. 243 jobs in AIIMS,187 jobs in the FCI,Project Assistants Jobs in Wildlife

ఎయిమ్స్‌లో 243 ఉద్యోగాలు,

భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (భువనేశ్వర్) వివిధ
విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ (నిర్ణీత కాలానికి) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
General-Physician

వివరాలు:
ఎయిమ్స్ అత్యున్నత ఆరోగ్య ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఒకటి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో వైద్య కళాశాల, వైద్య పరిశోధన చేయడానికి 1956లో స్థాపించారు. ఎయిమ్స్ భువనేశ్వర్‌ను ప్రాంతీయ అసమానతలను సరిదిద్దే లక్ష్యంతో ప్రధాన్‌మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకంలో భాగంగా స్థాపించారు.
-మొత్తం ఖాళీల సంఖ్య -243 పోస్టులు (జనరల్-142, ఓబీసీ-53, ఎస్సీ-36, ఎస్టీ-12)
పోస్టు పేరు: సీనియర్ రెసిడెంట్స్
విభాగాలు: అనెస్థీషియాలజీ, బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, సీఎం అండ్ ఎఫ్‌ఎం, డెర్మటాలజీ, ఎండోక్రిమినాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మెడికల్ ఆంకాలజీ /హెమాటాలజీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, న్యూరాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, న్యూరోసర్జరీ, ఓబీజీ, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పిడియాట్రిక్ సర్జరీ, పిడియాట్రిక్స్, పీఎంఆర్, పల్మనరీ మెడిసిన్, రేడియో డయాగ్నసిస్, సర్జికల్ ఆంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్/టాక్సికాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ఈఎన్‌టీ, సైకియాట్రి, డెంటిస్ట్రీ, ట్రామా అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్)లో ఉత్తీర్ణత. పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీలో ఉత్తీర్ణత లేదా సంబంధిత విభాగం నుంచి పీజీతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. నాన్‌మెడికల్ అభ్యర్థులు సంబంధిత ఎమ్మెస్సీ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి.
వయస్సు: గరిష్టంగా 33 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ.15,600-39,100+గ్రేడ్ పే రూ. 6,600 +ఎన్‌పీఏ, తదితర అలవెన్స్‌లు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 500/-, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
రాతపరీక్షలో 80 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు-80 మార్కులు. 90 నిమిషాల్లో పూర్తిచేయాలి.
రాతపరీక్షలో షార్ట్‌లిస్ట్ పొందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ-20 మార్కులకు ఉంటుంది
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పంపించిన దరఖాస్తులను ప్రింట్ తీసి, సంబంధిత సర్టిఫికెట్లు, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను జతచేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపించాలి.
చిరునామా: Recruitment Cell,All India Institute of Medical sciences (AIIMS), BhubaneswarSijua, Post: Dumuduma,Bhubaneswar - 751 019
రాత పరీక్ష/ఇంటర్వ్యూ తేదీలు: త్వరలో ప్రకటిస్తారు
చివరితేదీ: ఆగస్టు 28
వెబ్‌సైట్: www.aiimsbhubaneswar.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎఫ్‌సీఐలో 187 ఉద్యోగాలు,
మహారాష్ట్ర రీజియన్‌లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
(ఎఫ్‌సీఐ)ను 1964లో ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: వాచ్‌మెన్
-మొత్తం పోస్టుల సంఖ్య: 187 జనరల్-103, ఓబీసీ-50, ఎస్సీ-18, ఎస్టీ-16)
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ. 8,100-18,070/-
అప్లికేషన్ ఫీజు: రూ. 300/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: ఆబెక్టివ్ రాతపరీక్ష, పీఈటీ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నింపేటప్పుడు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 9
పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు
వెబ్‌సైట్: www.fciregionaljobs.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వైల్డ్‌లైఫ్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు ఉద్యోగాలు.


వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు: కేంద్ర పర్యావరణ, అటవి, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ పరిధిలో వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ పనిచేస్తుంది. డబ్ల్యూఐఐ ఒక స్వతంత్ర సంస్థ.
-జూనియర్ కన్జర్వేషన్ ఆఫీసర్
-ఖాళీల సంఖ్య - 2
-పేస్కేల్: నెలకు రూ. 32,000/-
-అర్హతలు: ఎమ్మెస్సీలో వైల్డ్‌లైఫ్ సైన్సెస్ లేదా ఫారెస్ట్రీ/ఆగ్రానమి లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ లేదా బాటనీ/జువాలజీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-ప్రాజెక్ట్ అసిస్టెంట్
-ఖాళీల సంఖ్య - 4
-జీతం: నెలకు రూ. 20,000/-
-అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీలో లైఫ్‌సైన్సెస్ /హ్యుమానిటీస్ లేదా సోషల్ సైన్సెస్ ఉత్తీర్ణులు.
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 3
-వెబ్‌సైట్: http://www.wii.gov.in
.

0 comments:

Post a Comment