Monday, 28 August 2017

ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 139 అప్రెంటిస్‌లు, సీడాక్‌లో పీజీ డిప్లొమా ISRO Propulsion Complex Recruitment 139 Apprentices,PG diploma in C-dac.

ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 139 అప్రెంటిస్‌లు,
తమిళనాడు మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ టెక్నీషియన్/ట్రేడ్ అప్రెంటిస్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
1gslvd6
వివరాలు:
ప్రొపల్షన్ కాంప్లెక్స్ అనేది ఇస్రో పరిధిలో పనిచేస్తున్నది. ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను 1969 ఆగస్టు 15న విక్రమ్ సారాభాయ్ స్థాపించారు. ఇది అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం
నెలకొల్పిన సంస్థ.

-పోస్టు పేరు: ట్రేడ్ టెక్నీషియన్/ట్రేడ్ అప్రెంటిస్
-మొత్తం పోస్టుల సంఖ్య: 139
-ట్రేడ్ అప్రెంటిస్ - 80
-విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-15, వెల్డర్-8, మెషినిస్ట్-2, డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానిక్)-2,టర్నర్-2, ఎలక్ట్రీషియన్-8, డ్రాఫ్ట్స్‌మ్రెన్ (సివిల్)-7, ఎలక్ట్రానిక్ మెకానిక్/ మెకానిక్ (రేడియో అండ్ టెలివిజన్)-4, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-2, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్-1, డీజిల్ మెకానిక్-8, కార్పెంటర్-2, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్)-1, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (పాసా) లేదా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోపా)-18

-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎస్‌ఎస్సీ /ఎస్‌ఎస్‌ఎల్సీలో ఉత్తీర్ణత. ఎన్‌సీవీటీతో గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. లైబ్రెరీ సైన్స్ పోస్టులకు డిగ్రీ (లైబ్రెరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్)లోప్రథమశ్రేణిలో
-వేతనం: మొదటి ఏడాదికి రూ. 6,400/-, కొన్ని ట్రేడ్ అప్రెంటిస్‌లకు రూ. 7,200/- స్టయిఫండ్ చెల్లిస్తారు.
-టెక్నీషియన్ అప్రెంటిస్- 59 ఖాళీలు
-విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-13, ఎలక్ట్రికల్-7, ఎలక్ట్రానిక్స్-12, సివిల్-7, కమర్షియల్ ప్రాక్టీస్-15

-అర్హత: సంబంధిత ఇంజినీరింగ్‌లో ప్రథమశ్రేణిలో డిప్లొమా ఉత్తీర్ణత. కమర్షియల్ ప్రాక్టీస్‌కు డిప్లొమా (మోడ్రన్ ఆఫీస్ ప్రాక్టీస్/కమర్షియల్ ప్రాక్టీస్)లోప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
-వేతనం: రూ. 3542/- స్టయిఫండ్ చెల్లిస్తారు.
-వయస్సు: 2017 సెప్టెంబర్ 2 నాటికి 35 ఏండ్లకు (కమర్షియల్ ప్రాక్టీస్‌కు 26 ఏండ్లు) మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల పాటు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక విధానం: అకడమిక్ ప్రతిభను స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత అర్హతగల అభ్యర్థులకు రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరి తేదీ: సెప్టెంబర్ 2
-వెబ్‌సైట్: www. iprc.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీడాక్‌లో పీజీ డిప్లొమా



హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CDAC 
వివరాలు:
సీడాక్ కేంద్ర ప్రభుత్వ సంస్థ. దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో సీడాక్ కేంద్రాలు ఉన్నాయి. పరిశోధన, పలు ప్రోగ్రామ్స్‌ను అందించడం దీని ప్రత్యేకత.
-కోర్సు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ డిజైన్‌లో పీజీ డిప్లొమా 
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్‌లో ఈసీఈ లేదా ఈఈఈ లేదా ఈఐలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు లేదా ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్‌లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 7
-వెబ్‌సైట్: www.esdmindia.in

0 comments:

Post a Comment