Thursday, 17 August 2017

'ఐబీ'లో 1300 కొలువులు, ఎన్‌సీఈఆర్‌టీలో 240 ప్రొఫెసర్లు, ట్రైబల్ వెల్ఫేర్‌లో గెస్ట్ ఫ్యాకల్టీలు, ఐఐఎం కోజికోడ్‌లో అసిస్టెంట్లు, ఎన్‌హెచ్‌ఏఐ ఇంజినీర్ పోస్టులు. Ib Recruitment 1300 Posts,240 professors Jobs in NCERT,Guest Faculties in Tribal Welfare,Assistant jobs in IIM Kozhikode,NHAI Recruitment Engineer posts

'ఐబీ'లో 1300 కొలువులు,

ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు అవకాశం
-రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-దరఖాస్తుకు చివరితేదీ- సెప్టెంబర్ 2

IBPS
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అపైర్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఖాళీగా ఉన్న గ్రేడ్2 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

వివరాలు:

ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది భారత దేశంలోని అంతర్గత నిఘా సంస్థ. ఇది ప్రపంచంలో అత్యంత పురాతన గూఢచార సంస్థగా ప్రసిద్ధిగాంచినది.
పోస్టు పేరు: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (గ్రేడ్-2)
మొత్తం పోస్టులు: 1300 (జనరల్-951, ఓబీసీ-184, ఎస్సీ-109, ఎస్టీ-56)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్‌లో ప్రావీణ్యం ఉండాలి.
వయస్సు: 2017 సెప్టెంబర్ 2 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ.9,300-34,800+గ్రేడ్ పే రూ. 4,600. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులుంటాయి.
అప్లికేషన్ ఫీజు: రూ. 100/- (జనరల్, ఓబీసీ అభ్యర్థులు), ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
-రాతపరీక్ష టైర్-1(ఆబ్జెక్టివ్ ), టైర్-2 (డిస్క్రిప్టివ్) విధానంలో ఉంది.
-కేవలం రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే మెరిట్ లిస్ట్ తయారుచేసి, ఇంటర్వ్యూకు అనుమతిస్తారు.

రాత పరీక్ష విధానం:

-టైర్-1(ఆబ్జెక్టివ్ పేపర్) మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు.
-మొత్తం నాలుగు విభాగాల్లో ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు - 25 మార్కులు.
-ఈ ఆబ్జెక్టివ్ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్/అనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అంశాలపై ప్రశ్నలను ఇస్తారు.
-ఈ పరీక్షకు కేటాయించిన సమయం-60 నిమిషాలు.
-ప్రతి తప్పు సమాధానికి 1/4 వంతు మార్కులను తగ్గిస్తారు.
-టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్) మొత్తం 50 మార్కులకు ఉంటుంది.
-దీనిలో ఎస్సే రైటింగ్ ఇన్ ఇంగ్లిష్‌లో 30 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్‌కు 20 మార్కులు.
-ఈ పరీక్షకు కేటాయించిన సమయం-60 నిమిషాలు.
-టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్)లో కనీసం 33 శాతం మార్కులను సాధించాలి.
-ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది.

-టైర్-1, టైర్-2, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా మొత్తం 33 పరీక్ష సెంటర్‌లలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. అవి హైదరాబాద్, విజయవాడ, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, గువాహటి, అహ్మదాబాద్, ఐజ్వాల్, అమృత్‌సర్, బెంగళూరు, భోపాల్, ఇంఫాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కోహిమా, కోల్‌కతా, లేహ్, మీరట్, అగర్తలా, లక్నో, సిలిగురి, త్రివేండ్రమ్, వారాణాసి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. మరే ఇతర విధానంలోనైనా పంపిన దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తును పంపేటప్పుడు వినియోగంలో ఉన్న ఈ- మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : సెప్టెంబర్ 2
వెబ్‌సైట్: www.mha.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఈఆర్‌టీలో 240 ప్రొఫెసర్లు,

న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైయినింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
TSTWRIE
వివరాలు:
ఎన్‌సీఈఆర్‌టీ అనేది ఎడ్యుకేషనల్ రీసెర్చ్, టీచర్స్ ట్రెయినింగ్ అండ్ కరికులం అభివృద్ధి చేయడంలో ఒక శిఖరాగ్ర సంస్థ. ఎన్‌సీఈఆర్‌టీని 1961లో ఏర్పాటు చేశారు. భోపాల్, భువనేశ్వర్, మైసూర్ అండ్ షిల్లాంగ్, ఢిల్లీ, అజ్మీర్‌లలో తన ప్రాంతీయ కార్యాలయాలను కలిగి ఉంది
మొత్తం పోస్టుల సంఖ్య: 240. వీటిలో ప్రొఫెసర్-36, అసోసియేట్ ప్రొఫెసర్-71, అసిస్టెంట్ ప్రొఫెసర్-133 పోస్టులు ఉన్నాయి.
పోస్టు పేరు: ప్రొఫెసర్స్
విభాగాలు: సైకాలజీ, సైకాలజీ/ఎడ్యుకేషన్, హోంసైన్స్/సైకాలజీ/ఎడ్యుకేషన్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎడ్యుకేషన్/స్టాటిస్టిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, బాటనీ, స్టాటిస్టిక్స్, సోషియాలజీ, హిస్టరీ, కామర్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, పాపులేషన్ స్టడీస్, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్, కన్నడ, ఒడియా, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్, లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ సైన్స్/సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, హోం సైన్స్ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లేదా టెక్స్‌టైల్ అండ్ క్లాతింగ్/ కాస్మోటిక్స్), బయోసైన్స్ లేదా బయోటెక్నాలజీ, హెల్త్ సైన్స్/ఫార్మసీ, యానిమల్ సైన్స్, మెకానికల్/మాన్యుఫాక్చరింగ్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ లేదా కన్‌స్ట్రక్షన్, ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఐటీ, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్-రిటైల్, బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్, హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ టూరిజం, సెక్యూరిటీ/ డిఫెన్స్ సైన్స్/మిలిటరీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ అండ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, సైన్స్‌లో పీజీ,ఎంఈడీ/ ఎంఏ ఎడ్యుకేషన్, పీహెచ్‌డీ, నెట్/స్లెట్, సెట్‌లో ఉత్తీర్ణత. సంబంధిత పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. టీచింగ్/రిసెర్చ్/ఇండస్ట్రీలో ప్రొఫెసర్‌కు పదేండ్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు ఆరేండ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు మూడేండ్ల అనుభవం ఉండాలి.

పే స్కేల్:
-ప్రొఫెసర్-రూ. 37,400-67,000 + అకడమిక్ గ్రేడ్ పే రూ. 10,000/-
-అసోసియేట్ ప్రొఫెసర్-రూ. 37,400-67,000 + అకడమిక్ గ్రేడ్ పే రూ. 9,000/-
-అసిస్టెంట్ ప్రొఫెసర్-రూ. 15600-39,100 + అకడమిక్ గ్రేడ్ పే రూ. 6,000/-
పే స్కేల్: రూ.14,000/- (నెట్‌లో అర్హత ఉన్నవారికి రూ. 16,000/-)
అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, అవసరమైన సర్టిఫికెట్స్ జతపరిచి సంబంధిత రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి పంపాలి.
ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 18
వెబ్‌సైట్:www. ncert. nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ట్రైబల్ వెల్ఫేర్‌లో గెస్ట్ ఫ్యాకల్టీలు,
హైదరాబాద్‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ టీఎస్ రెసిడెన్షియల్‌డిగ్రీ కళాశాల్లో పార్ట్‌టైమ్/గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
TEACHERS
వివరాలు:
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సోసైటీ ఆధ్యర్యంలో నడుస్తున్న సంస్థల్లో పని చేయాల్సి ఉంటుంది.
పోస్టు పేరు: గెస్ట్ ఫ్యాకల్టీ/ పార్ట్ టైమ్ లెక్చరర్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంసీఏ, ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్)లో 55 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. డిగ్రీ/జూనియర్ కళాశాలల్లో పదవీ విరమణ పొందిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్/సెట్, ఎంఫిల్, పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యం.
సబ్జెక్ట్‌లు: తెలుగు, ఇంగ్లిష్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, బాటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, కామర్స్
గ్రూపులు: ఎంపీసీ, ఎంపీసీఎస్, బీజెడ్‌సీ, బీజెడ్ మైక్రోబయాలజీ, బీజెడ్ బయోటెక్నాలజీ, బీకాం (జనరల్), బీకాం (కంప్యూటర్స్), బీఏ (హెచ్‌ఈపీ), బీఏ (హెచ్‌ఈ జాగ్రఫీ)
పే స్కేల్: రూ. 20,000/-
ఎంపిక: అకడమిక్ మార్కులు, డెమో, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. వినియోగంలో ఉన్న ఈ-మొయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 18
ఇంటర్వ్యూ కాల్‌లెటర్స్: ఆగస్టు 22 నుంచి
వెబ్‌సైట్: www.tgtwgurukulam.telangana.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎం కోజికోడ్‌లో అసిస్టెంట్లు,
కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.<\b>

వివరాలు:
మేనేజ్‌మెంట్ విద్యకు ఐఐఎం కోజికోడ్ ఒక ప్రతిష్ఠాత్మకమైన సంస్థ.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
-జూనియర్ ఇంజినీర్ (సివిల్/ఎలక్ట్రికల్)-3
-అసిస్టెంట్-5, అకౌంటెంట్-2, చీఫ్ పర్చేస్ మేనేజర్/చీఫ్ మేనేజర్-2, ఈఆర్‌పీ అడ్వైజర్-1
అర్హత:బీఈ/బీటెక్, పీజీ, ఎంసీఏ, సీఏ/ఐసీడబ్ల్యూఏ, బీకాం, ఇంటర్‌లో ఉత్తీర్ణత.
వయస్సు: 35 ఏండ్లకు మించరాదు (పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంది)
ఎంపిక: రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా
అప్లికేషన్ ఫీజు: రూ. 118/-
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 8
వెబ్‌సైట్:www.iimk.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌హెచ్‌ఏఐ ఇంజినీర్ పోస్టులు

.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
NHAI
వివరాలు:
రోడ్ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్ మంత్రిత్వశాఖ పరిధిలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది.
పోస్టు: సైట్ ఇంజినీర్స్
-ఖాళీల సంఖ్య - 18
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
పనిచేయాల్సిన ప్రదేశాలు: మధురై, విల్లుపురం, కోయంబత్తూరు, నాగర్‌కోయిల్, కానూర్, క్రిష్ణగిరి, వెల్లూరు, బెంగళూరు.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
చివరితేదీ: సెప్టెంబర్ 4
వెబ్‌సైట్: www.nhai.org


.

0 comments:

Post a Comment