Wednesday, 9 August 2017

ఇస్రోలో 128 డ్రైవర్ పోస్టులు, ఓబీసీలో 382 అడ్వకేట్స్, అలహాబాద్ హైకోర్టులో ఉద్యోగాలు, హాల్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్, హెచ్‌సీయూలో ఉద్యోగాలు. 128 Driver posts in ISRO,382 Advocates Posts in OBC,Jobs in Allahabad High Court,Hal apprenticeship training,Jobs In HCU

ఇస్రోలో 128 డ్రైవర్ పోస్టులు,

లైట్, హెవీ వెహికిల్ డ్రైవర్ పోస్టులు
- పదోతరగతి, వ్యాలిడిటీ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉన్నవారు అర్హులు
- మంచి జీతభత్యాలు, భద్రమైన కొలువు
- రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ద్వారా ఎంపిక

tower
దేశవ్యాప్తంగా పలు యూనిట్లలో ఖాళీగా ఉన్న లైట్ వెహికిల్, హెవీ వెహికిల్ డ్రైవర్ పోస్టుల భర్తీకి ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: ఇస్రో భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇస్రో పరిధిలో పలు యూనిట్లు ఉన్నాయి. వీటన్నింటిలో ఖాళీల భర్తీకి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఐసీఆర్‌బీ) నోటిఫికేషన్‌ను విడుదలచేసింది.
-మొత్తం ఖాళీల సంఖ్య - 128. యూనిట్ల వారీగా ఖాళీల వివరాలు...
-లైట్ వెహికిల్ డ్రైవర్ ఏ పోస్టులు - 50
-అహ్మదాబాద్ - 1, బెంగళూరు - 15, హైదరాబాద్ -4, న్యూఢిల్లీ - 1, శ్రీహరికోట - 10, తిరువనంతపురం - 19 ఖాళీలు ఉన్నాయి. వీటిలో రిజర్వేషన్ల ప్రకారం జనరల్ - 27, ఓబీసీ - 15, ఎస్సీ -7, ఎస్టీ - 1 ఖాళీ ఉన్నాయి.
-హెవీ వెహికిల్ డ్రైవర్ ఏ పోస్టులు - 76. యూనిట్ల వారీగా ఖాళీలు..
-అహ్మదాబాద్ -3, బెంగళూరు - 5, శ్రీహరికోట - 8, తిరువనంతపురం - 60 ఖాళీలు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రకారం జనరల్ - 47, ఓబీసీ - 21, ఎస్సీ - 7, ఎస్టీ - 1 ఖాళీ ఉన్నాయి.
-స్టాఫ్ కార్ డ్రైవర్ ఏ - 2 ఖాళీలు. ఇవి బెంగళూరు యూనిట్‌లో ఉన్నాయి. ఈ ఖాళీలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి.
-అర్హతలు: పదోతరగతి/ ఎస్సెస్సీ లేదా మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
-లైట్ వెహికిల్ డ్రైవర్ పోస్టుకు మూడేండ్ల అనుభవం, వ్యాలిడిటీ ఉన్న ఎల్‌వీడీ లైసెన్స్, పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జి కలిగి ఉండాలి.
-హెవీ వెహికిల్ డ్రైవర్ పోస్టు - ఐదేండ్ల అనుభవం ఉండాలి. దీనిలో కనీసం మూడేండ్ల హెవీ వెహికిల్ నడిపిన అనుభవం ఉండాలి. దీంతోపాటు వ్యాలిడిటీ ఉన్న హెచ్‌వీడీ లైసెన్స్, పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జి ఉండాలి.
-స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టు - మూడేండ్లు లైట్ వెహికిల్ డ్రైవర్‌గా అనుభవం ఉండాలి. వ్యాలిడిటీ ఉన్న ఎల్‌వీడీ లైసెన్స్, పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జి ఉండాలి.
-వయస్సు: 2017, ఆగస్టు 28 నాటికి 35 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు 40 ఏండ్లు, ఓబీసీలకు 38 ఏండ్లు మించరాదు.
నోట్: అభ్యర్థులు ఒకే జోన్‌లో మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే పోస్టుకు వేర్వేరు జోన్లలో దరఖాస్తు చేసుకోరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100 (ప్రతి దరఖాస్తుకు అంటే ఒక్క పోస్టుకు)
నోట్: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
-ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను మొదట షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం రాతపరీక్షను నిర్వహిస్తారు.
రాతపరీక్ష విధానం: -ఇది నాలుగు పార్ట్‌లు ఉంటుంది.
-పార్ట్- ఏ 50 మార్కులు. దీనిలో మోటార్ వెహికిల్ యాక్ట్, 1939 సవరణలపై ప్రశ్నలు ఇస్తారు.
-పార్ట్ - బీలో 15 మార్కులు ఇంగ్లిష్‌పై ఇస్తారు.
-పార్ట్ - సీలో 15 మార్కులు అర్థమెటిక్‌పై ప్రశ్నలు ఉంటాయి.
-పార్ట్ -డీలో 20 మార్కులకు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఇస్తారు.
గమనిక: పార్ట్ -ఏలో కనీసం 50 శాతం మార్కులు, ఇతర విభాగాలన్నీ కలిపి 50 శాతం (కనీసం) మార్కులు వచ్చినవారిని క్వాలిఫైగా పరిగణిస్తారు. పోస్టుల సంఖ్యను బట్టి వీరిని షార్ట్‌లిస్ట్ చేస్తారు.
-షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు స్కిల్‌టెస్ట్ నిర్వహిస్తారు.
-స్కిల్‌టెస్ట్ కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. 100 పాయింట్ల స్కేల్‌పై కనీసం 60 శాతం మార్కులు రావాలి.
-పరీక్షతేదీ: నవంబర్ 26
-పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, డెహ్రాడూన్, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, న్యూఢిల్లీ, తిరువనంతపురం.
-పేస్కేల్: లెవల్ 2 ఆఫ్ పే మ్యాట్రిక్స్ కింద కనీస జీతం రూ. 19,990/- ఇస్తారు. దీనికి అదనంగా హెచ్‌ఆర్‌ఏ, టీఏ తదితరాలు ఉంటాయి.
-నేషనల్ పెన్షన్ సిస్టం, వైద్యసౌకర్యాలు, సబ్సిడీ క్యాంటీన్ సౌకర్యం, టీఏ తదితర అలవెన్స్‌లు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 28
-ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఆగస్టు 29
-వెబ్‌సైట్: http://www.isro.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఓబీసీలో 382 అడ్వకేట్స్,
జాతీయ బ్యాంకుల్లో ఒక్కటైన ఓరియంటల్ బ్యాంక్ కామర్స్ (ఓబీసీ) జైపూర్, ఆగ్రా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అడ్వకేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:రాయ్ బహుదూర్ లాలా సోహన్‌లాల్ 1943లో ఓబీసీని స్థాపించారు. 1980 ఏప్రిల్ 15న జాతీయ బ్యాంక్‌గా ఏర్పాటుచేశారు.
-మొత్తం ఖాళీల సంఖ్య : 382 పోస్టులు (జైపూర్ పరిధి-296, ఆగ్రా పరిధి-86)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంస్థ నింబంధన ప్రకారం సంబంధిత లా డిగ్రీ/పీజీ. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: బ్యాంక్ నిబంధనల ప్రకారం ఉండాలి
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్నీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 26, ఆగ్రా రిజీయన్‌కు ఆగస్టు 31
-వెబ్‌సైట్: www.obcindia.co.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అలహాబాద్ హైకోర్టులో ఉద్యోగాలు,
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు సివిల్ కోర్టు స్టాఫ్ సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి
అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:ఉత్తరప్రదేశ్ హైకోర్టు రాజధాని లక్నోలో కాకుండా అలహాబాద్‌లో ఉంది. ఈ కోర్టును ఆగ్రా (1866) నుంచి అలహాబాద్ (1869)కు మార్చారు. లక్నోలో హైకోర్టు బెంచ్ మాత్రమే ఉన్నది.
-ఖాళీల సంఖ్య: 4,386
-స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III (కేటగిరీ-సి క్యాడర్)- 543 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేషన్‌లో నాలెడ్జ్‌ను కలిగి ఉండాలి.
-జూనియర్ అసిస్టెంట్, పెయిడ్ అప్రెంటిస్ (కేటగిరీ-సి క్యాడర్) - 1786 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంగ్లిష్/హిందీ టైపింగ్‌లో ప్రావీణ్యం ఉండాలి.
-డ్రైవర్స్ (కేటగిరీ-సి క్యాడర్)-37 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి హైస్కూల్/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న ఫోర్‌వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
-కేటగిరీ-డి క్యాడర్- 2020 పోస్టులు
-ఈ పోస్టుల్లో ట్యూబ్‌వెల్ ఆపరేటర్ కమ్ ఎలక్ట్రీషియన్, ప్రాసెస్ సర్వర్, ఆర్డర్లీ, ఫ్యూన్, ఆఫీస్ ప్యూన్/ఫర్రష్, చౌకీదార్, వాటర్‌మ్యాన్, స్వీపర్, మాలీ, కూలీ, బిస్తీ/లిఫ్ట్‌మ్యాన్, స్వీపర్ కమ్ ఫర్రష్ పోస్టులు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి జూనియర్ హైస్కూల్/ హై స్కూల్‌లో ఉత్తీర్ణత(పోస్టుల వారీగా విద్యార్హతలు ఉండాలి)
-వయస్సు: 2016 జూలై 1 నాటికి 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: జూనియర్ అసిస్టెంట్‌కు రూ.5200-20200+ గ్రేడ్ పే రూ.2000 (అన్ని పోస్టులకు గ్రేడ్ పే మాత్రమే వేర్వేరుగా ఉంది)
-అప్లికేషన్ ఫీజు: రూ. 750/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 500/-(కొన్ని పోస్టులకు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 300/-)
-ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్, ప్రోగ్రామింగ్ టెస్ట్
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 22
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: ఆగస్టు 24
-వెబ్‌సైట్: www.allahabadhighcourt.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హాల్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్,

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్ (ఏడాది వ్యవధికి) చేయడానికి అర్హులైన ఇంజినీరింగ్, డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో పనిచేస్తుంది. ఈ సంస్థను 1940లో హిందుస్థాన్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా స్థాపించగా, 1964లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌గా పేరు మార్చారు.
-ఇంజినీరింగ్ అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్
-విభాగాలు: ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కెమికల్, సివిల్, కంప్యూటర్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, ఏవియానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, టెలికమ్యూనికేషన్, మెకానికల్, ఇండస్ట్రియల్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్, ఆటోమొబైల్, ఫౌండ్రీ టెక్నాలజీ, మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత బ్రాంచిలో నాలుగేండ్ల బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత.
-డిప్లొమా అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్
-విభాగాలు: ఏరోనాటికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఏవియానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, డిప్లొమా కమర్షియల్ ప్రాక్టీస్, మెటలర్జీ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత.
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి సంబంధిత ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 22
-వెబ్‌సైట్: www.hal-india.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌సీయూలో ఉద్యోగాలు.హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) ఖాళీగా ఉన్న ట్యూటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
హెచ్‌సీయూని పీజీలోని టీచింగ్ అండ్ రిసెర్చ్ రంగంలో మెలకువలను అందించడానికి ప్రాథమిక విద్యాసంస్థగా 1974 అక్టోబర్ 2న ఏర్పాటు చేశారు.
-ఖాళీల సంఖ్య: 2 పోస్టులు 
-విభాగాలు: స్పోకెన్ ఇంగ్లిష్ గ్రామర్
-అర్హత: ఇంగ్లిష్‌లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. 
-దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 10
-వెబ్‌సైట్: www.uohyd.ac.in

0 comments:

Post a Comment