Wednesday, 5 July 2017

University Entry Scheme in Navy,Apprentices in MAZAGON,Jobs at NCAORCompetition Commission of India Jobs,Vacancies in ISRO. నేవీలో యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్, మజ్‌గావ్‌డాక్‌లో అప్రెంటిస్‌లు, ఎన్‌సీఏఓఆర్‌లో ఉద్యోగాలు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు, ఇస్రోలో ఖాళీలు.

నేవీలో యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్,

నేవీలో బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులకు అవకాశం
-యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఎంపిక
-శిక్షణ పూర్తయిన వెంటనే లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం
-మంచి జీతాలు, చాలెంజింగ్ కెరీర్, ఉద్యోగ భద్రత

భారత ప్రభుత్వ రక్షణశాఖ పరిధిలోని ఇండియన్ నేవీ (ఐఎస్) యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ (యూఈఎస్) కింద పర్మినెంట్ కమిషన్ ఆఫీసర్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్), షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ (ఎగ్జిక్యూటివ్/టెక్నికల్ బ్రాంచ్) పోస్టుల భర్తీకి అర్హత గల ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇండియన్ నేవల్ అకాడమీ విడుదలచేసింది.
INDIAN-NAVY
వివరాలు:
భారత నావికాదళంలో యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ కింద పర్మినెంట్/షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ కోర్సు కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2018 నుంచి ప్రారంభమవుతుంది.
-ఎగ్జిక్యూటివ్ బ్రాంచీ (ఐటీ, జనరల్ సర్వీస్-ఎక్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్)
-విదార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఐటీ పోస్టుకు బీఈ/బీటెక్(కంప్యూటర్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత. పదోతరగతి, ఇంటర్ స్థాయిలో 60 శాతం (ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో కూడా 60 శాతం) మార్కులతో ఉత్తీర్ణత.

-టెక్నికల్ బ్రాంచీ (ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్)
-విదార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ (మెకానికల్, మెరైన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ప్రొడక్షన్, ఏరోనాటికల్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, కంట్రోల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, మెటలర్జీ, మెకట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఇంజినీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఏవియానిక్స్, కంట్రోల్ ఇంజినీరింగ్, సివిల్, మెటలర్జీ, నేవల్ ఆర్కిటెక్చర్, ఓషియన్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్, షిప్ టెక్నాలజీ, షిప్ బిల్డింగ్, షిప్ డిజైన్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

-నేవల్ ఆర్కిటెక్చర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టులకు పురుషులతోపాటు మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
-నాలుగేండ్ల బీఈ/బీటెక్ లేదా ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎగ్జిక్యూటివ్ జనరల్ సర్వీస్ పోస్టులు (పురుషులు) మాత్రమే పర్మినెంట్ కమిషన్/(ఎస్‌ఎస్‌సీ) కింద, మిగతా పోస్టులు షార్ట్ సర్వీస్ కమిషన్ కింద భర్తీచేస్తారు.
-వయస్సు: 1994 జూలై 2 నుంచి 1997 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.

శారీరక ప్రమాణాలు:

-ఎత్తు: పురుషులు-157 సెం.మీ., మహిళలు 152 సెం.మీ. ఉండాలి
-కంటిచూపు: 6/12, 6/12; 6/6, 6/9;6/24, 6/24;
-పదోన్నతి: సబ్ లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ కమాండర్ కమాండర్ హోదా వరకు పదోన్నతి పొందవచ్చు.

పే స్కేల్:

-సబ్ లెఫ్టినెంట్: రూ. 56,100-1,10,700 + ఎంఎస్‌పీ రూ. 15,500/-
-లెఫ్టినెంట్: రూ. 61,300-1,20,900 + ఎంఎస్‌పీ రూ. 15,500/-
-లెఫ్టినెంట్ కమాండర్: రూ. 69,400-1,36,900+ఎంఎస్‌పీ రూ. 15,500/-
-కమాండర్: రూ.1,21,200-2,12,400 +ఎంఎస్‌పీ రూ. 15,500/-
-సబ్ లెఫ్టినెంట్ హోదాలో నెలకు సుమారుగా రూ. 72,444-81,700/-జీతం వస్తుంది. వీటికి అదనంగా గ్రూప్ ఇన్సూరెన్స్, ఇతర సౌకర్యాలు ఉంటాయి.

ఎంపిక విధానం:
-యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశానికి అర్హత అభ్యర్థులను నేవల్ క్యాంపస్ సెలక్షన్ టీమ్ ఎంపిక చేస్తుంది.
-పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా సర్వీసెస్ సెలక్షన్ బోర్డు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. తర్వాత వారికి ఇంటర్వ్యూలకు కాల్‌లెటర్‌ను పంపిస్తారు.
-ఎస్‌ఎస్‌బీ షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను రెండు దశల్లో ఎంపిక చేస్తుంది.
-షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు 2017 డిసెంబర్ నుంచి 2018 ఏప్రిల్ మధ్య బెంగళూరు, భోపాల్, కోయంబత్తూరు, విశాఖపట్నంలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
-ఇంటర్వ్యూల్లో మొదటి స్టేజీలో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్, డిస్కషన్ టెస్ట్ ఇంటర్వ్యూలను మొదటిరోజు నిర్వహిస్తారు. తర్వాత రెండో దశలో వీరికి సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలను మొత్తం ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు.

-ఎస్‌ఎస్‌బీ మెడికల్ ఫిట్ అయిన అభ్యర్థుల జాబితాను ఖాళీల సంఖ్యను బట్టి ప్రకటిస్తుంది.
-శిక్షణ: నేవల్ ఓరియెంటేషన్ కోర్సును కేరళ, ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2018 నుంచి శిక్షణ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఈ అప్లికేషన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
-ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జూలై 1
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మజ్‌గావ్‌డాక్‌లో అప్రెంటిస్‌లు,
భారత రక్షణ శాఖ పరిధిలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్ లిమిటెడ్ (ఎండీఎల్) వివిధ ట్రేడ్ విభాగాల్లో అప్రెంటిస్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
MAZAGON-DOCK
వివరాలు:
భారత నావికా దళానికి కావల్సిన యుద్ధనౌకలను, సబ్‌మెరైన్స్‌ను ఈ డాక్‌లో నిర్మిస్తారు. ఇది ప్రపంచస్థాయి కలిగిన యార్డ్.
-మొత్తం ట్రేడ్ ఖాళీల సంఖ్య: 279
-విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రీషియన్-27, ఫిట్టర్-42, డ్రాఫ్ట్‌మెన్ (మెకానికల్)-20, పైప్ ఫిట్టర్-25, స్ట్రక్చరల్ ఫిట్టర్-42, మెరైన్ పెయింటర్-15, ఎలక్ట్రానిక్ మెకానిక్-30, కార్పెంటర్-6, రిగ్గర్-34, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)-28
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి ఎనిమిదో తరగతి, పదోతరగతి/10+2తోపాటు ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ సంస్థ నుంచి సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: ఎనిమిదో తరగతివారికి 14 నుంచి 18 ఏండ్లు, పదోతరగతి వారికి 15 నుంచి 19 ఏండ్లు, ఐటీఐవారికి 16 నుంచి 21 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలోసడలింపు ఉంటుంది.
-ట్రెయినింగ్ పీరియడ్: రెండు/మూడేండ్లు లేదా ఏడాది.
-స్టయిఫండ్: పదోతరగతివారికి మొదటి ఏడాది రూ. 6930/-, రెండో ఏడాది రూ. 7920/-, మూడో ఏడాది రూ. 8910/- ఇస్తారు.
-ఐటీఐవారికి మొదటి ఏడాది రూ. 7920/-, రెండో ఏడాది రూ. 8910/- ఇస్తారు. ఎనిమిదో తరగతివారికి మొదటి ఏడాది రూ. 6930/-, రెండో ఏడాది రూ. 7920/- ఇస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి..
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 20
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: జూలై 24
-వెబ్‌సైట్: http://www.mazagondock.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఏఓఆర్‌లో ఉద్యోగాలు,

నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రిసెర్చ్ (ఎన్‌సీఏఓఆర్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ncaor 
వివరాలు:

ఎన్‌సీఏఓఆర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం పోస్టులు : 26
-వెహికల్ మెకానిక్-2,వెహికల్ ఎలక్ట్రీషియన్-2
-స్టేషన్ ఎలక్ట్రీషియన్-2, ఆపరేటర్ ఎక్స్‌కావేటింగ్ మెషీన్-1
-క్రేన్ ఆపరేటర్-2, జనరేటర్ మెకానిక్/ఆపరేటర్-2
-వెల్డర్-1, బాయిలర్ ఆపరేటర్/ ప్లంబర్ ఫిట్టర్-1, కార్పెంటర్-1, మల్టీటాస్కింగ్ స్టాఫ్-1
-మేల్ నర్స్-2, ల్యాబ్ టెక్నీషియన్-2, ఇన్వెంటరీ /బుకింగ్ కీపింగ్ స్టాఫ్-2, కుక్-5
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ (నర్సింగ్)లో ఉత్తీర్ణత. 
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. 
చిరునామా: Ministry of Earth Sciences, Prithvi Bhawan, IMD Campus, Opp. India Habitat Centre,LodhiRoad,New elhi110 003
-ఇంటర్వ్యూ తేదీ: జూలై 19, 20,21

-వెబ్‌సైట్: http://www.ncaor.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు,

న్యూ ఢిల్లీలోని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్రొఫెషనల్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
competitio
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 31
-డైరెక్టర్-3 (లా, ఎకనామిక్స్, ఫైనాన్షియల్)
-జాయింట్ డైరెక్టర్-2 (లా, ఎకనామిక్స్)
-డిప్యూటీ డైరెక్టర్-12(లా, ఎకనామిక్స్, ఫైనాన్షియల్ అనాలిసిస్)
-అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ (కామర్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్) లేదా ఎల్‌ఎల్‌బీ, మాస్టర్ పీజీలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-ఆఫీస్ మేనేజర్-14 (కార్పొరేట్ సర్వీస్, లైబ్రెరీ సర్వీసెస్)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, హెచ్‌ఆర్‌ఎంలో డిప్లొమా, లైబ్రెరీ సైన్స్‌లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. 
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా

చిరునామా: DEPUTY DIRECTOR (HR),COMPETITION COMMISS ION OF INDIA, 3rd FLOOR,HINDUSTANT TIMES HOUSE,18-20,KASTURBA GANDHIMARG, NEW DELHI-110001
-దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 18 

-వెబ్‌సైట్: www.cci.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇస్రోలో ఖాళీలు.



ఇస్రో పరిధిలోని స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ హిందీ టైపిస్ట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ISRO-Recruitment
వివరాలు:
డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో ఇస్రో పనిచేస్తున్నది.
-పోస్టులు: హిందీ టైపిస్ట్ - 3 ఖాళీలు (ఇస్రో బెంగళూరు హెడ్‌క్వార్టర్స్‌లో, ఎంసీఎఫ్, హసన్)
-హిందీ టైపిస్ట్ - 1 ఖాళీలు (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్)
-అర్హతలు: ఆర్ట్స్/సైన్స్ లేదా కామర్స్ లేదా మేనేజ్‌మెంట్/కంప్యూటర్స్‌లో డిగ్రీ చేసినవారు. హిందీలో నిమిషానికి 25 పదాలు కంప్యూటర్‌పై టైప్ చేయాలి. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్‌లో పరిజ్ఞానం కలిగి ఉండాలి.
-టెక్నీషియన్ బీ - 1
-అర్హతలు: పదోతరగతి+ఐటీఐ(ఎలక్ట్రికల్)
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: జూలై 21
-వెబ్‌సైట్: http://isro.gov.in

0 comments:

Post a Comment