Thursday, 13 July 2017

సెక్యూరిటీ ప్రెస్‌లో సూపర్‌వైజర్లు, ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్లు, ఐసీపీఆర్‌లో ఎల్‌డీసీలు, ఎఫ్‌సీఐలో వాచ్‌మెన్లు. Supervisors at Security Press,Senior Residences in ESIC,LDCs in ICPR,Watchmen Posts in FCI.

సెక్యూరిటీ ప్రెస్‌లో సూపర్‌వైజర్లు,

హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
press
వివరాలు:

నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్స్, సెంట్రల్ ఎక్సైజ్ స్టాంపులు, పోస్టల్ స్టేషనరీ, తదితర తయారీకి 1982లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఇది సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ.
-మొత్తం పోస్టులు: 6
-పోస్టు పేరు: సూపర్‌వైజర్
-విభాగాలు: ఎలక్ట్రికల్-1, మెయింటెనెన్స్ మెకానికల్-1, రిసోర్స్ మేనేజ్‌మెంట్-4
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్/తత్సమాన పరీక్షలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.రిసోర్స్ మేనేజ్‌మెంట్ పోస్టులకు బీకాం/ డిప్లొమా ఇన్ ట్యాక్సేషన్, బీబీఏ లేదా ఏదైనా
ప్రథమశ్రేణి డిగ్రీతోపాటు హెచ్‌ఆర్‌లో డిప్లొమా ఉండాలి.
-వయస్సు: 2017 జూలై 25 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్ : రూ.12,300-25,400/-
-ఎంపిక: రాత పరీక్ష
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 25
-వెబ్‌సైట్: https://spphyderabad.spmcil.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్లు,

అహ్మదాబాద్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పరిధిలో పనిచేస్తున్న ఈఎస్‌ఐసీ మోడల్ హాస్పిటల్ ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పార్ట్ టైమ్ స్పెషలిస్టుల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ESIC
వివరాలు:

ఈఎస్‌ఐసీని మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1952 ఫిబ్రవరి 24న స్థాపించారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 27 (ఈ పోస్టులు అహ్మదాబాద్ (బాపూనగర్) ఈఎస్‌ఐ మోడల్ హాస్పిటల్‌లో భర్తీచేస్తారు)
-పోస్టు పేరు: సీనియర్ రెసిడెంట్-24 పోస్టులు
-విభాగాలు: మైక్రోబయాలజీ, ఈఎన్‌టీ, రేడియాలజీ, మెడిసిన్, అనెస్థీషియా, సర్జరీ, ఓబీఎస్ అండ్ గైనకాలజీ, పిడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, ఐసీయూ/క్యాజువాలిటీ, బ్లడ్ బ్యాంక్
-పోస్టు పేరు: పార్ట్ టైమ్ స్పెషలిస్ట్-3
-విభాగాలు: పల్మనాలజీ, ఆర్థోపెడిక్, రేడియాలజీ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి సెల్ప్ అటెస్టెడ్ కాపీలను జతపరిచి, రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి పంపాలి.
-ఇంటర్వ్యూ రోజున ఈఎస్‌ఐ సంబంధిత అధికారి వద్ద హాజరుకావాలి.
-ఇంటర్వ్యూ తేదీ: జూలై 10,13,17,18


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీపీఆర్‌లో ఎల్‌డీసీలు,

న్యూఢిల్లీని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాసఫికల్ రిసెర్చ్ (ఐసీపీఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

Indian-Council
వివరాలు:

ఐసీపీఆర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తుంది. దీన్ని 1977లో ఏర్పాటు చేసినా అధికారికంగా జూలై 1981 నుంచి పనిచేస్తుంది.
-డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ రిసెర్చ్)-1
-లోయర్ డివిజన్ క్లర్క్-3
-అర్హత: ఇంటర్‌లో ఉత్తీర్ణత. ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 35 పదాల వేగాన్ని కలిగి ఉండాలి.
-పే స్కేల్: రూ. 5200-20,200+ గ్రేడ్ పే రూ. 1900/-
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-స్టాఫ్ కారు డ్రైవర్-1
-అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణత. వినియోగంలోని డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. రెండేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 5200-20,200+ గ్రేడ్ పే రూ. 1900/-
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 14


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎఫ్‌సీఐలో వాచ్‌మెన్లు.
కేరళ రీజియన్ పరిధిలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నది.
Food-Corporation
వివరాలు:

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలో ఎఫ్‌సీఐ పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ: 127 (జనరల్-79, ఓబీసీ-34, ఎస్సీ-13, ఎస్టీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 8100-18070/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 250/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: జూలై15

0 comments:

Post a Comment