Monday, 31 July 2017

షిప్పింగ్ కార్పొరేషన్ జీఎంఈ కోర్సు, ఎన్‌ఐబీలో సైంటిస్టులు Shipping Corporation GME course,Scientists Jobs IN NIB

షిప్పింగ్ కార్పొరేషన్ జీఎంఈ కోర్సు,

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీర్స్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
షిప్పింగ్ కార్పొరేషన్ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఈ కంపెనీ జాతీయ, అంతర్జాతీయ షిప్పింగ్ వ్యాపారం చేస్తుంది.
కోర్సు: జీఎంఈ (గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీర్స్). ఈ కోర్సును ముంబై, పొవైలోని మారిటైం ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహిస్తారు.
ఈ కోర్సుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అనుమతి పొందినది. జీఎంఈ 8 నెలలు ప్రీ సీ ట్రెయినింగ్ కోర్సు, తర్వాత 10 నెలల స్ట్రక్చర్డ్ షిప్‌బోర్డు ట్రెయినింగ్‌ను ఎస్‌సీఐలో కోర్సును నిర్వహిస్తారు.
అర్హతలు: బీఈ/బీటెక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఇంజినీరింగ్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
అదేవిధంగా పదోతరగతి, ఇంటర్ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
వయస్సు: 2017, అక్టోబర్ 1 నాటికి 28 ఏండ్లు మించరాదు. మహిళా అభ్యర్థులకు వయోపరిమితిలో రెండేండ్లు సడలింపు ఇస్తారు.
మొత్తం సీట్ల సంఖ్య - 40 (జనరల్ - 20, ఓబీసీ - 11, ఎస్సీ - 6, ఎస్టీ - 3)
కోర్సు ఫీజు: రూ. 4,50,000/-
స్టయిఫండ్: నెలకు రూ. 15,000/- ఇస్తారు. షోర్ బేస్డ్ ట్రెయినింగ్ సమయంలో స్టయిఫండ్ ఇవ్వరు.
ఎంపిక: దేశవ్యాప్తంగా నిర్వహించే ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
పరీక్ష విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌ను 2 గంటల కాలవ్యవధిలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఇంగ్లిష్, రీజనింగ్ ఎబిలిటీ టెస్ట్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ నిర్వహిస్తారు.
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 9
పరీక్ష కేంద్రాలు: ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, చెన్నై
అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- (ఎస్సీ, ఎస్టీలకు రూ. 500/-)
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఆగస్టు 23
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్న కాపీ ప్రింట్‌ను పంపడానికి చివరితేదీ: ఆగస్టు 25
వెబ్‌సైట్: HTTP://SCIGME.EADMISSIONS.NET

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐబీలో సైంటిస్టులు



నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ ఆర్ అండ్ డీ విభాగంలో ఖాళీగా ఉన్న రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి(తాత్కాలిక ప్రాతిపదికన) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్
ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య:12
-ప్రిన్సిపాల్ రిసెర్చ్ సైంటిస్ట్-6
-సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్-3
-రిసెర్చ్ సైంటిస్ట్-3
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ. సంబంధిత విభాగంలో ఏడాదిపాటు అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఈ-మొయిల్ (INFO.BEDI@GMAIL.COM) ద్వారా పంపాలి.
-దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 21
-వెబ్‌సైట్: HTTP://NIB.GOV.IN

0 comments:

Post a Comment