Sunday, 2 July 2017

NALCO Recruitment 330 trade apprentices,JRF jobs in HCU,Research Scientists Jobs In NRSC,Scientists Posts In CMMB. నాల్కోలో 330 ట్రేడ్ అప్రెంటిస్‌లు, హెచ్‌సీయూలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, ఎన్‌ఆర్‌ఎస్‌సీలో రిసెర్చ్ సైంటిస్ట్‌లు, సీసీఎంబీలో సైంటిస్ట్‌లు.

నాల్కోలో 330 ట్రేడ్ అప్రెంటిస్‌లు,

భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో)లో వివిధ ట్రేడ్ విభాగాల్లో అప్రెంటిస్‌గా చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
నాల్కో గనుల మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. దీన్ని 1981, జనవరి 7న భవనేశ్వర్‌లో
ఏర్పాటు చేశారు.
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
మొత్తం ఖాళీల సంఖ్య: 330
విభాగాలు: ఫిట్టర్, టర్నర్, వెల్డర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్ (ఎంఎంవీ), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, పాసా/కోపా
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 2014 కంటే ముందు ఐటీఐ ఉత్తీర్ణులైనవారు అనర్హులు.
ఎంపిక: అకడమిక్ మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా..
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో నిర్ణీత నమూనా ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
చివరి తేదీ: జూలై 1
వెబ్‌సైట్:www.nalcoindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



హెచ్‌సీయూలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,
యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని పోస్టు గ్రాడ్యుయేట్‌లోని టీచింగ్ అండ్ రిసెర్చ్ రంగంలో మెలకువలను అందించడానికి ప్రాథమిక విద్యాసంస్థగా 1974 అక్టోబర్ 2న ఏర్పాటు చేశారు.
పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ, ఆర్గానిక్/ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ)లో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు నెట్, డీఎస్టీ ఇన్‌స్పైర్‌లో అర్హత సాధించాలి. 
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్. నిర్ణీత నమూనాతో కూడిన దరఖాస్తులను పూర్తి చేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి. 
ఇంటర్వ్యూ తేదీ: జూలై 14

వెబ్‌పైట్ : www.uohyd.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



ఎన్‌ఆర్‌ఎస్‌సీలో రిసెర్చ్ సైంటిస్ట్‌లు,

హైదరాబాద్ (బాలానగర్)లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) ఖాళీగా ఉన్న రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఎన్‌ఆర్‌ఎస్‌సీ అనేది ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
పోస్టు పేరు: రిసెర్చ్ సైంటిస్ట్
మొత్తం ఖాళీల సంఖ్య- 16
అర్హత: రిసెర్చ్ సైంటిస్ట్ (గ్రేడ్ 1) పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఈ/ఎంటెక్ (వాటర్ రిసోర్సెస్, హైడ్రాలజీ, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్/హైడ్రాలిక్స్, ఇరిగేషన్, ఎన్విరాన్‌మెంటల్), రిసెర్చ్ సైంటిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుకు ఎమ్మెస్సీ (జియో ఇన్ఫర్మాటిక్స్, జియోమాటిక్స్, రిమోట్ సెన్సింగ్), రిసెర్చ్ సైంటిస్ట్ (గ్రేడ్ 3) పోస్టుకు ఎంఈ/ఎంటెక్(కంప్యూటర్ సైన్స్, ఐటీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 జూలై 1 నాటికి 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లవరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ.15,600-39,100+ గ్రేడ్ పే రూ. 5,400/-అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ
తదితర అలవెన్స్‌లుంటాయి.
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరితేదీ: జూలై 1
వెబ్‌సైట్: www.nrsc.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



సీసీఎంబీలో సైంటిస్ట్‌లు.


హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
సీసీఎంబీ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న అనుబంధ సంస్థ.
మొత్తం పోస్టుల సంఖ్య: 9
పోస్టు పేరు: సైంటిస్ట్- 4 పోస్టులు
సీనియర్ సైంటిస్ట్- 5 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్‌లో పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 
వయస్సు: 32 ఏండ్లకు మించరాదు. కొన్ని పోస్టులకు 37 ఏండ్లకు మించరాదు.
అప్లికేషన్ ఫీజు: రూ. 100/- 
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నింపేటప్పుడు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: CSIR-Centre for Cellular and Molecular Biology, Hyderabad-500007
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 24
ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: ఆగస్టు 9
వెబ్‌సైట్ : www.ccmb.res.in


0 comments:

Post a Comment