Wednesday, 5 July 2017

Jobs in NTS,Catholic Syrian Bank Jobs,Mulna Azad National Urdu University Distance Cources,Aayush PG Entrance Test. ఎన్‌టీఎస్‌లో ఉద్యోగాలు, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో డిస్టెన్స్ కోర్సులు, ఆయుష్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్.

ఎన్‌టీఎస్‌లో ఉద్యోగాలు,

మైసూర్‌లోని నేషనల్ టెస్టింగ్ సర్వీస్ - ఇండియాలో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ntsi 
వివరాలు:

కేంద్ర మానవ వనరులశాఖ పరిధిలో ఎన్‌టీఎస్ పనిచేస్తుంది. దీని కార్యాలయం సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో ఉంది. ప్రస్తుత పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
-రిసోర్స్ పర్సన్ - 2 ఖాళీలు
-జీతం: రూ. 41, 200/-
-జూనియర్ రిసోర్స్ పర్సన్ అకడమిక్ - 5 (హిందీ - 2, ఉర్దూ -1, తమిళ్ - 2)
-జూనియర్ రిసోర్స్ పర్సన్ టెక్నికల్ - 3 ఖాళీలు
-పై రెండు పోస్టులకు జీతం: రూ. 34, 710/-
-ఆఫీసర్ అకౌంటెంట్స్ - 1
-జీతం: రూ. 29, 693/-
-దరఖాస్తు: వెబ్‌సైట్
-చివరితేదీ, అర్హతలు, వయస్సు తదితరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.

-వెబ్‌సైట్: www.ciil-miles.net


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
క్యాథలిక్ సిరియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు,

క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ (స్పెషలిస్ట్) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
catholic 

వివరాలు:


క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ 1920లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ బ్యాంక్ దేశవ్యాప్తంగా 400 బ్రాంచీలను కలిగి ఉంది.
-మొత్తం ఖాళీల సంఖ్య: 9 పోస్టులు 
-పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్లు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ, ఈఈఈ, ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్)లో 60 శాతం మర్కులతో ఉత్తీర్ణత లేదా పీజీ లేదా ఎంసీఏ, ఎమ్మెస్సీ (ఐటీ), ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్)లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో రెండేండ్లపాటు అనుభవం ఉండాలి.
-వయస్సు: 2016 డిసెంబర్ 31 నాటికి 32 ఏండ్లకు మించరాదు. 
-ఎంపిక విధానం: టెక్నికల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 12 
-వెబ్‌సైట్: http://www.csb.co.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో డిస్టెన్స్ కోర్సులు,

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) 2017-18అకడమిక్ ఇయర్‌కు దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న వివిధ పీజీ, డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్ పొందడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
manuu
వివరాలు:

మనూ యూనివర్సిటీని 1998లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేశారు.
-రెండేండ్ల పీజీ కోర్సులు: ఎంఏ (ఉర్దూ, ఇంగ్లిష్, హిస్టరీ)
-మూడేండ్ల డిగ్రీ కోర్సులు: బీఏ, బీఎస్సీ బీజెడ్‌సీ (లైఫ్ సైన్సెస్), బీఎస్సీ ఎంపీసీ (ఫిజికల్ సైన్స్)
-ఏడాది డిప్లొమా కోర్సులు: జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, డిప్లొమా ఇన్ టీచ్ ఇంగ్లిష్
-ఆరునెలల సర్టిఫికెట్ కోర్సులు: ప్రొఫిషియన్సీ ఇన్ ఉర్దూ, ఫంక్షనల్ ఇంగ్లిష్
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, సంబంధిత కాపీలను జతపరిచి పర్సనల్ అధికారికి పంపాలి. వర్సిటీ ప్రాంతీయ కేంద్రాలు, అధ్యయన కేంద్రాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.
-దరఖాస్తులకు చివరితేదీ:అక్టోబర్ 3
-ఆలస్య రుసుంతో చివరితేదీ: అక్టోబర్ 17
-వెబ్‌సైట్: www.manuu.ac.in.




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆయుష్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్.


న్యూఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) 2017 -18 అకడమిక్ ఇయర్‌కు ఆయుష్‌లో ఎండీ/ఎంఎస్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఆలిండియా పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఏ-పీజీఈటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Ministry
వివరాలు:

ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఆయుర్వేద, యునానీ, సిద్ద అండ్ హోమియోపతి కళాశాలల్లో ఎండీ/ ఎంఎస్ ప్రవేశం కల్పిస్తారు.
-కోర్సు పేరు: ఆయుష్ (ఎండీ/ఎంఎస్)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ(బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీస్‌ఎంఎస్, బీహెచ్‌ఎంఎస్)లో ఉత్తీర్ణత.
-దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 1750/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 1250/-
-ఎంపిక: ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఏ-పీజీఈటీ)
-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి గంటన్నర. మొత్తం 100 ప్రశ్నలను ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
-దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 కేంద్రాల్లో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.
-తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు హైదరాబాద్ పరీక్ష కేంద్రం.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 15
-ఎంట్రెన్స్ టెస్ట్ : ఆగస్టు 6
-పరీక్ష ఫలితాలు విడుదల: ఆగస్టు 23 నుంచి 26 మధ్య ప్రకటిస్తారు.
-వెబ్‌సైట్: www.aiapget.com లేదా www.ayush.gov.in


0 comments:

Post a Comment