Wednesday, 26 July 2017

రక్షణశాఖలో ఉద్యోగాలు, ఎస్‌పీఎంసీఐఎల్‌లో ఆఫీసర్లు, ఐఐఆర్‌ఆర్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్ ఉద్యోగాలు. Jobs in the India defense department,Officers Jobs in SPMCIL,SRF jobs in IIRR

రక్షణశాఖలో ఉద్యోగాలు,

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో పనిచేస్తున్న 39 అమ్యునిషన్ డిపోలో ఖాళీగా ఉన్న ఫైర్‌మెన్, ట్రేడ్స్‌మెన్ మేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది .

వివరాలు: 
భరత్‌పూర్‌లోని 39 అమ్యునిషన్ డిపోలో ఈ ఖాళీలు ఉన్నాయి.
-మొత్తం పోస్టుల సంఖ్య: 320
-ట్రేడ్స్‌మెన్ మేట్-316 పోస్టులు (జనరల్-158, ఓబీసీ-63, ఎస్సీ-54, ఎస్టీ-41)
-ఫైర్‌మెన్-4 పోస్టులు (జనరల్-2, ఎస్టీ-2)
-అర్హత: పదోతరగతి/మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత. ఫిజికల్ టెస్ట్/ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో భాగంగా 6 నిమిషాల్లో 1.5 కి.మీ పరుగెత్తాలి. ఫైర్‌మెన్‌కు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతోపాటు కనీసం 165 సెం.మీ. ఎత్తు, ఛాతీ - 81.5 సెం.మీ. -85 సెం.మీ., బరువు కనీసం 50 కేజీలు ఉండాలి.
-వయస్సు: 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీలకు 30 ఏండ్ల వరకు, ఓబీసీలకు 28 ఏండ్ల వరకు, పీహెచ్‌సీలకు 35 ఏండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 18000-56900/- (ఫైర్‌మెన్‌కు పే రూ.19900-63200/-)
-ఎంపిక: ఫిజికల్ టెస్ట్, ఆబ్జెక్టివ్ రాత పరీక్ష ద్వారా.
-ఈ పోస్టులను ఫిజికల్ టెస్ట్/ఎండ్యూరెన్స్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఎంపిక చేస్తారు.
-రాత పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. దీనికి కేటాయించిన సమయం రెండు గంటలు.
-ఆబ్జెక్టివ్ రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-25, న్యూమరికల్ ఆప్టిట్యూడ్-25, జనరల్ ఇంగ్లిష్-50, జనరల్ అవేర్‌నెస్-50 మార్కులు వస్తాయి.
-రాత పరీక్ష అనేది కేవలం ఇంగ్లిష్/హిందీ భాషలో ఉంటుంది. 
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత పర్సనల్ అధికారికి పంపించాలి.
చిరునామా: Recruitment Cell, 39 FIELD AMMUNITION DEPOT 
PIN-900309 C/O 56 APO, BHARATPUR
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన తేదీ నుంచి 21 రోజుల్లోగా పంపాలి. పూర్తి వివరాల కోసం ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడవచ్చు.

-వెబ్‌సైట్: www.indianarmy.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌పీఎంసీఐఎల్‌లో ఆఫీసర్లు,

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌పీఎంసీఐఎల్) రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఇది మినీ రత్న కంపెనీ. ఇది డిజైనింగ్, తయారీ భద్రతా పత్రాలు, ప్రింటింగ్ కరెన్సీ అండ్ బ్యాంక్ నోట్స్, పాస్‌పోర్ట్స్, నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్స్, నాణేల ముద్రణ, తపాలా స్టాంప్‌లను తయారుచేస్తుంది.
-మొత్తం పోస్టులు:12
-పోస్టు పేరు: ఆఫీసర్
-ఫైనాన్స్ విభాగంలో 9 పోస్టులు (జనరల్-3, ఓబీసీ-3, ఎస్సీ-4, హెచ్‌ఆర్ విభాగంలో 3 పోస్టులు (జనరల్-2, ఎస్సీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఫైనాన్స్ విభాగానికి సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ(ఫైనాన్స్)లో ప్రథమశ్రేణి, మేనేజ్‌మెంట్‌లో పీజీడిప్లొమా లేదా ఎంబీఏ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. హెచ్‌ఆర్ విభాగానికి మాస్టర్ డిగ్రీ (పీఎం అండ్ ఐఆర్), ఎంఎస్‌డబ్ల్యూ, ఎంబీఏ (హెచ్‌ఆర్)లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత లేదా మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. ఎల్‌ఎల్‌బీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-వయస్సు: 2017 ఆగస్టు 28 నాటికి గరిష్టంగా 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్ :రూ.16,400-40,500/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 400/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 100/-)
-ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ
-రాతపరీక్ష 150 మార్కులకు ఉంటుంది. దీనిలో ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆఫ్టిట్యూడ్ అంశాల నుంచి ప్రశ్నలను ఇస్తారు.
-మొత్తం 120 ప్రశ్నలను 120 నిమిషాల్లో పూర్తిచేయాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 28
-ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ రాత పరీక్ష: అక్టోబర్‌లో
-వెబ్‌సైట్: www.spmcil.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఆర్‌ఆర్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్ ఉద్యోగాలు.హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసెర్చ్ (ఐఐఆర్‌ఆర్) ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్,యంగ్ ప్రొఫెషనల్, సీనియర్ రిసెర్చ్ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: 
ఐఐఆర్‌ఆర్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్(ఐసీఏఆర్) పరిధిలో పనిచేస్తుంది. 
-సీనియర్ రిసెర్చ్ ఫెలో-5 పోస్టులు
-టెక్నికల్ అసిస్టెంట్-1, రిసెర్చ్ అసోసియేట్-1, 
-జూనియర్ రిసెర్చ్ ఫెలో-1, ఆర్‌ఏ-1, యంగ్ ప్రొఫెషనల్-1
-అర్హత: ప్లాంట్ బ్రీడింగ్, బయోటెక్నాలజీ, జెనిటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, అగ్రికల్చర్ బయోటెక్నాలజీలో పోస్టు గ్రాడ్యుయేట్‌తోపాటు పీహెచ్‌డీ, మాస్టర్ డిగ్రీ (ప్లాంట్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, బాటనీ)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను నింపి, అవసరమైన ఒరిజనల్ సర్టిఫికెట్లతో రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారివద్ద హాజరుకావాలి.
చిరునామా: ICAR-Indian Institute of Rice Research (IIRR), Rajendranagar, Hyderabad.
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 2, 3, 4
-వెబ్‌సైట్: www.drricar.org

0 comments:

Post a Comment