Sunday, 2 July 2017

Indian Air Force Recruitment Airmen Posts,257 staff nurses Jobs in AIIMS,Short Service Commission Officers in MNS,JRF jobs in ISRO-NRSC,Jobs in CWG ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్లు, ఎయిమ్స్‌లో 257 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, ఎంఎన్‌ఎస్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు, ఇస్రో-ఎన్‌ఆర్‌ఎస్‌సీలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, సీజీడబ్ల్యూబీలో ఉద్యోగాలు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్లు,

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఎఎఫ్)లోని గ్రూప్ వై ట్రేడ్‌లో ఖాళీగా ఉన్న ఎయిర్‌మెన్ (స్పోర్ట్స్ కోటా) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అనేది భారత్‌కు చెందిన త్రివిధ దళాల్లో అత్యంత ముఖ్యమైన సేనా విభాగం.

పోస్టు పేరు: ఎయిర్‌మెన్ (గ్రూప్ వై)
క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్రాస్ కంట్రీ, క్రికెట్, సైక్లింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, హ్యాండ్‌బాల్, కబడ్డీ, లాన్ టెన్నిస్, షూటింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, వాటర్‌పోలో, రెజ్లింగ్, వెయిట్ లిప్టింగ్, గోల్ఫ్
వయస్సు: దరఖాస్తు చివరి తేదీ నాటికి 16 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. 1996 డిసెంబర్ 28 - 2000 డిసెంబర్ 27 మధ్య జన్మించి ఉండాలి.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. జూనియర్ ఇంటర్నేషనల్ స్థాయి/జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్/ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొని ఉండాలి.
శారీరక ప్రమాణాలు:
ఎత్తు - 152.5 సెం.మీ.
ఛాతీ - శరీరానికి తగ్గ అనుపాతంలో ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం తప్పనిసరి.
బరువు: ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
కంటిచూపు: 6/36, 6/9 ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్స్, ఇంటర్వ్యూ ద్వారా..
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్: 7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరాన్ని పరుగెత్తాలి.
6 నిమిషాల 30 సెకండ్లలోపు పూర్తిచేసిన వారికి అదనపు మార్కులను కేటాయిస్తారు.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులను మాత్రమే స్పోర్ట్స్ ట్రయల్స్‌కు అనుమతి ఇస్తారు.
పే స్కేల్: శిక్షణ కాలంలో నెలకు రూ. 11,400, శిక్షణ పూర్తయిన తర్వాత నెలకు రూ. 20,500/- అదనంగా ఉచిత వైద్యసౌకర్యం, రేషన్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లు తదితర వసతులుంటాయి.
పదోన్నతులు: ఎయిర్‌మెన్ అధికారి నుంచి మాస్టర్ వారెంట్ ఆఫీసర్ హోదా వరకు వెళ్లవచ్చు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చిరునామా: The Secretary, Air Force Sports Control Board, Air Force Station New Delhi, Race Course, New Delhi- 110 003
చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. పూర్తి వివరాలకు జూన్ 24-30 ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడగలరు.
వెబ్‌సైట్: http://indianairforce.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ఎయిమ్స్‌లో 257 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు,

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఢిల్లీ) అనుబంధ హాస్పిటల్ సర్వీసెస్‌లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తున్నది.

వివరాలు:
ఎయిమ్స్ ఢిల్లీ అత్యున్నత ఆరోగ్య ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకటి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో వైద్య కళాశాల, వైద్య పరిశోధన చేయడానికి 1956లో స్థాపించారు. మొదటి ఎయిమ్స్‌ను ఢిల్లీలో, మిగతావి 2012లో ఏర్పాటు చేశారు
పోస్టు పేరు: నర్సింగ్ ఆఫీసర్
-మొత్తం పోస్టులు: 257 పోస్టులు (జనరల్-174, ఓబీసీ- 47, ఎస్సీ- 26, ఎస్టీ- 10)
-అర్హత: ఏదైన గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి నర్సింగ్‌లో బీఎస్సీ (ఆనర్స్), బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీలో డిగ్రీ/డిప్లొమాలో ఉత్తీర్ణత. సెంట్రల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి.
-వయస్సు: 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 9,300-34,800 + గ్రేడ్ పే రూ. 4,600/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 100/-, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష ద్వారా
-ఆన్‌లైన్ పరీక్షలో 200 ప్రశ్నలు, 200 మార్కులు, 180 నిమిషాల్లో పూర్తిచేయాలి.
-అభ్యర్థులు రాత పరీక్షలో సంస్థ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి.
-ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులను కోత విధిస్తారు.
-రాత పరీక్షను 2017 సెప్టెంబర్ 11న నిర్వహిస్తారు.
-అర్హతగల అభ్యర్థులకు రాత పరీక్ష తేదీ, పరీక్ష కేంద్రం, సమయానికి సంబంధించిన వివరాలను ఈ-మెయిల్ ద్వారా తెలుపుతారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 14 (సాయంత్రం 5 గంటలవరకు)
వెబ్‌సైట్: www.aiimsexam.org
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


ఎంఎన్‌ఎస్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు,

బీఎస్సీ/ఎమ్మెస్సీ (నర్సింగ్)లో ఉత్తీర్ణత
-లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం
-మంచి జీతాలు, చాలెంజింగ్ కెరీర్,ఉద్యోగ భద్రత
-రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 11

ఇండియన్ మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ (ఎంఎన్‌ఎస్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ (నర్సింగ్ విభాగం) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
indian-miliotary-services

వివరాలు:
ఇండియన్ మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ అనేది దేశంలోని అతిపెద్ద వ్యవస్థీకృత వైద్య సేవల్లో ఒకటైన ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ. ఇది త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్)కు వైద్యరంగంలో సహాయ సహకారాలను అందిస్తుంది. ఈ పోస్టుకు ఎంపికైనవారు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో పని చేయాల్సి ఉంటుంది.
పోస్టు పేరు: షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ (నర్సింగ్)/పీబీబీఎస్సీ (నర్సింగ్) లేదా బీఎస్సీ (నర్సింగ్) లేదా తత్సమాన పరీక్షలోఉత్తీర్ణత. సెంట్రల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి. మిలిటరీ నిబంధనల ప్రకారం ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి.
వివాహిత, అవివాహిత, వితంతువులు, ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 1982 జూలై 10 నుంచి 1996 జూలై 11 మధ్య జన్మించి ఉండాలి.
పే స్కేల్: రూ. 15,600+గ్రేడ్ పే రూ. 5,400. మిలిటరీ సర్వీస్ పే రూ. 4,200+డీఏ, గ్రేడ్ పే, మెడికల్ సర్వీస్ పే, హౌస్ రెంటల్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, రేషన్ అలవెన్స్, కిట్ మెయింటెన్స్ అలవెన్స్‌లు కలిపి ఉంటాయి.
పదోన్నతి: ప్రారంభంలో లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగంలోచేరి ఆ తర్వాత కెప్టెన్, చివరిగామేజర్ వరకు పదోన్నతి పొందవచ్చు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా..
ఎంపికైన అభ్యర్థులకు 2017 ఆగస్టు మొదటి/రెండోవారంలో రాతపరీక్ష ఉంటుంది.
మొత్తం 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. దీనిలో నర్సింగ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఇంటెలిజెన్స్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
ఇంటర్వ్యూ ఆగస్టు/సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. ఈ-అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: Integrated Headquarters of MoD(Army) AGs Branch Dte Gen of Medical Services (Army) /DGMS-4BRoom No. 45, L Block, New Delhi-01
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: జూలై 11
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇస్రో-ఎన్‌ఆర్‌ఎస్‌సీలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: 
ఎన్‌ఆర్‌ఎస్‌సీ అనేది ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్
మొత్తం ఖాళీల సంఖ్య- 26
కాలపరిమితి: రెండేండ్లు, ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి మరో మూడేండ్ల వరకు పొడిగించవచ్చు.
విభాగాలు: జియో ఫిజిక్స్, ఓషనోగ్రఫీ అండ్ మెటలర్జీ, ఎర్త్ ఓషన్ అండ్ ైక్లెమేట్ సైన్స్, అట్మాస్పియరిక్ సైన్స్, మెటలర్జీ, ైక్లెమెటాలజీ, మెరైన్ సైన్సెస్, ఫిజిక్స్, జియోఫిజిక్స్, ఓషనోగ్రఫీ, జియాలజీ, అప్లయిడ్ జియాలజీ, ఎర్త్ సైన్సెస్, రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్, జియో ఇన్ఫర్మాటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్, జియో ఇన్ఫర్మాటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ జియో ఇన్ఫర్మాటిక్స్, వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్, జియోమాటిక్స్, సివిల్, అగ్రికల్చర్, హైడ్రాలిక్స్ ఇంజినీరింగ్, హైడ్రాలజీ, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత బ్రాంచీల్లో ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్‌లో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత. నెట్, జామ్, జీప్యాట్, బీఈటీ, జెస్ట్ లేదా తత్సమాన అర్హత పరీక్షలో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 జూలై 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లవరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ. 25000/-.
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్‌లైన్. చివరితేదీ: జూలై 1

వెబ్‌సైట్: www.nrsc.gov.in 

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీజీడబ్ల్యూబీలో ఉద్యోగాలు.


అహ్మదాబాద్‌లోని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (సీజీడబ్ల్యూబీ)లో ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టుల (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఇది నీటి వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 31 (జనరల్-17, ఓబీసీ-10, ఎస్సీ-4)
-పనిచేసే ప్రదేశం: దేశంలో ఎక్కడైనా
-పోస్టు పేరు: స్టాఫ్ కారు డ్రైవర్
-అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు అనుభవం ఉండాలి.
-వయస్సు : 27 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక : ట్రేడ్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్
-దరఖాస్తు : ఆఫ్‌లైన్. నిర్ణీత నమూనాలో దరఖాస్తును నింపి సంబంధిత అధికారికి పంపాలి.
-చివరితేదీ : ఆగస్టు 23

-వెబ్‌సైట్: www.cgwb.gov.in


0 comments:

Post a Comment