Wednesday, 26 July 2017

ఏఐఈఎస్‌ఎల్‌లో ఇంజినీర్‌ ఉద్యోగాలు, బీఎంఆర్‌సీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌లు, ఐఐవోఆర్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్ ఉద్యోగాలు. Engineering jobs at AIESL,The executives Jobs at BMRCL,SRF jobs in IIVR

ఏఐఈఎస్‌ఎల్‌లో ఇంజినీర్‌ ఉద్యోగాలు,

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్) ఖాళీగా ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ (ఏఎంఈ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

వివరాలు:
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా లిమిటెడ్‌కు ఏఐఈఎస్‌ఎల్ అనుబంధంగా పనిచేస్తున్నది. ఈ పోస్టులను ఐదేండ్ల కాలపరిమితికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. 
-ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్
-మొత్తం ఖాళీలు -26 
-అర్హతలు: డీజీసీఏ గుర్తింపుపొందిన లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. లీప్ ఇంజిన్ కలిగిన ఏ320 ఎన్‌ఈఓ ఎయిర్‌క్రాఫ్ట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 
-వయస్సు: 2017, జూలై 1 నాటికి 45 ఏండ్లు మించనివారై ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు వయోపరిమితిలోసడలింపు ఉంటుంది. 
-పే స్కేల్: రూ. 95,000
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 10
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. వెబ్‌సైట్‌లో నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిగా నింపి, పాస్‌పోర్ట్ ఫొటో, సంబంధిత సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాలి. 
-అప్లికేషన్ ఫీజు : రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఎలాంటి ఫీజు లేదు. 
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 18

-వెబ్‌సైట్: www.airindia.com



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఎంఆర్‌సీఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌లు,

బెంగళూరు మెట్రోరైల్ కార్పొరేషన్ (బీఎంఆర్‌సీఎల్) ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
బీఎంఆర్‌సీఎల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్టు. ఈ పోస్టులను మూడేండ్ల కాలపరిమితికి కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు- 20 డిప్యూటీ చీఫ్ ఇంజినీర్
-పోస్టుల సంఖ్య- 10
-అర్మతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో 15 ఏండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 55 ఏండ్ల లోపువారై ఉండాలి.
-పే స్కేల్: రూ. 1,22,630 (కన్సాలిడేటెడ్ పే)
BANGALORE-METRO

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
-పోస్టుల సంఖ్య - 10
-అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో 12 ఏండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 50 ఏండ్ల లోపువారై ఉండాలి.
-పే స్కేల్: రూ. 67,430 (కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్‌లో నింపిన దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి కింది అడ్రస్‌కు పంపాలి.
అడ్రస్: General Manager (HR),
Bangalore Metro Rail Corporation Limited, III Floor, BMTC Complex, K.H.Road, Shanthinagar, Bangalore 560027
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31
-వెబ్‌సైట్: www.bmrc.co.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐవోఆర్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్ ఉద్యోగాలు.



హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రిసెర్చ్ (ఐఐవోఆర్)ఖాళీగా ఉన్న ఎస్‌ఆర్‌ఎఫ్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులను వాక్ ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఈ సంస్థ ఐఎస్‌వో 9001- 2008 సర్టిఫైడ్ ఇన్‌స్టిట్యూట్. ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఏఆర్) అనుబంధ సంస్థ
-సీనియర్ రిసెర్చ్ ఫెలో
-అర్హతలు: అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్, అగ్రి ఎకనామిక్స్, అగ్రికల్చరల్ రూరల్ మేనేజ్‌మెంట్, ఫుడ్ బిజినెస్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కో ఆపరేటివ్‌లలో మాస్టర్ డిగ్రీ, పీజీ (సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్)తోపాటు నెట్‌లో అర్హతను సాధించాలి.
-పే స్కేల్: నెలకు రూ. 25,000 + హెచ్‌ఆర్‌ఏ
-ఫీల్డ్ అసిస్టెంట్స్
-అర్హతలు: అగ్రికల్చర్‌లో రెండేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-పే స్కేల్: నెలకు రూ. 15,000/- (కన్సాలిడేటెడ్)
-టెక్నికల్ అసిస్టెంట్
-అర్హతలు: కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: నెలకు రూ. 15,000/- (కన్సాలిడేటెడ్)
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 5 (11 గంటలకు)
స్థలం: ఐసీఏఆర్ - ఐఐవోఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్.
-వెబ్‌సైట్: www.icar-iior.org.in

0 comments:

Post a Comment