Thursday, 13 July 2017

Apprentices posts in CECRI,UPSC-Grade 3 posts,ISRO Recruitment typists Posts. సీఈసీఆర్‌ఐలో అప్రెంటిస్ పోస్టులు, యూపీఎస్సీ- గ్రేడ్3 పోస్టులు, ఇస్రోలో టైపిస్టులు.

సీఈసీఆర్‌ఐలో అప్రెంటిస్ పోస్టులు,

సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
(సీఈసీఆర్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CECRI

వివరాలు:

సీఈసీఆర్‌ఐ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
-పోస్టు పేరు : అప్రెంటిస్ పోస్టులు
-ఫిట్టర్-4, టర్నర్-2, మెషినిస్ట్-2, ఎలక్ట్రీషియన్-6, వైర్‌మెన్-4, ఎలక్ట్రానిక్స్ మెకానిక్-2, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్-2, పాసా-5, కార్పెంటర్-1, హార్టికల్చర్ అసిస్టెంట్-2
-వయస్సు: కనీసం 14 ఏండ్లు నిండి ఉండాలి.
-స్టయిఫండ్: రూ. 7,574/- కొన్ని పోస్టులకు మొదటి ఏడాదికి రూ. 6732/-, రెండో ఏడాదికి రూ. 7,574/- స్టయిఫండ్ చెల్లిస్తారు.
- అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ
ఉత్తీర్ణత.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, దానికి సంబంధిత సర్టిఫికెట్లను జతపరిచి ఇంటర్వ్యూ రోజున పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
చిరునామా: Ce-tral Electrochemical Research I-stitute, Karaikudi
-ఇంటర్వ్యూ: 2017 జూలై 18
-వెబ్‌సైట్:www.cecri.res.i-


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ- గ్రేడ్3 పోస్టులు,
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ డైరెక్టర్, గ్రేడ్3 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
upsc
వివరాలు:

యూపీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 53
-జూనియర్ టెక్నికల్ ఆఫీసర్-1
-గ్రేడ్3 స్పెషలిస్ట్ (ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ)-14
-గ్రేడ్ 3 స్పెషలిస్ట్ (సర్జరీ)-10
-డిప్యూటీ డైరెక్టర్ (మెకానికల్)-20
-యూత్ ఆఫీసర్-8
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (సైన్స్/ఇంజినీరింగ్), పీజీ డిప్లొమాఇన్ షుగర్ టెక్నాలజీ, ఎంబీబీఎస్, మాస్టర్ ఆఫ్ సర్జరీ, మాస్టర్ డిగ్రీ (సూపర్ స్పెషాలిటీ), డిప్లొమా ఇన్ ఓ అండ్ జీ, పీజీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 25/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 27
-దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేదీ: జూలై 28



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇస్రోలో టైపిస్టులు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ఖాళీగా ఉన్న హిందీ టైపిస్ట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Indian-Space
వివరాలు:

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను విక్రమ్ సారాభాయ్ 1969 ఆగస్టు 15న స్థాపించారు. ఇది అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం
నెలకొల్పిన సంస్థ.
-హిందీ టైపిస్ట్-3 పోస్టులు (ఇస్రో హెడ్ క్వార్టర్)
-హిందీ టైపిస్ట్-1 పోస్టు (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్)
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఆర్ట్స్, సైన్స్, కామర్స్, మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్)లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. పదోతరగతి/డిగ్రీ స్థాయిలో హిందీ సబ్జెక్ట్‌ను చదివి ఉండాలి. హిందీ టైప్‌రైటింగ్‌లో నిమిషానికి 25 పదాలవేగాన్ని కలిగి ఉండాలి.
-టెక్నీషియన్-1 పోస్టు (ఇస్రో హెడ్ క్వార్టర్)
-అర్హత: పదోతరగతితోపాటు ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 26 ఏండ్లకు మించరాదు(టెక్నీషియన్ పోస్టుకు 35 ఏండ్లు)
-ఎంపిక విధానం:రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: జూలై 21
-వెబ్‌సైట్: www.isro.gov.i-


0 comments:

Post a Comment