Thursday, 13 July 2017

Apprentices in the naval base,Junior Assistants at NBE. నేవల్‌బేస్‌లో అప్రెంటిసెస్, ఎన్‌బీఈలో జూనియర్ అసిస్టెంట్లు.

నేవల్‌బేస్‌లో అప్రెంటిసెస్,
పదోతరగతి + ఐటీఐ అభ్యర్థులకు అవకాశం
-రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-రక్షణశాఖ పరిధిలో అప్రెంటిసెస్
కొచ్చిలోని నేవల్ బేస్‌లో అప్రెంటిసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Cochi-naval-base
వివరాలు:

కొచ్చిలోని నేవల్ షిప్ రిపేర్‌యార్డ్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ షిప్‌యార్డ్ రక్షణమంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. 1961, అప్రెంటిసెస్ యాక్టు ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
-ఏడాది అప్రెంటిసెస్ ట్రేడ్‌లు: ఫిట్టర్, మెకానిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్), మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ, పెయింటర్ (జనరల్), మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రోప్లేటర్, టర్నర్, కంప్యూటర్ ఆపరేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్.
-రెండేండ్ల అప్రెంటిస్ ట్రేడ్స్: షీట్ మెటల్ వర్కర్, డీజిల్ మెకానిక్, షిప్‌రైట్ (ఉడ్) లేదా కార్పెంటర్.
-అర్హతలు: సంబంధిత ట్రేడుల్లో ఏడాది/రెండేండ్ల ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఇప్పటికే ఏదైనా ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థల్లో అప్రెంటిసెస్ చేసిన వారు అర్హులుకారు. అదేవిధంగా పదోతరగతి/ తత్సమాన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఐటీఐలో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి.
-వయస్సు: అక్టోబర్ 2017 నాటికి 14 - 21 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-ఎంపిక విధానం: మొదట దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను పదోతరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
-షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
-బోర్డింగ్, లాడ్జింగ్: ఎంపికైన అభ్యర్థులకు ఎటువంటి వసతి, భోజన సౌకర్యాలు కల్పించరు.
-దరఖాస్తు: తెల్లపేపర్‌పై బయోడేటాను రాసి, సంబంధిత అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్స్ జిరాక్స్‌లను జతచేసి పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:అడ్మిరల్ సూపరింటెండెంట్, నేవల్ షిప్‌యార్డ్, నేవల్ బేస్, కొచ్చి - 682004
-చివరితేదీ: జూలై 31





----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌బీఈలో జూనియర్ అసిస్టెంట్లు.


నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ)లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:

ఎన్‌బీఈ ని జాతీయస్థాయిలో మోడరన్ మెడిసిన్ విభాగానికి సంబంధించిన పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షలు నిర్వహించడానికి
ఏర్పాటు చేశారు.
-పోస్టు: జూనియర్ అసిస్టెంట్
-ఖాళీలు: 9 (జనరల్-4, ఓబీసీ-3, ఎస్సీ-1, ఎస్టీ-1)
-వేతనం: రూ.5,200-20,200. గ్రేడ్ పే రూ.1,900/-
-వయస్సు: జూలై 21, 2017 నాటికి 27 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్‌లో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్ అంశాలకు సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 30 పదాలు టైప్‌చేసే సామర్థ్యం ఉండాలి.
-దరఖాస్తు ఫీజు: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100). న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌కు చెల్లుబాటు అయ్యే విధంగా ఏదైనా బ్యాంకు నుంచి డీడీ రూపంలో ఫీజు చెల్లించాలి.
-చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన తేదీ నుంచి 90 రోజులలోపు.


0 comments:

Post a Comment