Wednesday, 5 July 2017

Aims Recruitment 1154 Posts,Assistant professor jobs at Kamala Nehru College,Wildlife Project Fellow,Polytechnic admissions at Veterinary University,MPH admissions in KNR University ఎయిమ్స్‌లో 1154 ఉద్యోగాలు, కమలా నెహ్రూ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, వైల్డ్‌లైఫ్ ప్రాజెక్ట్ ఫెలో, వెటర్నరీ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ ప్రవేశాలు, కేఎన్‌ఆర్ యూనివర్సిటీలో ఎంపీహెచ్ ప్రవేశాలు.

ఎయిమ్స్‌లో 1154 ఉద్యోగాలు,
బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు అవకాశం
-ఉద్యోగ భద్రత, మంచి జీతభత్యాలు
-ఆన్‌లైన్ పరీక్ష + ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

STAFFNURSE
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రిషికేష్ నర్సింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్,స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఎయిమ్స్ రిషికేష్ అత్యున్నత ఆరోగ్య ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకటి. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు ఎయిమ్స్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. 2012 సెప్టెంబర్ 20న ఏర్పాటైన ఈ సంస్థ ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది.

-మొత్తం పోస్టుల సంఖ్య: 1158
-పోస్టు పేరు: అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ (గ్రేడ్ ఏ)- 28 పోస్టులు (జనరల్-15, ఓబీసీ-7, ఎస్సీ-4, ఎస్టీ-2)
-అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగేండ్ల బీఎస్సీ (నర్సింగ్) లేదా బీఎస్సీ (పోస్టు సర్టిఫికెట్), బీఎస్సీ నర్సింగ్ (పోస్టు బేసిక్-రెండేండ్ల కోర్సు) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సెంట్రల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం కలిగి ఉండాలి. 200 పడుకలు గల హాస్పిటల్‌లో ఆరేండ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. ఎమ్మెస్సీ (నర్సింగ్) ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

-వయస్సు: 21 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 15,600-39,100 + గ్రేడ్ పే రూ. 5,400/-
-పోస్టు పేరు: స్టాఫ్ నర్స్ (గ్రేడ్2)-1126 పోస్టులు (జనరల్-570, ఓబీసీ-304, ఎస్సీ-168,ఎస్టీ-84)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగేండ్ల బీఎస్సీ (నర్సింగ్) లేదా బీఎస్సీ (పోస్టు సర్టిఫికెట్), బీఎస్సీ నర్సింగ్ (పోస్టు బేసిక్-రెండేండ్ల కోర్సు) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సెంట్రల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం కలిగి ఉండాలి. కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్, స్ప్రెడ్ షీట్‌లో పరిజ్ఞానం ఉండాలి.

-వయస్సు: 21 - 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 9,300-34,800 + గ్రేడ్ పే రూ. 4,600/- అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి నర్సింగ్‌లో బీఎస్సీ (ఆనర్స్), బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీలో డిగ్రీ/ డిప్లొమాలో ఉత్తీర్ణత. సెంట్రల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం కలిగి ఉండాలి.

-వయస్సు: 18 ఏండ్ల నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 9,300-34,800+ గ్రేడ్ పే రూ. 4,600/-
-అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 3000/-,ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 1000/-
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
-ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ

-ఆన్‌లైన్ పరీక్ష 100 ప్రశ్నలు -100 మార్కులు. పరీక్షను 90 నిమిషాల్లో పూర్తిచేయాలి.
-అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ పరీక్షలో పార్ట్-ఏ (నర్సింగ్ సబ్జెక్ట్)-70 మార్కులు, పార్ట్-బీ (జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, నర్సింగ్ ఇన్ఫర్మాటిక్స్)-30 మార్కులు, పార్ట్-సీలో స్కిల్ టెస్ట్ ఉంటుంది.
-స్టాఫ్ నర్స్ పరీక్షలో పార్ట్-ఏ (నర్సింగ్ సబ్జెక్ట్)-80 మార్కులు.
-పార్ట్-బీ (జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, నర్సింగ్ ఇన్ఫర్మాటిక్స్)-20 మార్కులు.
-పార్ట్-సీలో స్కిల్ టెస్ట్ ఉంటుంది.

-అభ్యర్థులు రాతపరీక్షలో సంస్థ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. అర్హతగల అభ్యర్థులకు రాత పరీక్షతేదీ, పరీక్ష కేంద్రం, సంబంధించిన వివరాలను ఈ-మెయిల్ ద్వారా తెలుపుతారు లేదా రిషికేష్ ఎయిమ్స్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31
-వెబ్‌సైట్: www.aiimsrishikesh.edu.in




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కమలా నెహ్రూ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్  ఉద్యోగాలు,

కమలా నెహ్రూ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:

కమలా నెహ్రూ కాలేజీ ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోనిది. ఇది న్యూఢిల్లీలో ఉంది.
-పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్లు
-విభాగాలు: కామర్స్ - 6, ఎకనామిక్స్ - 6, ఇంగ్లిష్ - 5, జర్నలిజం - 1, మ్యాథమెటిక్స్ - 4, ఫిలాసఫీ - 1, పొలిటికల్ సైన్స్ - 5, సైకాలజీ - 2, సోషియాలజీ - 2, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ - 2 ఖాళీలు ఉన్నాయి.
-పేస్కేల్: రూ, 15, 600 - 39, 100 + గ్రేడ్ పే రూ. 6,000/-
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-అర్హతలు: వయస్సు తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-చివరితేదీ: జూలై 15

-వెబ్‌సైట్: www.knc.edu.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వైల్డ్‌లైఫ్ ప్రాజెక్ట్ ఫెలో,

డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల భర్తీకి (కాంట్రాక్ట్ పద్ధతి) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
wildlife
వివరాలు:

-మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ & ైక్లెమేట్ చేంజ్ పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 26
-విభాగాలవారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్-3, ప్రాజెక్ట్ వెటర్నేరియన్-2
-ప్రాజెక్ట్ అసోసియేట్-2, ప్రాజెక్ట్ ఫెలో-11
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ (గ్రేడ్2)-5,ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్-1
-అసిస్టెంట్ ఆఫీస్ మేనేజర్-1,అకౌంటెంట్-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, సంబంధిత సబెక్ట్‌లో పీహెచ్‌డీ ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్ చివరితేది: జూలై 20
-వెబ్‌సైట్: www.wii.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

వెటర్నరీ యూనివర్సిటీలో పాలిటెక్నిక్  ప్రవేశాలు,


హైదారాబాద్ (రాజేంద్రనగర్)లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ 2017-18 విద్యా సంవత్సరానికి రెండేండ్ల పాలిటెక్నిక్ (డిప్లొమా) కోర్సులలో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
veterinary
వివరాలు:

పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీలను ఇస్తుంది. గ్రామసీమలో నివసించే యువకులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో, వీరు కాలేజీలలో చేరి డిగ్రీలు చదువడం భారమనే ఉద్దేశంతో వారికి పశుపోషణ, మత్స్యపరిశ్రమలలో శిక్షణ ఇవ్వడానికి పాలిటెక్నిక్‌లను ఏర్పాటుచేశారు.
-కోర్సు పేరు: పాలిటెక్నిక్ (యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్)
-మొత్తం సీట్ల సంఖ్య:121
-మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్దిపేట పశుసంవర్ధక పాలిటెక్నిక్‌లలో 30 మంది చొప్పున మామనూర్ పశుసంవర్ధక పాలిటెక్నిక్‌లో 20 మంది, భావదేవరపల్లి మత్స్య పాలిటెక్నిక్‌లో 11 మందికి అడ్మిషన్ కల్పిస్తారు.
-కోర్సు వ్యవధి: రెండేండ్లు
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. ఇద్దరు కంటే ఎక్కువమందికి సమానమైన మార్కులు/గ్రేడ్‌లు వస్తే సైన్స్/మ్యాథమెటిక్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
-2017 లేదా అంతకుముందు పదోతరగతిలో పాసైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-కనీసం నాలుగు సంవత్సరాలపాటు గ్రామీణ ప్రాంతాల్లోని (నాన్ మున్సిపాల్ పరిధి) పాఠశాలలో చదివిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-వయస్సు: 2017 ఆగస్టు 31 నాటికి 15 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులు రూ. 550/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 275/-చెల్లించాలి.
-ఎంపిక: పదోతరగతిలో వచ్చిన మార్కులు/ గ్రేడ్‌లను ప్రామాణికంగా తీసుకొని మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
-పాలిటెక్నిక్ కోర్స్ ఎంపికలో రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఉంటాయి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి సంబంధిత అధికారికి పంపాలి.
చిరునామా: P.V. NARSIMHA RAO TELANGANA VETERINARY UNIVERSIT Administrative office Rajendranagar :Hyd 500 030
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 17
-వెబ్‌సైట్: http://tsvu.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కేఎన్‌ఆర్ యూనివర్సిటీలో ఎంపీహెచ్ ప్రవేశాలు.


వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2017-18 విద్యా సంవత్సరానికి ఎంపీహెచ్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Kaloji
వివరాలు:

ఈ యూనివర్సిటీని ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా పిలిచేవారు. రాష్ట్రం విభజనజరిగిన తర్వాత ప్రముఖ కవి, రాజకీయ కార్యకర్త కాళోజీ నారాయణ రావు పేరు మీద వరంగల్‌లో
ఏర్పాటుచేశారు.
-కోర్సు పేరు: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ( ఎంపీహెచ్ )
-మొత్తం సీట్ల సంఖ్య: 40
-కోర్సు వ్యవధి: రెండేండ్లు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో (10+2+3 విధానంలో)50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: గరిష్ట వయోపరిమితి లేదు.ఎవరైనా దరఖాస్తు చేసుకోచ్చు.
-ఎంపిక: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా.
-ఎంట్రెన్స్ పరీక్షలో కనీస అర్హత మార్కులు 40 శాతం (ఎస్సీ, ఎస్టీ 30 శాతం మార్కులు) సాధించాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రింట్ తీసి, కావల్సిన సర్టిఫికెట్‌లను జతచేసి సంబంధిత అధికారికి పంపాలి.

చిరునామా:

The Convener, Post Graduate Admissions Committee,Kalojji Narayana Rao University of Health Sciences, Warangal,Telangana-506007,
-దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 8(సాయంత్రం 5 గంటల వరకు)
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: జూలై 12
-హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్: జూలై 18 నుంచి 20
-ఎంట్రెన్స్ పరీక్ష: జూలై 23(2.30 PM-4.00 PM వరకు)
-ఫలితాలు విడుదల: జూలై 27
-క్లాసులు ప్రారంభం: ఆగస్టు 7
-వెబ్‌సైట్: www.knruhs.in



0 comments:

Post a Comment