Sunday, 2 July 2017

Agriculture University Btech Admissions Notification ,B.ED Admissions in Ambedkar Open University. అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీటెక్ ప్రవేశాలు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఈడీ ప్రవేశాలు.

అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీటెక్ ప్రవేశాలు,
హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎంపీసీ స్ట్రీమ్ కింద (రైతుల కోటా) 2017-18 విద్యా సంవత్సరానికి బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
pjtsau

వివరాలు:
ఈ యూనివర్సిటీ 2014లో ఏర్పాటైయింది.గతంలో ఆచార్య ఎన్ జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో భాగంగా ఉండేది.
కోర్సు పేరు: బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ)
మొత్తం సీట్ల సంఖ్య:41
(పీజేటీఎస్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్-22, ఫుడ్ టెక్నాలజీ-16)
ఎన్‌జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ (ఫుడ్ టెక్నాలజీ)-13)
పీజేటీఎస్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు: కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్, సంగారెడ్డి (కంది), కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిజామాబాద్ (రుద్రూర్)
ఎన్‌జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు: కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గుంటూరు (బాపట్ల), కడప(పులివెందుల)
అర్హత: ఇంటర్ (మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్)లో ఉత్తీర్ణత. నాన్ మున్సిపల్ ప్రాంతంలో 1 నుంచి ఇంటర్ వరకు కనీసం నాలుగేండ్లు చదవాలి. తప్పనిసరిగా తల్లిదండ్రుల పేరిట కనీసం మూడెకరాల భూమి ఉండాలి.
వయస్సు: డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు 27 ఏండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది .
అప్లికేషన్ ఫీజు: రూ. 1325/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ రూ. 725/-
ఎంపిక: ఎంసెట్ 2017లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 8
వెబ్‌సైట్: http://www.pjtsau.ac.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఈడీ ప్రవేశాలు.

హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2017-18 విద్యా సంవత్సరానికిగాను బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎంట్రన్స్ పరీక్ష ద్వారా
ఈ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.

వివరాలు
బీఈడీ: కాలపరిమితి 2 ఏండ్లు.
బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్): కాలపరిమితి 21/2 ఏండ్లు.
విద్యార్హతలు: ఈ కోర్సులలో చేరే అభ్యర్థి భారత పౌరుడై ఉండాలి. దరఖాస్తు చేసే నాటికి జనరల్ అభ్యర్థులు బీఏ/బీఎస్సీ/బీకాం/బీసీఏ/బీఎస్సీ (హోంసైన్స్)/బీబీఎం డిగ్రీ లేదా కామర్స్/సోషల్ సైన్సెస్/ హ్యూమనిటీస్/సైన్సెస్‌లో మాస్టర్ డిగ్రీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు (ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్ అభ్యర్థులు) 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. బీఈ, బీటెక్ కోర్సులలో జనరల్ అభ్యర్థులు 55 శాతం మార్కులతో, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత డిగ్రీలో (బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీలో) చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 01-07-2017 నాటికి 21 ఏండ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 400
చివరితేది: 15-07-2017
ప్రవేశపరీక్ష తేదీ: 06-08-2017 (బీఈడీ అభ్యర్థులకు ఉ. 10:30 నుంచి మ. 12:30 వరకు, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) అభ్యర్థులకు మ. 2:00 నుంచి సా. 4:00 వరకు)
వెబ్‌సైట్: www.braou.ac.in


0 comments:

Post a Comment