Thursday, 13 July 2017

ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టులు, ఎన్‌ఎస్‌ఐసీఎల్‌లో 56 ఖాళీలు, పీజీసీఐఎల్‌లో ఫీల్డ్ సూపర్‌వైజర్లు. Sailor posts in the Indian Navy,56 vacancies in NSICL,Field supervisors Jobs IN PGCIL

ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టులు,
భారత ప్రభుత్వ రక్షణశాఖ పరిధిలోని ఇండియన్ నేవీ (ఐఎస్) సెయిలర్ పోస్టుల భర్తీకి స్పోర్ట్స్ కోటా ఎంట్రీ-2/2017 బ్యాచ్‌లో చేరటానికి అర్హత గల అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇండియన్ నేవీ విడుదలచేసింది.
INDIAN-NAVY
వివరాలు:
నౌకాదళంలో సెయిలర్ ఉద్యోగాల శిక్షణ (స్పోర్ట్స్ కోటా ఎంట్రీ) ఐఎన్‌ఎస్ చిల్కాలో కోర్సు ప్రారంభమవుతుంది.
స్పోర్ట్స్ విభాగాలు: అథ్లెటిక్స్, ఆక్వాటెక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, స్కాష్, కయాకింగ్/కనోయింగ్, ఫెన్సింగ్, గోల్ఫ్, టెన్నిస్, బెస్ట్ ఫిజిక్, షూటింగ్, సెయిలింగ్, విండ్ సర్ఫింగ్, రోయింగ్ అండ్ ఈక్విస్ట్రెయిన్ (హార్స్‌పోలో)లో అంతర్జాతీయ/ జూనియర్ లేదా సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ , సీనియర్ స్టేట్ చాంపియన్‌షిప్, ఆల్ ఇండియా యూనివర్సిటీ చాంపియన్‌షిప్ స్థాయిలో పాల్గొన్న విశిష్ట క్రీడాకారులు.

డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్:

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదైనా గ్రూప్‌లో ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయిలో జూనియర్/సీనియర్ స్థాయిలో పాల్గొని ఉండాలి. అంతర్ విశ్వవిద్యాలయ టోర్నమెంట్ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. వ్యక్తిగత ఈవెంట్స్‌లో నేషనల్ సీనియర్ స్థాయిలో 6వ స్థానం, జాతీయ జూనియర్ స్థాయిలో 3వ స్థానం, ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో 3వ స్థానం పొంది ఉండాలి.
వయస్సు: కోర్సు ప్రారంభ తేదీనాటికి 17 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 1995 ఆగస్టు 1 నుంచి 2000 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.

సీనియర్ సెకండరీ రిక్రూట్‌మెంట్ (ఎస్‌ఎస్‌ఆర్)

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదైనా గ్రూప్‌లో ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయిలో జూనియర్/సీనియర్ స్థాయిలో పాల్గొని ఉండాలి. అంతర్ విశ్వవిద్యాలయ టోర్నమెంట్ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
వయస్సు: కోర్సు ప్రారంభ తేదీనాటికి 17 నుంచి 21 ఏండ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 1996 అక్టోబర్ 1 నుంచి 2000 సెప్టెంబర్ 30 మధ్యన జన్మించి ఉండాలి.

మెట్రిక్ రిక్రూట్స్ (ఎంఆర్)

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి టోర్నమెంట్ స్థాయిలో పాల్గొని ఉండాలి.
వయస్సు: కోర్సు ప్రారంభ తేదీనాటికి 17 నుంచి 21 ఏండ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 1996 అక్టోబర్ 1 నుంచి 2000 సెప్టెంబర్ 30 మధ్యన జన్మించి ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులు లాజిస్టిక్ (చీఫ్) లేదా లాజిస్టిక్ (స్టీవార్డ్స్), హైజనిస్ట్‌గా నియమితులవుతారు.

పే అండ్ అలవెన్స్‌లు:

-ప్రారంభ శిక్షణా కాలంలో నెలకు రూ. 14,600/- స్టయిఫండ్ ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత రూ. 21,700-43,100 + అదనంగా నెలకు రూ. 5,200/-వంతున ఎంఎస్‌పీ+ డీఏ చెల్లిస్తారు. సెయిలర్లందరికి రూ. 37.50 లక్షల ఇన్సూరెన్స్ కవర్ వర్తింస్తుంది.
పదోన్నతులు: సెయిలర్ నుంచి మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ - 1 (సుబేదార్‌కు సమాన స్థాయి) వరకు ఉంటుంది.
-శిక్షణాకాలంలో సెయిలర్స్‌కు పుస్తకాలు, యూనిఫాం, భోజనం, వసతి సౌకర్యాలను ఉచితంగా ఇస్తారు. సెయిలర్స్, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తారు. సెయిలర్స్ పిల్లల విద్య, హెచ్‌ఆర్‌ఏ అలవెన్స్‌లు ఇస్తారు. వీటితోపాటు సంవత్సరాంత సెలవులు ఉంటాయి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్స్ ద్వారా చేస్తారు.
-అర్హత కలిగిన అభ్యర్థులను ప్రత్యేకమైన నేవల్ కేంద్రాల్లో ట్రయల్స్ కోసం పిలుస్తారు. ట్రయల్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు, ఐఎన్‌ఎస్ హేమ్లా, ముంబై వద్ద వైద్య పరీక్షలకు హాజరుకావాలి. ఎన్‌రోల్‌మెంట్ ఆఫర్‌లో ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే కాల్‌లెటర్స్ ఇస్తారు. నిర్దిష్ట స్పోర్ట్స్ డిసిప్లిన్‌లో ఆవశ్యకత ద్వారా ఖాళీలను అనుసవరించి ఎంపిక ఉంటుంది.

శారీరక ప్రమాణాలు:

-కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు, ఛాతీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.
-వీటితోపాటు నేవీ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మంచి కంటి చూపు ఉండాలి.
శిక్షణ: బేసిక్ ట్రెయినింగ్ ఐఎన్‌ఎస్ చిల్కాలో నిర్వహిస్తారు. ఆ తర్వాత వివిధ నేవల్ ట్రెయినింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో కేటాయించిన ట్రేడ్‌లో ప్రొఫెషనల్ ట్రెయినింగ్ ఉంటుంది. బ్రాంచీ/ట్రేడ్ సర్వీస్ ఆవశ్యకత ప్రకారం కేటాయిస్తారు.
-శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకొన్న వారికి 15 ఏండ్లు కాలపరిమితికి నియామక ఉత్తర్వులు ఇస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, అవసరమైన సర్టిఫికెట్స్, ఫొటోలు జతచేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: ది సెక్రటరీ ఇండియన్ నేవీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు, 7వ అంతస్తు. చాణక్య భవన్, ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ ఎంవోడీ (నేవీ), న్యూఢిల్లీ-110021
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఎస్‌ఐసీఎల్‌లో 56 ఖాళీలు,
నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులై అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
NSIC
వివరాలు:
ఎన్‌ఎస్‌ఐసీఎల్ అనేది మినీరత్న కంపెనీ.
విభాగాలవారీగా-ఖాళీల వివరాలు:
-బిజినెస్ డెవలప్‌మెంట్/మార్కెటింగ్, టెక్నాలజీ, ఐటీ, సివిల్, లా అండ్ రికవరీ విభాగాల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం)- 7 ఖాళీలు (ఎస్సీ-1, ఎస్టీ-1, ఓబీసీ-3, అన్ రిజర్వ్‌డ్-2)
-ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో డీజీఎం- 4 ఖాళీలు (ఎస్సీ-1, ఓబీసీ-1, అన్ రిజర్వ్‌డ్-2)
-బిజినెస్ డెవలప్‌మెంట్/మార్కెటింగ్, టెక్నాలజీ విభాగాల్లో డిప్యూటీ మేనేజర్ (డీఎం)- 22 ఖాళీలు (ఎస్సీ-2, ఎస్టీ-2, ఓబీసీ-4, అన్ రిజర్వ్‌డ్-14)
-ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో డీఎం - 6 ఖాళీలు (ఓబీసీ-1, అన్ రిజర్వ్‌డ్-5)
-అకౌంట్స్ ఆఫీసర్ (ఏఓ) - 17 ఖాళీలు (ఎస్టీ-3, ఓబీసీ-1, అన్ రిజర్వ్‌డ్-13)
వేతనం: డీజీఎంకు రూ. 29,100-54,500, డీఎంకు రూ. 16,400-40,500, ఏఓకు రూ. 12,000-24,000.
అర్హత: హోదా ప్రకారం వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి.
అనుభవం: డీజీఎంకు పదేండ్లు, డీఎం, ఏఓకు ఐదేండ్లు అనుభవం ఉండాలి.
వయస్సు: డీజీఎంకు 45 ఏండ్లు, డీఎంకు 35 ఏండ్లు, ఏఓకు 30 ఏండ్లు మించరాదు.
ఎంపిక విధానం: డీజీఎం, డీఎంలకు ఇంటర్వ్యూ, ఏఓలకు రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చివరితేదీ: జూలై 21
వెబ్‌సైట్: http://www.nsic.co.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పీజీసీఐఎల్‌లో ఫీల్డ్ సూపర్‌వైజర్లు.


పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్)లోని పవర్‌గ్రిడ్ మేదినిపూర్-జీరత్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (పీఎంజేటీఎల్) విభాగంలో ఖాళీగా ఉన్న (రెండేండ్ల కాంట్రాక్టు ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులై అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
PGCI
వివరాలు:
పవర్‌గ్రిడ్ నవరత్న కంపెనీ. దీన్ని 1989 అక్టోబర్ 23న ఏర్పాటుచేశారు.
ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులు: 17
ఫీల్డ్ సూపర్‌వైజర్: 10
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్
పే స్కేల్: ఫీల్డ్ ఇంజినీర్‌కు రూ. 30,000, ఫీల్డ్ సూపర్‌వైజర్‌కు రూ. 23,000.
అర్హతలు: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజినీరింగ్)/డిప్లొమా ఉత్తీర్ణత.
వయోపరిమితి: 2017, జూలై 19 నాటికి 29 ఏండ్లకు మించరాదు.
ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి మెరిట్ జాబితా, టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు ఫీజు: ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులకు రూ. 400, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు రూ. 300. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరి తేదీ: జూలై 19.
వెబ్‌సైట్: www.powergridindia.com0 comments:

Post a Comment