Monday, 31 July 2017

ఎన్‌ఐఈఎల్‌ఐటీలో 340 ఖాళీలు, ఇండియన్ ఆర్మీలో జాగ్ ఎంట్రీ స్కీమ్, హెచ్‌సీఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్‌లు, వైజాగ్ స్టీల్‌లో జూనియర్ ట్రెయినీలు, ఎన్‌ఐఆర్‌డీపీఆర్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు. NILEIT Recruitment 340 Posts,The JAG Entry Scheme in the Indian Army,HCL Trade Apprentices,Junior trainees in vizag Steal,NIRDPR Project Officers Jobs.

ఎన్‌ఐఈఎల్‌ఐటీలో 340 ఖాళీలు,

-బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ అభ్యర్థులకు సదవకాశం.
- రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక
- మంచి జీతభత్యాలు, ఉద్యోగ భద్రత
- దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 28
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ఖాళీగా ఉన్న గ్రేడ్ బీ సైంటిస్ట్, టెక్నికల్/సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NIELIT
వివరాలు:
ఎన్‌ఐఈఎల్‌ఐటీ అనేది స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
(ఎంఈఐటీవై) తరపున పనిచేస్తుంది. ఈ ఖాళీలను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ)లో భర్తీచేస్తారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 340
-పనిచేసే ప్రదేశం: దేశంలోని ఎన్‌ఐఈఎల్‌ఐటీతో పాటు అనుబంధ సంస్థల్లో ఎక్కడైనా.
-పోస్టు పేరు: సైంటిస్ట్ గ్రేడ్ బీ
-పోస్టుల సంఖ్య: 81 (జనరల్-42, ఓబీసీ-21, ఎస్సీ-12, ఎస్టీ-6)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత లేదా ఎమ్మెస్సీ (ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్/అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్)తోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 56,100-1,77,500/-
-పోస్టు పేరు: సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ ఏ
-పోస్టుల సంఖ్య: 259 (జనరల్-133, ఓబీసీ-69, ఎస్సీ-38, ఎస్టీ-19)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ అండ్ నెట్‌వర్కింగ్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ సిస్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ మేనేజ్‌మెంట్, బయోఇన్ఫర్మాటిక్స్, రిమోట్ సెన్సింగ్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఏస్), మ్యాథమెటిక్స్, అప్లయిడ్ మ్యాథమెటిక్స్, ఆపరేషన్ రిసెర్చ్, స్టాటిస్టిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ డిజైన్‌లలో ఎమ్మెస్సీ/ఎంఎస్, ఎంసీఏ, బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 35,400-1,12,400/-
-వయస్సు: 2017 ఆగస్టు 28 నాటికి 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ.800/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయుంపు ఉంటుంది.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, తిరువనంతపురం, అహ్మదాబాద్‌లతోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 26 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
-ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వూ ద్వారా
-కేవలం ఢిల్లీలో మాత్రమే ఇంటర్వ్యూను నిర్వహిస్తారు.
-రాతపరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఇచ్చి ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
-రాతపరీక్షలో సంబంధిత సబ్జెక్ట్, లాజికల్, అనలిటికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్ అంశాలనుంచి ప్రశ్నలు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొనేటప్పుడు వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 28
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ ఆర్మీలో జాగ్ ఎంట్రీ స్కీమ్,

ఇండియన్ ఆర్మీ (ఐఏ) జడ్జ్ అడ్వకేట్ జనరల్ డిపార్ట్‌మెంట్‌లోని షార్ట్ సర్వీస్ కమిషన్ కింద లా గ్రాడ్యుయేట్ (జాగ్ ఎంట్రీ స్కీమ్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుషులు, అవివాహిత మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Indian-Army
వివరాలు:
భారతదేశాన్ని అనుక్షణం రక్షించే దళాలలో ఇండియన్ ఆర్మీ ఒకటి. ఈ సంస్థ ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతోపాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం.
-పోస్ట్ పేరు: జాగ్ ఎంట్రీ స్కీమ్(20వ కోర్స్ -ఏప్రిల్ 2018)
-మొత్తం ఖాళీల సంఖ్య: 14 ( పురుషులు-10, మహిళలు-4)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో మూడేండ్ల/ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం కలిగి ఉండాలి.
-వయస్సు: 2018 జనవరి 1 నాటికి 21 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్: శిక్షణా కాలంలో నెలకు రూ. 21,000/- ఇస్తారు. చెన్నైలో 49 వారాల ట్రెయినింగ్ పీరియడ్ ఉంటుంది.
-శిక్షణ పూర్తయిన వెంటనే లెఫ్టినెంట్ హోదాలో . రూ. 15,600 - 39,100 + గ్రేడ్ పే రూ. 5,400/- + ఎంఎస్‌పీ రూ. 6,000/- (7వ వేతన పే స్కేల్ ప్రకారం వేతనం చెల్లిస్తారు)
-ఫిజికల్ స్టాండర్డ్స్ : పురుషులు 157.5 సెం,మీ, మహిళలు 152 సెం.మీ ఎత్తును కలిగి ఉండాలి.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ):
-15 నిమిషాల్లో 2.4 కి.మీ దూరాన్ని పరుగెత్తాలి, 25 సైట్ అప్స్, 6 చిన్ అప్స్, 3-4 రోప్ ైక్లెంబింగ్, 20 పుష్ అప్స్
-ప్రొబేషనరీ పీరియడ్: ఆరు నెలలు
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 23


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌సీఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్‌లు,

జార్ఖండ్‌లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వివిధ ట్రేడ్ విభాగాల్లోఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ చేయడానికి అర్హులైన యువకులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Hindustan
వివరాలు:
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌ను మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ పరిధి కింద 1967 నవంబర్ 9న ఏర్పాటుచేశారు.
-మొత్తం అప్రెంటిస్‌ల సంఖ్య-42 (ఫిట్టర్-20, ఎలక్ట్రీషియన్-16, వెల్డర్ (జీ అండ్ ఈ)-3, మెషినిస్ట్-1, టర్నర్-2)
-విభాగాలు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్
-అర్హత : గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి పదో తరగతితోపాటు సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లలో 60 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. 2014 కంటే ముందు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అనర్హులు.
-వయస్సు: 2017 ఆగస్టు 10 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: మొదటి ఏడాదికి నెలకు రూ. 4,576/-, రెండో ఏడాదికి నెలకు 5,148/- స్టయిఫండ్ చెల్లిస్తారు.
-ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా
-దరఖాస్తు : ఆఫ్‌లైన్. అర్హత గల అభ్యర్థులు నిర్ణీత నమూనాలో దరఖాస్తును నింపి, పోస్ట్ ద్వారా రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: CHIEF MA-AGER (HR) R&E, I-DIA- COPPER COMPLEX, PO-MOUBHA-DAR, PI- 832103, DISTRICT - EAST SI-GHBHUM, JHARKHA-D
-చివరి తేదీ: ఆగస్టు 19
-రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 10 ఉదయం 10.30 గం॥లకు.
-వెబ్‌సైట్: WWW.HI-DUSTA-COPPER.COM


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వైజాగ్ స్టీల్‌లో జూనియర్ ట్రెయినీలు,
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్‌పీ) ఇన్‌స్ట్రుమెంట్ విభాగంలో ఖాళీగా ఉన్న జూనియర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Vizag-Steel-Plant
వివరాలు:
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది దేశంలోని తీర ఆధారిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. ఇది ఒక నవరత్న కంపెనీ.
-పోస్టు పేరు: జూనియర్ ట్రెయినీ
-మొత్తం పోస్టుల సంఖ్య: 19 (జనరల్-10, ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఎస్సెస్సీ/మెట్రిక్యులేషన్+ఫుల్‌టైమ్ ఐటీఐ లేదా ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ (మెకానికల్)లో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత. అదనంగా ఇంటర్, బీఎస్సీ, బీకాం, బీఏ బీఈ/బీటెక్, బీఎల్, బీహెచ్‌ఎంఎస్, ఎంబీఏ చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: 2017 జూలై 1 నాటికి 27 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: జూనియర్ ట్రెయినీ పోస్టులకు శిక్షణలో భాగంగా మొదటి ఏడాది రూ. 10,700/-
(కన్సాలిడేటెడ్ పే), రెండో ఏడాది రూ. 12,200/- స్టయిఫండ్ ఇస్తారు. ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తర్వాత రెగ్యులర్ పే స్కేల్ రూ. 16,800-3%-24,110/- ఇస్తారు.
-ఎత్తు: పురుష అభ్యర్థులు-150 సెంటీమీటర్లు, మహిళా అభ్యర్థులు 143 సెంటీమీటర్లు.
-బరువు: పురుష అభ్యర్థులు కనీసం 45 కిలోలు, మహిళా అభ్యర్థులు 35 కిలోలు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 300/-జనరల్, ఓబీసీ అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ , పీహెచ్‌సీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
-ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
-రాత పరీక్ష సిలబస్: జనరల్ ఆప్టిట్యూడ్, సంబంధిత సబ్జెక్ట్ అంశాలపై ప్రశ్నలను ఇస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ఇంగ్లిష్‌లో ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. కేవలం రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31
-డౌన్‌లోడ్ కాల్‌లెటర్స్: ఆగస్టు 14
-రాతపరీక్ష తేదీ: ఆగస్టు 20
-వెబ్‌సైట్: WWW.VIZAGSTEEL.COM----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌డీపీఆర్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు.

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
NIRD

వివరాలు:
ఎన్‌ఐఆర్‌డీ అనేది గ్రామీణ అభివృద్ధి, పరిశోధన కోసం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేశారు. ఈ పోస్టులను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ప్రోగ్రాంలో భాగంగా భర్తీచేస్తారు.
-జాయింట్ డైరెక్టర్-1
-అసిస్టెంట్ డైరెక్టర్ (ఎంఐఎస్)-1
-అర్హత: సంబంధిత డిగ్రీతోపాటు అప్లికేషన్ డెవలప్‌మెంట్, మెయింటెనెన్స్ విభాగంలో అనుభవం ఉండాలి.-ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఎంఐఎస్)-5
-అర్హత: సంబంధిత డిగ్రీతోపాటు ఎంఐఎస్, జావా, పీహెచ్‌పీ, ఆండ్రాయిడ్, సిస్టం అడ్మినిస్ట్రేషన్, యూఐ విభాగంలో అనుభవం ఉండాలి.
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
-చివరి తేదీ: ఆగస్టు 120 comments:

Post a Comment