Monday, 31 July 2017

ఎయిమ్స్‌లో 315 ఉద్యోగాలు, ఎంటీఆర్‌డీసీలో ఉద్యోగాలు, ఐఐఎస్సీలో సెక్యూరిటీ అసిస్టెంట్స్, ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో, ఎన్‌ఐఈఎల్‌ఐటీలో సైంటిఫిక్ అసిస్టెంట్లు. 315 jobs in AIIMS,Jobs at MTRDC,Security Assistants in IISC,Assistant professors Jobs in Delhi University,Competition Commission of India Recruitment,Scientific Assistants Jobs In NIELIT

ఎయిమ్స్‌లో 315 ఉద్యోగాలు,

ఇంటర్, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు అవకాశం.
-రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-మంచి జీతభత్యాలు, ఉద్యోగ భద్రత
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 6

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిషికేష్) వివిధ గ్రూప్ బీ, సీ విభాగాల్లోని ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్, ఆఫీస్ అసిస్టెంట్, క్లర్క్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఎయిమ్స్ రిషికేష్ దేశంలోని 7 ఎయిమ్స్‌ల్లో అత్యున్నత ఆరోగ్య ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకటి. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది. దీన్ని 2012 సెప్టెంబర్ 20న స్థాపించారు.
-మొత్తం పోస్టులు- 315 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీల వివరాలు
-పోస్టు పేరు: ఆఫీస్ అసిస్టెంట్-25 (జనరల్-15, ఓబీసీ-6, ఎస్సీ-3, ఎస్టీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-పే స్కేల్: రూ. 9,300-34,800+ గ్రేడ్ పే రూ. 4,200/-
-వయస్సు: 20 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్టాఫ్ నర్స్ (గ్రేడ్1)-125 పోస్టులు (జనరల్-65, ఓబీసీ-33, ఎస్సీ-18, ఎస్టీ-9)
-అర్హత: నాలుగేండ్ల బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ (పోస్టు సర్టిఫికెట్)/ బీఎస్సీ నర్సింగ్ (పోస్టు బేసిక్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 9,300-34,800+గ్రేడ్ పే రూ. 4,800/-
-వయస్సు: 20 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
StaffNurse

టెక్నికల్ అసిస్టెంట్/టెక్నీషియన్-25 పోస్టులు (జనరల్-15, ఓబీసీ-6, ఎస్సీ-3, ఎస్టీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్/10+2, బీఎస్సీ (ఎంఎల్‌టీ), డిప్లొమా (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆపరేషన్ థియేటర్/అనస్థీషియా)లో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 9,300-34,800+గ్రేడ్ పే రూ. 4,200/-
-వయస్సు: 20 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-హాస్పిటల్ అటెండెంట్-100 పోస్టులు (జనరల్-51, ఓబీసీ-27, ఎస్సీ-15, ఎస్టీ-7)
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి/మెట్రిక్యులేషన్‌తోపాటు హాస్పిటల్ సర్వీస్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన హాస్పిటల్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ. 1,800/-
-వయస్సు: 20 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్టోర్ కీపర్ కమ్ క్లర్క్-40 పోస్టులు (జనరల్-22, ఓబీసీ-10, ఎస్సీ-5, ఎస్టీ-3)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/పీజీ, మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ. 1,900/-
-వయస్సు: 20 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు గ్రూప్ బీ పోస్టులకు రూ.3000/- గ్రూప్ సీ పోస్టులకు రూ. 2000/- , గ్రూప్ బీ, సీ పోస్టులకు -రూ. 1000/-(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు)
-ప్రొబేషనరీ పీరియడ్ : రెండేండ్లు
-ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పంపించిన దరఖాస్తులను ప్రింట్ తీసి, సంబంధిత సర్టిఫికెట్లు, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను జతచేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపించాలి.
-దరఖాస్తులను పంపడానికి చివరితేదీ: సెప్టెంబర్ 6
-వెబ్‌సైట్: WWW.AIIMSRISHIKESH.EDU.IN



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎంటీఆర్‌డీసీలో ఉద్యోగాలు,

కర్ణాటకలోని మైక్రోవేవ్ ట్యూబ్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఎంటీఆర్‌డీసీ) ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్), రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఎంటీఆర్‌డీసీ అనేది డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో పనిచేస్తుంది.
-జేఆర్‌ఎఫ్-6 పోస్టులు
-రిసెర్చ్ అసోసియేట్ - 1 పోస్టు
అర్హత: ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్‌లో ఎమ్మెస్సీ లేదా పీజీ, మెకానికల్ ఇంజినీరింగ్‌లో ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. నెట్ లేదా గేట్‌లో ఉత్తీర్ణత. రిసెర్చ్ అసోసియేట్‌కు పీజీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి.
వయస్సు: జేఆర్‌ఎఫ్‌కు 28 ఏండ్లు, రిసెర్చ్ అసిస్టెంట్‌కు 35 ఏండ్లు మించరాదు.
ఎస్సీ,ఎస్టీ,లకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్త్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా లేదా అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత, ఎక్స్‌పీరియన్స్ తదితర సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూ తేదీన పర్సనల్ అధికారివద్ద హాజరుకావాలి.
స్టయిఫండ్: రిసెర్చ్ అసోసియేట్‌కు రూ. 40,000/-, జేఆర్‌ఎఫ్‌కు రూ. 25,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరితేదీ: ఆగస్టు 9,10,11,12
-వెబ్‌సైట్: WWW.DRDO.GOV.IN


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్సీలో సెక్యూరిటీ అసిస్టెంట్స్,
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఐఐఎస్సీ ఒకటి. ప్రస్తుత పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
-పోస్టు: సెక్యూరిటీ అసిస్టెంట్
-ఖాళీల సంఖ్య - 24 (జనరల్ - 10, ఓబీసీ - 9, ఎస్సీ - 3, ఎస్టీ - 1)
అర్హతలు: పదోతరగతి, ఆర్మ్‌డ్ ఫోర్సెస్, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌లో కనీసం 15 ఏండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. ద్విచక్ర వాహన లైసెన్స్ కలిగి ఉండాలి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఆగస్టు 21
-వెబ్‌సైట్: HTTP://WWW.IISC.AC.IN



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్,

యూనివర్సిటి ఆఫ్ ఢిల్లీకి చెందిన రాంజాస్ కాలేజ్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అహ్వనిస్తున్నది.

వివరాలు:
ఢిల్లీలోని పురాతన కళాశాలల్లో రాంజాస్ ఒకటి. 1917లో గొప్ప విద్యావేత్త, తత్త్వవేత్త అయిన రాయ్ కేదర్‌నాథ్ ఢిల్లీలో స్థాపించారు.
-పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్
-మొత్తం పోస్టులు :128
-విభాగాలు : బాటనీ-10, కెమిస్ట్రీ-20, కామర్స్-13, ఎకనామిక్స్-5, ఇంగ్లిష్-8, హిందీ-3, హిస్టరీ-7, మ్యాథమెటిక్స్-11, ఫిలాసఫీ-1, ఫిజిక్స్-24, పొలిటికల్ సైన్స్-7, సంస్కృతం-3, స్టాటిస్టిక్స్-5, జువాలజీ-11
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సటీ నుంచి సంబంధిత విభాగం నుంచి 55 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత. యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్‌లో ఉత్తీర్ణత.
పే స్కేల్: రూ. 15600-39,100 + అకడమిక్ గ్రేడ్ పే రూ. 6,000/-
ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేదీ: ఆగస్టు 19
వెబ్‌సైట్: WWW.RAMJASCOLLEGE.EDU


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో,

న్యూఢిల్లీలోని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్రొఫెషనల్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
సీసీఐ అనేది చట్టబద్దమైన సంస్థ. దీన్ని 2003 అక్టోబర్ 14న ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 31
-ఆఫీస్ మేనేజర్-14 (కార్పొరేట్ సర్వీస్, లైబ్రేరీ సర్వీసెస్)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, హెచ్‌ఆర్‌ఎంలో డిప్లొమా, లైబ్రేరీ సైన్స్‌లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-డైరెక్టర్-3 (లా, ఎకనామిక్స్, ఫైనాన్షియల్)
-జాయింట్ డైరెక్టర్-2(లా, ఎకనామిక్స్)
-డిప్యూటీ డైరెక్టర్-12 (లా, ఎకనామిక్స్, ఫైనాన్షియల్ అనాలిసిస్)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ (కామర్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్) లేదా ఎల్‌ఎల్‌బీ, మాస్టర్ పీజీలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చిరునామా: DEPUTY DIRECTOR (HR),COMPETITION COMMISSION OF INDIA, HINDUSTANT -TIMESHOUSE, 18-20, NEW DELHI
చివరితేదీ: ఆగస్టు 18
వెబ్‌సైట్: WWW.CCI.GOV.IN


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఈఎల్‌ఐటీలో సైంటిఫిక్ అసిస్టెంట్లు.



.న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ఖాళీగా ఉన్న సైంటిఫిక్ అసిస్టెంట్, ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఎన్‌ఐఈఎల్‌ఐటీ స్వయంప్రతిపత్తి గల సంస్థ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) పరిధిలో పనిచేస్తుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 32

విభాగాలవారీగా ఖాళీలు
-పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్ (గ్రేడ్ ఏ)-17 పొస్టులు (జనరల్-10, ఓబీసీ-4, ఎస్సీ-3)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ లేదా ఎమ్మెస్సీ (ఎలక్ట్రానిక్స్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్/ఐటీ), ఎంఎస్ (అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అండ్ నెట్‌వర్కింగ్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ సిస్టం, ఐటీ, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం, ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ మేనేజ్‌మెంట్, కంప్యూటేషనల్ లింగ్విటిక్స్), ఎంసీఏలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 9,300-34,800+గ్రేడ్ పే రూ. 4,200/-
-పోస్టు పేరు: సైంటిపిక్ ఆఫీసర్ -1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, ఎంసీఏ, బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 9,300-34,800+గ్రేడ్ పే రూ. 4,600/-
-ట్రేడ్స్‌మెన్-14 పోస్టులు (జనరల్-10, ఓబీసీ-3, ఎస్సీ-1)
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి/మెట్రిక్యులేషన్+ ఐటీఐలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. 1,900/-
వయస్సు: 25 ఏండ్లకు మించరాదు.
అప్లికేషన్ ఫీజు: రూ.800/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులు రూ. రూ. 400/-.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతా, ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 12 కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తారు.
-ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌టెస్ట్/ఇంటర్వూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొనేటప్పుడు వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
-చివరితేదీ: ఆగస్టు 21
-వెబ్‌సైట్: WWW.NIELIT.GOV.IN

0 comments:

Post a Comment