Wednesday, 26 July 2017

హైదరాబాద్ ఎఫ్‌సీఐలో 271 పోస్టులు, ఇస్రో ప్రొపల్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు, విక్రం స్పేస్ సెంటర్‌లో జేఆర్‌ఎఫ్‌లు ఉద్యోగాలు, ఐసీఎఫ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు, ఈఎస్‌ఎస్‌వోలో ఉద్యోగాలు. Hyderabad FCI Recruitment 271 posts,Jobs at the ISRO Propulsion Center,JRF jobs in Vikram Space Center,Apprentice jobs in the ICF,Jobs at ESSO.

హైదరాబాద్ ఎఫ్‌సీఐలో 271 పోస్టులు,

హైదరాబాద్ రీజియన్‌లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ, ఏపీ, అండమాన్‌నికోబార్ దీవుల ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న వాచ్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)ను 1964లో ఏర్పాటుచేశారు. ఇది ఆహార ధాన్యం సరఫరా-గొలుసు నిర్వహణతో వ్యవహరించే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ.
-పోస్టు పేరు: వాచ్‌మెన్
-మొత్తం పోస్టుల సంఖ్య: 271 (జనరల్-138, ఓబీసీ-73, ఎస్సీ-41, ఎస్టీ-19)

ప్రాంతాలవారీగా ఖాళీలు:
-తెలంగాణ: 101 పోస్టులు ( జనరల్-51, ఓబీసీ-27, ఎస్సీ-16, ఎస్టీ-7)
-ఆంధ్రప్రదేశ్: 158 పోస్టులు ( జనరల్-79, ఓబీసీ-43, ఎస్సీ-25, ఎస్టీ-11)
-అండమాన్ నికోబార్ దీవులు: 12 పోస్టులు ( జనరల్-8, ఓబీసీ-3,ఎస్టీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత. 2017 జూలై 1 నాటికి అర్హత సాధించి ఉండాలి.
-వయస్సు: 2017 జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 8,100-18,070/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 250/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
-ఎంపిక: ఆబెక్టివ్ రాతపరీక్ష, పీఈటీ ద్వారా.
-ఫిజికల్ ఎడ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ). ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
-పరుగు పందెం: పురుష అభ్యర్థులు 1000 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల 30 సెకండ్లలో, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల 30 సెకండ్లలో పూర్తిచేయాలి.
-హై జంప్: పురుష అభ్యర్థులు 1.20 మీటర్లు, మహిళా అభ్యర్థులు 0.80 మీటర్లు
-లాంగ్ జంప్: పురుష అభ్యర్థులు 3.50 మీటర్లు, మహిళా అభ్యర్థులు 3.00 మీటర్లు
-పీహెచ్‌సీ అభ్యర్థులకు పీఈటీ పరీక్ష మినహాయింపు ఉంది.
FCI-MARKET

రాత పరీక్ష
-ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
-పరీక్షపత్రం తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. అభ్యర్థులు ఏదైనా ఒక భాష ఎంచుకొని పరీక్ష రాయవచ్చు.
-మొత్తం 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు
-120 నిమిషాల్లో 120 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. అంటే ప్రతి ప్రశ్నకు ఒక మార్కు.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
-రాతపరీక్ష తేదీ వివరాలను వెబ్‌సైట్ లేదా ఈ మెయిల్ ఐడీ ద్వారా తెలియజేస్తారు.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, శ్రీకాకులం, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, కర్నూల్, పోర్ట్‌బ్లెయిర్
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నింపేటప్పుడు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీని తప్పనిసరిగా ఎంటర్ చేయాలి
చిరునామా: FCI, Regional Office, HACA Bhawan, Opp. Public Gardens, Hyderabad -500 004
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 21
-పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు
-వెబ్‌సైట్: www.fciregionaljobs.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇస్రో ప్రొపల్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు,

ఇస్రో అనుబంధ సంస్థల్లో పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు: 
భారత అంతరిక్ష పరిశోధన విభాగం పరిధిలోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కింద పనిచేస్తుంది. దీనికి అనుబంధంగా పలు విభాగాలు ఉన్నాయి. 
-లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్‌లో ఖాళీలు: ప్రస్తుతం ఈ ఖాళీలు తిరువనంతపురం సమీపంలోని వలియమల, బెంగళూరులో ఉన్నాయి. 

లైబ్రెరి అసిస్టెంట్ ఏ
-ఖాళీల సంఖ్య - 2 (జనరల్ - 1, ఓబీసీ -1)
-అర్హతలు: డిగ్రీతోపాటు ప్రథమశ్రేణిలో ఎంఎల్‌ఐఎస్సీ/లైబ్రెరి అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-పేస్కేల్: రూ. 44,900 - 1,42,400/-

టెక్నికల్ అసిస్టెంట్
-ఎలక్ట్రానిక్స్ విభాగం- 1 పోస్టు
-అర్హతలు: ప్రథమశ్రేణిలో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ డిప్లొమా లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-పేస్కేల్: రూ. 44,900 - 1,42,400/-

టెక్నీషియన్ బీ (లెవల్ 3)
-ఖాళీల సంఖ్య - 17. విభాగాల వారీగా.. ఫిట్టర్ - 6, ఎలక్ట్రీషియన్ - 3, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ - 3, టర్నర్ - 2, డీజిల్ మెకానిక్ - 1, మేషన్ - 1, ప్లంబర్ - 1.
-అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు ఎన్‌సీటీవీ/ఎన్‌ఏసీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-పేస్కేల్: రూ. 21,700 - 69,100/-
isro-gslv

డ్రాఫ్ట్స్‌మ్యాన్ బీ (లెవల్ 3)
ఖాళీల సంఖ్య - 1
-అర్హతలు: పదోతరగతితోపాటు ఐటీఐలో డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్) ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-పేస్కేల్: రూ. 21,700 - 69,100/-
-వయస్సు: 2017, ఆగస్టు 7 నాటికి 18 - 35 ఏండ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూలై 25 నుంచి ప్రారంభం
-చివరితేదీ: ఆగస్టు 7

-వెబ్‌సైట్: www.lpsc.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
విక్రం స్పేస్ సెంటర్‌లో జేఆర్‌ఎఫ్‌లు  ఉద్యోగాలు,

తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ)లో జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: 
విక్రం సారాభాయ్ సెంటర్ దేశంలో అత్యుత్తమైన పరిశోధనా కేంద్రాల్లో ఒకటి. దీనిలోని స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీలో ప్రస్తుతం కింది ఖాళీలు ఉన్నాయి.
-జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)
-ఖాళీల సంఖ్య - 6
-అర్హతలు: ఎమ్మెస్సీలో ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్ లేదా స్పేస్ ఫిజిక్స్, అట్మాస్ఫియరిక్ సైన్స్, మెటీరియాలజీ, స్పేస్‌సైన్స్, ప్లానిటరీ సైన్సెస్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ లేదా ఎంటెక్‌లో అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ప్లానిటరీ సైన్సెస్, అప్లయిడ్ ఫిజిక్స్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులు లేదా 6.5 సీజీపీఏతో ఉత్తీర్ణత. వీటితోపాటు కింది ఏదైనా ఒకదానిలో అర్హత ఉండాలి..
-సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ (లెక్చర్‌షిప్), గేట్, జామ్, జెస్ట్‌లలో ఏదో ఒకదానిలో అర్హత సాధించి ఉండాలి.
రిసెర్చ్ అసోసియేట్ 
-ఖాళీల సంఖ్య - 9
-అర్హతలు: సైన్స్/టెక్నాలజీ విభాగాల్లో పీహెచ్‌డీ. థీసెస్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, స్పేస్ సైన్సెస్, ప్లానిటరీ సైన్సెస్ లేదా అట్మాస్ఫియరిక్ మోడలింగ్ లేదా తత్సమాన రంగాల్లో చేసి ఉండాలి.
-దరఖాస్తు: జేఆర్‌ఎఫ్ పోస్టులకు ఆన్‌లైన్‌లో జూలై 24 నుంచి ఆగస్టు 7 మధ్య చేసుకోవాలి. రిసెర్చ్ అసోసియేట్స్ ఈమెయిల్ ద్వారా ఏడాదిలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

-వెబ్‌సైట్: www.vssc.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీఎఫ్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు,

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అర్హులైన అభ్యర్థుల నుంచి అప్రెంటిస్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: 
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ భారత రైల్వేలకు ప్రొడక్షన్ యూనిట్. రైల్వే ప్యాసింజర్ కోచ్‌లను ఐసీఎఫ్ తయారుచేస్తుంది. దీన్ని 1955లో స్విస్ సహకారంతో ప్రారంభించారు.
పోస్టు: అప్రెంటిసెస్ (1961 యాక్ట్ ప్రకారం పలు ట్రేడ్‌లలో శిక్షణ ఇస్తారు)
జీతం: నెలకు రూ. 5,700/- 
మొత్తం ఖాళీలు- 417. ట్రేడ్‌ల వారీగా ఖాళీలు...
కార్పెంటర్ - 29
ఎలక్ట్రీషియన్ - 87
ఫిట్టర్ - 133
మెకానిస్ట్ - 36
పెయింటర్ - 36
వెల్డర్ - 88
ఎంఎల్‌టీ - 8
అర్హతలు: మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతి/ తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రెయినింగ్ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి.
వయస్సు: 2017, అక్టోబర్ 1 నాటికి 15 -24 ఏండ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక: పదోతరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్న కాపీ ప్రింట్ తీసి, తగు సర్టిఫికెట్స్‌ను జతచేసి కింది చిరునామాకు ఆగస్టు 21లోగా పంపాలి. 
అడ్రస్: Assistant Personal Officer/G,Integral Coach Factory,Chennai-600038 

వెబ్‌సైట్: www.icf.indianrailways.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈఎస్‌ఎస్‌వోలో ఉద్యోగాలు.
హైదరాబాద్‌లోని ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ (ఈఎస్‌ఎస్‌వో)లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: ఈఎస్‌ఎస్‌వో భారత ప్రభుత్వరంగ సంస్థ.
-ప్రాజెక్ట్ సైంటిస్ట్- 5, ప్రాజెక్ట్ అసిస్టెంట్- 11, ప్రాజెక్ట్ అసిస్టెంట్ సివిల్- 1, ప్రాజెక్ట్ అసిస్టెంట్ హిందీ జూనియర్ ట్రాన్స్‌లేటర్- 1, జూనియర్ అఫీస్ అసిస్టెంట్- 1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఆగస్టు 24లోగా చేసుకోవాలి.
-వెబ్‌సైట్: www.incois.gov.in

0 comments:

Post a Comment