Wednesday, 26 July 2017

రాజ్యసభలో 115 పోస్టులు, పవర్‌గ్రిడ్‌లో ట్రెయినీలు, యూపీఎస్సీ-మార్కెటింగ్ ఆఫీసర్లు, ఐఐడబ్ల్యూఎంలో సీనియర్ రిసెర్చ్ ఫెలో, ఎన్‌సీఎల్‌లో సైంటిస్టులు. Rajya Sabha Recruitment 115 posts,Powergrid Trainee Jobs,UPSC-Marketing Officers Jobs,Senior Research Fellow at IIWM,Scientists Jobs in NCCL

రాజ్యసభలో 115 పోస్టులు,
డిగ్రీ, పీజీ అభ్యర్థులకు అవకాశం
-మంచి జీతభత్యాలు
-చివరి తేదీఆగస్టు 18

రాజ్యసభ సెక్రటేరియట్‌లో 115 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను రిక్రూట్‌మెంట్ సెల్ విడుదలచేసింది.

వివరాలు:
-పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో రాజ్యసభ సెక్రటేరియట్ ఒక భాగం.
-పార్లమెంటరీ ఇంటర్‌ప్రిటర్ (హిందీ/ఇంగ్లిష్, ఒడియా) - 2
-పేస్కేల్: 15,600 - 39,100 + గ్రేడ్ పే రూ. 5,400/-
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్ మీడియంలో పీజీ తోపాటు డిగ్రీ స్థాయి వరకు హిందీ మీడియంలో చదివి ఉండాలి. లేదా హిందీలో పీజీ చేసి, డిగ్రీ వరకు ఇంగ్లిష్ మీడియంలో చదివినవారు అర్హులు. లేదా తత్సమాన అర్హత ఉన్నవారు.
-అసిస్టెంట్ లెజిస్లేటివ్/ కమిటీ/ ప్రొటోకాల్ లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ - 20 పోస్టులు (ఎస్సీ - 3, ఎస్టీ - 2, ఓబీసీ - 5, జనరల్ - 10)
-పేస్కేల్: 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,200/-
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డీవోఈఏసీసీ/ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థలో ఓలెవల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
-స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్) - 11 పోస్టులు
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,200/-
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల వేగాన్ని కలిగి ఉండాలి. ఇంగ్లిష్, హిందీల్లో స్టెనోగ్రఫీ తెలిసినవారికి ప్రాధాన్యం ఇస్తారు. డీఈవోఏసీసీ గుర్తింపు పొందిన ఓలెవల్ కోర్సు సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
-గ్రేడ్ - 2 సెక్యూరిటీ అసిస్టెంట్ - 21 ఖాళీలు
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,200/-
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కింది శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
PARLAMENT-OF-INDIA

శారీరక ప్రమాణాలు:
-పురుషులు: కనీసం 167.5 సెం.మీ. ఎత్తు, ఛాతీ 76.5 సెం.మీ., గాలిపీల్చినప్పుడు కనీసం 4.5 సెం.మీ. వ్యాకోచించాలి.
-మహిళలు - 154.6 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి. 6/12 కంటిచూపు కలిగి ఉండాలి.
-సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఇంగ్లిష్) - 30 ఖాళీలు
-పేస్కేల్: రూ. 5,200 - 20, 200 + గ్రేడ్ పే రూ. 2,400/-
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌పై నిమిషానికి కనీసం 40 పదాలు టైపింగ్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. హిందీ, ఇంగ్లిష్‌లో టైపింగ్ చేయగలిగేవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-సెక్రటేరియట్ అసిస్టెంట్ (హిందీ) - 7 ఖాళీలు
-పేస్కేల్: రూ. 5,200 - 20, 200 + గ్రేడ్ పే రూ. 2,400/-
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌పై హిందీలో నిమిషానికి 40 పదాలు టైపింగ్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి.
-సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఉర్దూ) - 7 ఖాళీలు
-పేస్కేల్: రూ. 5,200 - 20, 200 + గ్రేడ్ పే రూ. 2,400/-
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌పై ఉర్దూలో నిమిషానికి 40 పదాలు టైపింగ్ చేసే సామర్థ్యం ఉండాలి.
-ట్రాన్స్‌లేటర్ - 19 ఖాళీలు
-పేస్కేల్: 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,800/-
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పీజీలో హిందీతోపాటు డిగ్రీస్థాయి వరకు ఇంగ్లిష్ మీడియం చదివి ఉండాలి. లేదా పీజీలో ఇంగ్లిష్‌తోపాటు డిగ్రీ వరకు హిందీ మీడియంలో చదివి ఉండాలి. హిందీ - ఇంగ్లిష్/ఇంగ్లిష్ నుంచి హిందీ ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. ట్రాన్స్‌లేషన్‌లో కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
-ప్రూఫ్ రీడర్ - 3 పోస్టులు
-పేస్కేల్: 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,200/-
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీలో హిందీ లేదా ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ప్రింటింగ్ టెక్నాలజీలో డిప్లొమా లేదా పీజీ డిప్లొమా ఇన్ బుక్ పబ్లిషింగ్ ఉత్తీర్ణత లేదా ప్రింటింగ్ ప్రెస్‌లో/పబ్లిషింగ్‌లో ప్రూఫ్‌రీడింగ్‌లో కనీసం మూడేండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
-వయస్సు: పార్లమెంటరీ ఇంటర్‌ప్రిటర్ పోస్టుకు 18 - 35 ఏండ్లు మధ్య ఉండాలి. మిగిలిన పోస్టులకు 18 - 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు. ఈ సమయంలో శిక్షణలు, శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. అనంతరం రెగ్యులర్ పోస్టులో నియామకం చేస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 300/-
నోట్: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఎటువంటి ఫీజు లేదు.
-ఎంపిక: వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 18
-వెబ్‌సైట్: http://rajyasabha.nic.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పవర్‌గ్రిడ్‌లో ట్రెయినీలు,

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీఐసీఐఎల్) ఈస్టర్న్ రీజియన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్స్‌లోని ఖాళీగా ఉన్న జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ, అసిస్టెంట్ (ఫైనాన్స్), డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
పవర్‌గ్రిడ్ నవరత్న కంపెనీ, ఇండియా అతిపెద్ద ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ. దీన్ని 1989 అక్టోబర్ 23న ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య-30 పోస్టులు (జనరల్-15, ఓబీసీ-7, ఎస్సీ-7, ఎస్టీ-1).
-పోస్టు పేరు: ట్రెయినీ
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అసిస్టెంట్‌కు ప్రథమశ్రేణిలో బీకాం లేదా ఎంకాం, జూనియర్ ఆఫీసర్‌కు రెండేండ్ల పీజీ డిప్లొమా (పర్సనల్ మేనేజ్‌మెంట్) ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంబీఏలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 ఆగస్టు 9 నాటికి 27 ఏండ్లు, అసిస్టెంట్‌కు 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
-పే స్కేల్: నెలకు రూ. 16,500/-ట్రెయినింగ్ పీరియడ్‌లో స్టయిఫండ్‌గా ఇస్తారు. శిక్షణ పూర్తి అయిన తర్వాత జూనియర్ ఆఫీసర్/ఇంజినీర్ గ్రేడ్ 4 (ఎస్1)గా స్కేల్ రూ. 16,000-35,500/- ఉంటుంది. అసిస్టెంట్ పోస్టుకు రూ. 12,500-27,500/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 300/- , అసిస్టెంట్ పోస్టుకు రూ. 200/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు)
-ఎంపిక: రాత పరీక్ష, అసిస్టెంట్‌కు రాతపరీక్షతోపాటు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో నిర్ణీత నమూనా ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ- మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
-దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 11
-వెబ్‌సైట్: www.powergridindia.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ-మార్కెటింగ్ ఆఫీసర్లు,
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మార్కెటింగ్ ఆఫీసర్, స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
యూపీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 32
-మార్కెటింగ్ ఆఫీసర్-28 పోస్టులు
-గ్రేడ్3 స్పెషలిస్ట్ (బయోకెమిస్ట్రీ)-3 పోస్టులు
-అసిస్టెంట్ కెమిస్ట్-1 పోస్టు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (అగ్రికల్చర్, బాటనీ, అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ మార్కెటింగ్, ఎకనామిక్స్, కామర్స్), ఎంబీబీఎస్, మాస్టర్ డిగ్రీ (సూపర్ స్పెషాలిటీ), పీహెచ్‌డీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు. పోస్టులను బట్టి వేర్వేరుగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 25/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 10
-దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేదీ: ఆగస్టు 11
-వెబ్‌సైట్: http://upsconline.nic.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐడబ్ల్యూఎంలో సీనియర్ రిసెర్చ్ ఫెలో,
భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ మేనేజ్‌మెంట్ (ఐఐడబ్ల్యూఎం) ఖాళీగా ఉన్న సీనియర్ రిసెర్చ్ ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఐఐడబ్ల్యూఎం అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఏఆర్) అనుబంధ సంస్థ
-రిసెర్చ్ అసోసియేట్-1
-సీనియర్ రిసెర్చ్ ఫెలో-4
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంటెక్, మాస్టర్ డిగ్రీ (అగ్రికల్చర్, ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఇంజినీరింగ్, వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్, రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, కెమిస్ట్రీ, సాయిల్ సైన్స్, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ)తోపాటు పీహెచ్‌డీ, నెట్ ఉండాలి.
-పే స్కేల్: రిసెర్చ్ అసోసియేట్ రూ. 38,000/-(మాస్టర్ డిగ్రీ), రూ. 40,000/-(పీహెచ్‌డీ), ఎస్‌ఆర్‌ఎఫ్ రూ. 25,000/-(మొదటి ఏడాదికి), రూ. 28,000/- (రెండోఏడాది) రూ. 25,000/-
-వయస్సు: రిసెర్చ్ అసోసియేట్‌కు 40 ఏండ్లు (మహిళలు-45 ఏండ్లు), ఎస్‌ఆర్‌ఎఫ్‌కు 35 ఏండ్లు (మహిళలు-40 ఏండ్లు) మించరాదు
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులతో రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారి వద్ద ఇంటర్వ్యూ రోజున హాజరు కావాలి.
చిరునామా: The Director, ICAR-IIWM, Bhubaneswar
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 2
-వెబ్ సైట్: www.iiwm.res.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఎల్‌లో సైంటిస్టులు.

నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ (ఎన్‌సీఎల్)లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
ఎన్‌సీఎల్ సంస్థ సీఎస్‌ఐఆర్ పరిధిలో పనిచేస్తుంది. ఇది పుణెలో ఉంది.
-సైంటిస్ట్ - 15 ఖాళీలు
-వయస్సు: 32 ఏండ్లు మించరాదు.
-జీతం: నెలకు సుమారుగా రూ. 75,541/-
-సీనియర్ సైంటిస్ట్ - 10 పోస్టులు
-వయస్సు: 37 ఏండ్లు మించరాదు.
-జీతం: నెలకు సుమారుగా రూ. 86,644/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: ఆగస్టు 3
-వెబ్‌సైట్: http://www.ncl.org.in0 comments:

Post a Comment