Wednesday, 26 July 2017

ఐఎండీలో 1102 కొలువులు, బెల్‌లో 50 ఇంజినీర్ పోస్టులు, ఏఐఈఎస్‌ఎల్‌లో అసిస్టెంట్ సూపర్‌వైజర్లు ఉద్యోగాలు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు, ఎన్‌హెచ్‌ఏఐలో అకౌంటెంట్ ఉద్యోగాలు, కార్పొరేషన్ బ్యాంక్‌లో మేనేజర్లు. IMD Recruitment 1102 Posts,50 engineer posts in Bell,Assistant supervisors Jobs In AIESL,Jobs in Dredging Corporation,Accountant jobs in NHAI,Managers Jobs in Corporation Bank.

ఐఎండీలో 1102 కొలువులు,

డిగ్రీ/డిప్లొమా అభ్యర్థులకు అవకాశం
-మంచి జీతం.. భరోసా జీవితం
-నిత్యనూతనత్వం, చాలెంజింగ్ కెరీర్
-కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా ఎంపిక
ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంట్(ఐఎండీ)లో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Scientific
వివరాలు: ఐఎండీ భారత ప్రభుత్వ సంస్థ. అతిపురాతనమైన డిపార్ట్‌మెంట్. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాల్లో ఐఎండీ కార్యాలయాలు ఉన్నాయి.
-పోస్టు: సైంటిఫిక్ అసిస్టెంట్. గ్రూప్ బీ నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టు.
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,200/-ఖాళీల సంఖ్య - 1102
-వయస్సు: 2017, ఆగస్టు 4 నాటికి 30 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా సైన్స్ డిగ్రీ/కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
నోట్: డిగ్రీ లేదా డిప్లొమాలో కనీసం 60 శాతం మార్కులు లేదా 6.75 సీజీపీఏతో ఉత్తీర్ణత తప్పనిసరి. 10+2 విధానంలో ఇంటర్ పూర్తిచేసిన తర్వాత డిగ్రీ/డిప్లొమా చేసి ఉండాలి. అదేవిధంగా ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా చదివి ఉండాలి.
-ఎంపిక: కంప్యూటర్‌బేస్డ్ ఎగ్జామ్ ద్వారా
-పరీక్ష తేదీలు: నవంబర్ 20-27 మధ్య నిర్వహిస్తారు.
పరీక్ష విధానం:
-కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
-200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
-200 ప్రశ్నలు, 120 నిమిషాల కాలవ్యవధిలో సమాధానాలు గుర్తించాలి.
-ప్రశ్నపత్రం పార్ట్ - 1, 2లుగా ఉంటుంది.
-పార్ట్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్-25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-25, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్-25, జనరల్ అవేర్‌నెస్- 25 మార్కులు.
-పార్ట్ 2లో ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లపై ప్రశ్నలు ఇస్తారు. (ఎన్నుకొన్న సబ్జెక్టు)
-పార్ట్- 2లో ప్రశ్నల సంఖ్య 100
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 4, ఫీజు: రూ. 100/-
నోట్: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ సదరన్ రీజియన్ కార్యాలయం
చిరునామా: Regio-al Director (SR),Staff Selectio- Commissio-,EVK Sampath Buildi-g,2-d Floor,College Road, Che--ai,Tamil -adu-600006----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బెల్‌లో 50 ఇంజినీర్ పోస్టులు,

బెంగళూరులోని భారత్ ఎలక్రానిక్స్ లిమిటెడ్ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BEL
వివరాలు:
భారత్ ఎలక్రానిక్స్ లిమిటెడ్ అనేది ఒక నవరత్న కంపెనీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో పనిచేస్తుంది.
-విభాగాలు: ఎలక్ట్రానిక్స్, సివిల్, ఎలక్ట్రికల్
-మొత్తం పోస్టులు-50 పోస్టులు (ఎలక్ట్రానిక్స్-31, మెకానికల్-19)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్‌లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-వయస్సు: 25 ఏండ్లకు మించరాదు. వయోపరిమితిలో ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 23,000/- (కన్సాలిడేటెడ్ పే).
-ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
-ఎంపిక:ఆబ్జెక్టివ్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 2


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఐఈఎస్‌ఎల్‌లో అసిస్టెంట్ సూపర్‌వైజర్లు ఉద్యోగాలు,

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్) నార్తన్న్ రీజియన్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సూపర్‌వైజర్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
AIR-INDIA
వివరాలు: 
ఏఐఈఎస్‌ఎల్ అనేది ఎయిర్ ఇండియా లిమిటెడ్ శాఖ ఆధ్వర్యలో నడిచే సంస్థ.
-పోస్టు పేరు: అసిస్టెంట్ సూపర్‌వైజర్
-మొత్తం పోస్టుల సంఖ్య- 85 (జనరల్-45, ఓబీసీ-22, ఎస్సీ-12, ఎస్టీ-6)
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా బీసీఏ, బీఎస్సీ (ఐటీ), డిగ్రీలో ఐటీ ఉత్తీర్ణత. కంప్యూటర్ అప్లికేషన్‌లో డిప్లొమా/సర్టిఫికెట్ ఉండాలి. డిగ్రీ తర్వాత డాటా ఎంట్రీ విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-వయస్సు : 33 ఏండ్లకు మించరాదు. ఓబీసీ అభ్యర్థులకు 36 ఏండ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థలకు 38 ఏండ్లవరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: నెలకు సుమారు రూ.15,180. ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- 
-ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత నమూనాలో దరఖాస్తును నింపి, డిమాండ్ డ్రాఫ్ట్, సంబంధిత సర్టిఫికెట్లను జతపరిచి సంబంధిత అధికారికి పంపాలి.

-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 20


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు,

భారత ప్రభుత్వ రంగ సంస్థ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
DREDGING 
వివరాలు:
కేంద్ర షిప్పింగ్ శాఖ పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఒక మినీరత్న కేటగిరీ - 1 సంస్థ. ప్రస్తుత ఖాళీలు విశాఖపట్నం యూనిట్‌లో ఉన్నాయి. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
-డ్రెడ్జ్ క్యాడెట్స్ - 15 
(జనరల్- 6, ఓబీసీ- 4, ఎస్సీ- 4, ఎస్టీ-1)
-అర్హతలు: డీజీ షిప్పింగ్ అనుమతి పొందిన సంస్థ నుంచి నాటికల్ సైన్స్‌లో డిప్లొమా చేసి ఉండాలి.
-ట్రెయినీ మెరైన్ ఇంజినీర్- 15
-అర్హతలు: ఐఎంయూ అనుబంధ కాలేజీ/సంస్థ లేదా డీజీ షిప్పింగ్ అనుమతి పొందిన సంస్థ నుంచి మెరైన్ ఇంజినీరింగ్‌లో నాలుగేండ్ల డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
-ట్రెయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్- 15
-అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లేదా ఈఈఈ లేదా ఈసీఈ/ఈఐలో నాలుగేండ్ల డిగ్రీ (బీఈ/బీటెక్) పూర్తిచేసి 30 ఏండ్లలోపు ఉన్నవారు అర్హులు.
-ఎన్‌సీవీ ట్రెయినీ- 15
-అర్హతలు: పదోతరగతితోపాటు ప్రి సీ జీపీ రేటింగ్ కోర్సులో డీజీ షిప్పింగ్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 25 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

-చివరితేదీ: ఆగస్టు 5


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌హెచ్‌ఏఐలో అకౌంటెంట్ ఉద్యోగాలు,
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టెనో, అకౌంటెంట్, ఐటీ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NHAI 

వివరాలు: 
ఎన్‌హెచ్‌ఏఐ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 25
-వివరాలు: స్టెనో-2, అకౌంటెంట్-3, ఐటీ ప్రొఫెషనల్స్-4, సెక్యూరిటీ గార్డ్-1
-వర్‌సిఫర్-3, ఆఫీస్ అసిస్టెంట్-5, ఫారెస్ట్ గార్డ్-4, తదితర పొస్టులున్నాయి.
-అర్హత: పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, బీకాం తదితర పోస్టుల బట్టి అర్హతలను కలిగి ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: దరఖాస్తులను పూర్తిగా నింపి, కావల్సిన సర్టిఫికెట్లను జతపరిచి పర్సనల్ అధికారికి పంపించాలి.

-చివరి తేదీ: జూలై 31----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కార్పొరేషన్ బ్యాంక్‌లో మేనేజర్లు.కార్పొరేషన్ బ్యాంక్ లా విభాగంలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్/మేనేజర్ (మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-2) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CORPORATIN-BANK
వివరాలు:
ఈ పోస్టులను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భర్తీచేస్తారు.
-పోస్టు పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్/మేనేజర్
-మొత్తం పోస్టుల సంఖ్య: 20
(జనరల్-10, ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-2)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడేండ్ల/ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 2017 మే 31 నాటికి 21 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 31,705-45,950/-అప్లికేషన్ ఫీజు: రూ. 600/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ
అభ్యర్థులు రూ. 100/-
-ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ

-ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
-పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు కోత విధిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో అభ్యర్థి ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
-చివరితేదీ: ఆగస్టు 5
-వెబ్‌సైట్: www.corpoba-k.com

ఆన్‌లైన్ రాత పరీక్ష సిలబస్
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు
రీజనింగ్ 50 50
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 50
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50
ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 50
మొత్తం 200 200

0 comments:

Post a Comment