Thursday, 13 July 2017

ఐబీపీఎస్ పీవో/మేనేజ్‌మెంట్ ట్రెయినీలు, మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 100 అప్రెంటిస్‌లు, బార్క్‌లో మెడికల్ ఆఫీసర్లు, ఏఏడీ రికార్డ్స్‌లో ఉద్యోగాలు, ఐహెచ్‌బీఏఎస్‌లో ఉద్యోగాలు. IBPS Po / Management Trainees,100 Apprentices Jobs IN Medak Ordinance Factory,Medical Officers in Bark,AAD Records Recruitment,Jobs at IHBAS

ఐబీపీఎస్ పీవో/మేనేజ్‌మెంట్ ట్రెయినీలు,
డిగ్రీ ఉత్తీర్ణులకు అవకాశం
-ఆన్‌లైన్‌లో పరీక్షలు
-ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక
-20 ప్రధాన బ్యాంకుల్లో ఖాళీల భర్తీ (సీడబ్ల్యూఈ పీవో/ఎంటీ - VII)
దేశవ్యాప్తంగా 20 ప్రధానబ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పీవో/మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
IBPSTeam
వివరాలు:

దేశంలో ప్రధాన బ్యాంకుల్లో వివిధ రకాల పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ కామన్ రిటన్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. మొదట ఆన్‌లైన్‌లో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహిస్తారు. దీనిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఆన్‌లైన్ మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. అనంతరం ఆయా బ్యాంకులు నోడల్ బ్యాంక్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తాయి.
-ఐబీపీఎస్ కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో పాల్గొనే బ్యాంకులు:
-అలహాబాద్‌బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరాబ్యాంక్, సెంట్రల్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, దేనాబ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్‌బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్‌బ్యాంక్, ఓరియంటల్‌బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకోబ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయాబ్యాంక్.
-పోస్టులు: ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ
-వయస్సు: 2017, జూలై 1 నాటికి 20 - 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-విద్యార్హతలు: 2017, ఆగస్టు 6 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన వారు అర్హులు.
ప్రి ఎగ్జామినేషన్ ట్రెయినింగ్:

-ఆయా రాష్ర్టాల్లో నోడల్ బ్యాంకులు పరిమిత సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ప్రి ఎగ్జామినేషన్ ట్రెయినింగ్‌ను ఇస్తారు. రాష్ట్రం/ ఏపీలో హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలలో ఈ కోచింగ్‌ను ఇస్తారు.
పరీక్ష విధానం:

-ప్రిలిమినరీ ఎగ్జామ్: ఆన్‌లైన్ పద్ధతిలో
-ఇంగ్లిష్ - 30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 35, రీజనింగ్ ఎబిలిటీ - 35 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
-పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
మెయిన్ ఎగ్జామ్ (ఆన్‌లైన్‌లో):

-మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 140 నిమిషాలు.
-పరీక్షలో రీజనింగ్ - 50 మార్కులు (40 ని॥), ఇంగ్లిష్ లాంగ్వేజ్ - 40 మార్కులు (30 ని॥), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 50 మార్కులు (40 ని॥), జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ అంశాలకు సంబంధించి) - 40 మార్కులు (20 ని॥), కంప్యూటర్ నాలెడ్జ్ - 20 మార్కులు (10 ని॥)
నోట్: నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఈ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
-ఖాళీల వివరాలు: అలహాబాద్ బ్యాంక్ - 447, ఆంధ్రాబ్యాంక్ - 200, బ్యాంక్ ఆఫ్ ఇండియా - 200, కెనరాబ్యాంక్ - 900, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 200, ఓబీసీ - 300, పంజాబ్ నేషనల్ బ్యాంక్ - 400, పంజాబ్, సింధ్ బ్యాంక్ - 100, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 400, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 100.
-మొత్తం ఖాళీల సంఖ్య - 3247
నోట్: పై ఖాళీలు మారే అవకాశం ఉంది. ఐబీపీఎస్ సైట్‌లో ఫైనల్‌గా అప్‌డేట్ చేసే ఖాళీలు ఫైనల్‌గా గుర్తించాలి.
-ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్,
కరీంనగర్, ఖమ్మం, వరంగల్
IBPS-LOGO
ముఖ్యతేదీలు:

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఆగస్టు 6 నుంచి ప్రారంభం
-ఫీజు చెల్లించాల్సిన తేదీలు: ఆగస్టు 6 నుంచి 26 వరకు
-ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ
అభ్యర్థులకు రూ. 100/-
-ఇతరులకు రూ. 600/-
-దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ: ఆగస్టు 26
-ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌తేదీ: అక్టోబర్ 7, 8, 14, 15
-ప్రిలిమినరీ ఫలితాల వెల్లడి: అక్టోబర్
-ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్: నవంబర్ 26
-ఫలితాల వెల్లడి: డిసెంబర్ 2017
-ఇంటర్వ్యూలు: జనవరి/ ఫిబ్రవరి 2018
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 100 అప్రెంటిస్‌లు,
తెలంగాణలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌త/టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
MEDAK-OFD
వివరాలు:

ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో పనిచేస్తున్న అనుబంధ సంస్థ.
-శిక్షణ వ్యవధి: ఏడాది
-విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ, సివిల్, సీఎస్‌ఈ, ఐటీ, కెమికల్ అండ్ ఆటోమొబైల్
-అర్హత: గ్రాడ్యుయేట్‌లో సంబంధిత బ్రాంచీల్లో ఇంజినీరింగ్ కోర్సు ఉత్తీర్ణత. టెక్నీషియన్ కేటగిరీకి సంబంధిత బ్రాంచీల్లో డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత. ఆయా కోర్సుల్లో పాసైన తేదీకి, అప్రెంటిస్‌లో చేరబోయే తేదీకి మధ్య వ్యవధి మూడేండ్లకు మించకూడదు. ఈ కోర్సులను 2014 డిసెంబర్ ముందు నాటికి ఉత్తీర్ణలైనవారు దరఖాస్తుకు అనర్హులు.
-స్టయిఫండ్: గ్రాడ్యుయేట్ కేటగిరీకి రూ. 4984/, టెక్నీషియన్ కేటగిరీకి రూ. 3542/-
-ఎంపిక: ఇంటర్వ్యూ
-ఇంటర్వ్యూ సమయంలో వెరిఫికేషన్ కోసం అందజేయాల్సిన విద్యార్హత సర్టిఫికెట్లు, ఇంజినీరింగ్/ డిప్లొమా, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరుకావాలి.
ఇంటర్వ్యూ చిరునామా: హెచ్‌ఆర్‌డీ విభాగం మెయిన్ గేట్ దగ్గర, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎస్టేట్, ఎద్దుమైలారం, మెదక్, తెలంగాణ
-ఇంటర్వ్యూ తేదీ: జూలై 27

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బార్క్‌లో మెడికల్ ఆఫీసర్లు,
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఇ)కి చెందిన బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్(బార్క్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
barc
వివరాలు:

భారత ప్రభుత్వం 1954 జనవరి 3న అణుపరిశోధన కోసం అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిస్‌మెంట్, ట్రాంబే అనే సంస్థను స్థాపించింది.1966లో భారతదేశ అణుశక్తి పితామహుడు డాక్టర్ హోమి జహంగీర్ బాబా జ్ఞాపకార్థంగా ట్రాంబేను బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌గా పేరు మార్చారు,
-పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్
-విభాగాలు: డెంటల్ సర్జన్, ఈఎన్టీ సర్జన్, జనరల్ మెడిసిన్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఆర్థోపెడిక్ సర్జన్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ, ఎంఎస్, ఎంబీబీఎస్, ఎంఎస్/డీఎన్‌బీ, ఎండీ/డీఎన్‌బీ, ఎండీఎస్‌లో ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: జూలై 7----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఏడీ రికార్డ్స్‌లో ఉద్యోగాలు,
ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (ఏఏడీ ) రికార్డ్స్ ఖాళీగా ఉన్న లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను 
ఆహ్వానిస్తున్నది.
AAD-RECRUITEMENT 
వివరాలు:

-ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో పనిచేస్తుంది.
-పోస్టు పేరు: లోయర్ డివిజన్ క్లర్క్
-మొత్తం పోస్టుల సంఖ్య:19 (జనరల్-7, ఓబీసీ-2, ఎస్సీ-3, ఎస్టీ-4, ఎక్స్ సర్వీస్‌మెన్-2, పీహెచ్‌సీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌తోపాటు ఇంగ్లిష్/హిందీ టైపింగ్‌లో నిమిషానికి 35/30 పదాలు వేగాన్ని కలిగి ఉండాలి.
-పే స్కేల్: రూ. 19,900/-
-వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ద్వారా.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలోదరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: Comma-di-g Officer, Army Air Defe-ce Records, Gopalpur Military Statio-, Ga-jam (Odisha), PI-- 761052

-దరఖాస్తుకు చివరితేదీ: జూలై 27 ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐహెచ్‌బీఏఎస్‌లో ఉద్యోగాలు.
ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ ఐల్లెడ్ సైన్సెస్ (ఐహెచ్‌బీఏఎస్)లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IHBAS
వివరాలు:

ఐహెచ్‌బీఏఎస్ భారత ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది.
పోస్టులు- ఖాళీల సంఖ్య:-సీనియర్ లైబ్రేరి అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 3, స్టాటిస్టికల్ అసిస్టెంట్ - 1, ల్యాబొరేటరీ అసిస్టెంట్ - 1, ఐసీయూ టెక్నీషియన్ - 2, టెక్నికల్ అసిస్టెంట్ - 1, లైబ్రేరి అటెండెంట్ - 1
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: జూలై 21
-వెబ్‌సైట్: www.ihbas.delhigovt.-ic

0 comments:

Post a Comment