Thursday, 1 June 2017

UPSC Recruitment Notification,Canfin Homes Recruitment For Junior Officers. యూపీఎస్సీ ఉద్యోగాలు, కెన్‌ఫిన్ హోమ్స్‌లో జూనియర్ ఆఫీసర్లు.

యూపీఎస్సీ ఉద్యోగాలు,

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది.
UPSC 
వివరాలు:

గ్రేడ్ - 2 సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ - 2 ఖాళీలు
-ఈ పోస్టులు రక్షణశాఖ పరిధిలో ఉన్నాయి.
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు. కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు.
-పేస్కేల్: రూ. 15,600 - 39, 100 + రూ. 5,400/-
-అసోసియేట్ ప్రొఫెసర్ (ఇంగ్లిష్) - 1 పోస్టు
-ఈ పోస్టు డెహ్రాడూన్‌లోని ఐఎంఏలో ఉంది. 
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ.
-పేస్కేల్: రూ. 37,400-67000 + గ్రేడ్ పే రూ. 9000
-అసోసియేట్ ప్రొఫెసర్ (హిస్టరీ) - 1 పోస్టు
-ఈ పోస్టు డెహ్రాడూన్, ఐఎంఏలో ఉంది.
-పేస్కేల్: రూ. 37,400-67000 + గ్రేడ్ పే రూ. 9000
-అర్హత: హిస్టరీలో పీహెచ్‌డీ
-మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ - 1 పోస్టు
-ఈ పోస్టు ఐఎంఏ, డెహ్రాడూన్‌లో ఉంది.
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు
-అర్హత: పీజీలో కంప్యూటర్ సైన్స్ లేదా మ్యాథ్స్ లేదా సైన్స్ చదివిన వారు అర్హులు. మూడేండ్ల బోధనానుభవం ఉండాలి.
-ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (రష్యన్/ఇంగ్లిష్) - 18 పోస్టులు
-ఈ పోస్టులు ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్, రక్షణమంత్రిత్వశాఖ (నేవీ) పరిధిలో ఉన్నాయి.
-పేస్కేల్: రూ. 9,300- 34,800 + గ్రేడ్ పే రూ. 4,600/-
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ (సైన్స్ వారికి ప్రాధాన్యం ఇస్తారు), డిప్లొమా ఇన్ రష్యన్ లాంగ్వేజ్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. టెక్నికల్ డాక్యుమెంట్స్ అనువాదంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
-అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 5 ఖాళీలు
-ఈ పోస్టులు కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగంలో ఉన్నాయి.
-అర్హత: లా డిగ్రీ ఉండాలి. కనీసం మూడేండ్లు జ్యుడీషియల్ లేదా లీగల్ వర్క్ ఇన్ కస్టమ్స్, ఎక్సైజ్ విభాగంలో అనుభవం ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: జూన్ 15
-ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్న కాపీ ప్రింట్‌ను జూన్ 16లోగా చేరేలా పంపాలి.

-వెబ్‌సైట్: http://www.upsco-li-e.-ic.i-



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కెన్‌ఫిన్ హోమ్స్‌లో జూనియర్ ఆఫీసర్లు.


బెంగళూరులోని కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఆఫీసర్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Can-Fin-Homes 
వివరాలు:

కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ అనేది కెనరాబ్యాంక్ అనుబంధ సంస్థ 
-పోస్టు పేరు: జూనియర్ ఆఫీసర్ 
-మొత్తం పోస్టుల సంఖ్య-30 
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఏదైనా పోస్టు గ్రాడ్యుయేట్ /ఎంబీఏలో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. టూవీలర్ డ్రైవింగ్ వచ్చి ఉండాలి. 
-వయస్సు: 2017 ఏప్రిల్ 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్ : మొదటి ఏడాదికి రూ. 2,52,300/-, రెండో ఏడాదికి రూ. 2,76,300/-, మూడో ఏడాదికి రూ. 3,36,300/- జీతం ఇస్తారు..
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరి తేదీ: జూన్ 6

-వెబ్‌సైట్: www.ca-fi-homes.com.


0 comments:

Post a Comment