Tuesday, 13 June 2017

Territorial Officer jobs in the Indian Army,UPSC NDA & NA (II) - 2017,IISER Admissions,Nit Calicut Jobs,Jobs in Mangalore university. ఇండియన్ ఆర్మీలో టెరిటోరియల్ ఆఫీసర్ ఉద్యోగాలు, యూపీఎస్సీ ఎన్‌డీఏ & ఎన్‌ఏ(II)- 2017, ఐఐఎస్‌ఈఆర్‌లో ప్రవేశాలు, నిట్ కాలికట్‌లో ఉద్యోగాలు, మంగళూరు యూనివర్సి టీలో ఉద్యోగాలు.

ఇండియన్ ఆర్మీలో టెరిటోరియల్ ఆఫీసర్ ఉద్యోగాలు,
ఇండియన్ ఆర్మీ (ఐఏ) ఆర్మీ టెరిటోరియల్ ఆఫీసర్ (నాన్ డిపార్ట్‌మెంటల్) ఉద్యోగం చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న యువకులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
TERRITORIAL-ARMY 
వివరాలు:

దేశాన్ని అనుక్షణం రక్షించే దళాలలో ఇండియన్ ఆర్మీ ఒకటి. ఈ సంస్థ ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతోపాటు దేశంలో శాంతిభద్రతలను కాపాడుతూ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం.
పోస్ట్ పేరు:
ఆర్మీ టెరిటోరియల్ ఆఫీసర్
పనిచేసే ప్రదేశం:
దేశవ్యాప్తంగా ఎక్కడైనా
అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. అభ్యర్థి శారీరకంగా, వైద్యపరంగా ఫిట్‌గా ఉండాలి
వయస్సు:
18 నుంచి 42 ఏండ్ల మధ్య ఉండాలి
పే అండ్ అలవెన్స్‌లు:
లెప్టెనెంట్ హోదాలో పే బ్యాండ్ రూ.15,600-39,100+గ్రేడ్ పే రూ.5,400 తోపాటు మిలిటరీ సర్వీస్ పే రూ.6000/- ఉంటుంది. 
అప్లికేషన్ ఫీజు:
రూ. 200/-
ఎంపిక:
రాతపరీక్ష, ఇంటర్వ్యూ (ప్రిలిమినరీ ఇంటర్వ్యూ బోర్డు), సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
రాత పరీక్ష అనేది ఆబ్జెక్టివ్ విధానంలో పేపర్- 1, పేపర్ - 2లు ఉంటాయి.
పేపర్- 1లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్-50 మార్కులు, రీజనింగ్-50 మార్కులు. దీనికి కేటాయించిన సమయం 2 గంటలు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో అర్థమెటిక్, యునిటరీ మెథడ్, ఎలిమెంటరీ నంబర్ థియరీ, ఆల్‌జీబ్రా, త్రికోణమితి, జామెట్రీ, మెన్స్‌రేషన్, స్టాటిస్టిక్స్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

పేపర్ 2లో జనరల్ నాలెడ్జ్50 మార్కులు, ఇంగ్లిష్-50 మార్కులు. దీనికి కూడా కేటాయించిన సమయం 2 గంటలు
ప్రతి పేపర్‌లో 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది
ప్రతి అభ్యర్థి పేపర్ 1 అండ్ పేపర్ 2లో కనీసం 40 శాతం అర్హత మార్కులను సాధించాలి. సగటున 50 శాతం మార్కులను సాధించాలి
ప్రశ్న పత్రం కేవలం ఇంగ్లిష్ ,హిందీ భాషల్లోనే ఉంటుంది 
దరఖాస్తు:
ఆన్‌లైన్ ద్వారా. 
దరఖాస్తులకు చివరితేదీ:
జూన్ 30 
రాత పరీక్ష:
జూలై 30
వెబ్‌సైట్:

www.indanarmy.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

యూపీఎస్సీ ఎన్‌డీఏ & ఎన్‌ఏ(II)- 2017,

నేషనల్ డిఫెన్స్, నేవల్ అకాడమీల్లో 390 ఖాళీలు
-ఇంటర్ విద్యార్థులకు సువర్ణావకాశం
-ఉచితంగా చదువుతోపాటు కొలువు
-శిక్షణలో నెలకు రూ. 21 వేల స్టయిఫండ్,అనంతరం అరవైవేలకు పైగా ప్రారంభవేతనం
-ఏటా రెండుసార్లు నోటిఫికేషన్. సెప్టెంబర్ - 2017 పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదల.
-జూన్ 2017 నోటిఫికేషన్ ఖాళీల వివరాలు:
-మొత్తం ఖాళీలసంఖ్య - 390
-నేషనల్ డిఫెన్స్ అకడామీలో (140వ కోర్సు) - 335(ఆర్మీలో - 208, నేవీలో -55,ఎయిర్‌ఫోర్స్‌లో - 72 ఖాళీలు)
-ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సు (102) (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీం) - 55

నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ (II) - 2017 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఏటా రెండుసార్లు విడుదలవుతుంది.
the-indian-army
వివరాలు:
పరీక్షతేదీ: 2017, సెప్టెంబర్ 10. ఈ పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తుంది.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, అగర్తలా, అహ్మదాబాద్, ఐజ్వాల్, అలహాబాద్, బెంగళూరు, బరేలి. భోపాల్, చండీగఢ్, కటక్, డెహ్రాడూన్, ఢిల్లీ, ధార్వాడ్, దిస్‌పూర్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, ఇటానగర్, జైపూర్, జమ్ము, జోరహట్, కొచ్చి, కొహిమా, కోల్‌కతా, లక్నో, మధురై, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా, పోర్ట్‌బ్లెయిర్, రాయ్‌పూర్, రాంచీ, సంబాల్‌పూర్, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం, ఉదయ్‌పూర్.
వయస్సు: 1999, జనవరి 2 - 2002, జనవరి 1 మధ్య జన్మించిన వారు అర్హులు.
అర్హతలు: అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే.
ఎన్‌డీఏ ఆర్మీ వింగ్ - ఏ బ్రాంచీలోనైనా ఇంటర్ లేదా 10+2 కోర్సు ఉత్తీర్ణత.
నేవల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీలకు, 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీం కోసం - ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులైన వారు అర్హులు.

నోట్: ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ సమయానికి అర్హత సర్టిఫికెట్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
శారీరక ప్రమాణాలు: కనీసం 152 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
ఎంపిక విధానం: రెండు దశల్లో ఉంటుంది.
1. రాతపరీక్ష
2. ఇంటెలిజెన్స్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్ రాతపరీక్ష:
మొత్తం 900 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్ - 300 మార్కులు (రెండున్నర గంటలు), జనరల్ ఎబిలిటీ టెస్ట్ట్ - 600 మార్కులు (రెండున్నర గంటలు). దీనిలో జనరల్ నాలెడ్జ్‌కు 400 మార్కులు, ఇంగ్లిష్‌కు 200 మార్కులు కేటాయించారు.
పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.33 మార్కులు కోత విధిస్తారు.
రాతపరీక్షలో అర్హత సాధించినవారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్‌లను నిర్వహిస్తుంది. అభ్యర్థులు ఎంపిక చేసుకొన్న దళాలను బట్టి టెస్ట్‌లు ఉంటాయి. ఎయిర్‌ఫోర్స్ అభ్యర్థులకు పైలట్ ఆప్టిట్యూడ్ టెస్ట్, సైకలాజికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటెలిజెన్స్ టెస్ట్‌లను ఎయిర్‌ఫోర్స్ సెలక్షన్ సెంటర్స్ వద్ద నిర్వహిస్తారు. అభ్యర్థులను నిశితంగా అన్ని కోణాల్లో పరిశీలించడమే ఈ టెస్ట్‌ల ముఖ్య ఉద్దేశం.
తుది ఎంపిక: రాతపరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన టెస్ట్‌ల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. అనంతరం వైద్యపరీక్షలు, అభ్యర్థి ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకొని సంబంధిత విభాగాలకు ఎంపిక చేస్తారు.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులను వారు ఎంచుకొన్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో నాలుగు సంవత్సరాల కోర్సుల్లో చేర్చుకొంటారు. మొదటి రెండున్నరేండ్లు అందరికీ ఒకే రకమైన శిక్షణనిస్తారు. మిగతా ఏడాదిన్నరలో సంబంధిత ట్రేడ్‌లో శిక్షణ ఇస్తారు.

బీఏ, బీఎస్సీ, బీఎస్సీ (కంప్యూటర్) సర్టిఫికెట్స్‌ను న్యూఢిల్లీలోని జేఎన్‌యూ అందిజేస్తుంది.
నేవల్ అకాడమీ, 10+2 క్యాడెట్ ఎంట్రీ అభ్యర్థులకు బీటెక్ డిగ్రీని ప్రదానం చేస్తారు.
ఎన్‌డీఏ శిక్షణ తర్వాత ఆర్మీ అభ్యర్థులకు డెహ్రాడూన్‌లో, నేవీ అభ్యర్థులకు ఎజిమలలోని ఐఎన్‌ఏలో, ఎయిర్‌ఫోర్స్ అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఏఎఫ్‌ఏలో ఏడాది పాటు శిక్షణనిస్తారు. ఈ సమయంలో నెలకు రూ. 21,000/- స్టయిఫండ్‌ను చెల్లిస్తారు.
ఆయా ట్రేడ్‌లలో విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకొన్నవారికి ప్రారంభవేతనం సుమారు రూ. 60 వేలతో లెఫ్టినెంట్/ఫ్లయింగ్ ఆఫీసర్ లేదా సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగావకాశం కల్పిస్తారు.
నోట్: ఎన్‌డీఏలో ప్రవేశం పొందిన వారికి కింది స్కాలర్‌షిప్స్/ఫైనాన్షియల్ అసిస్టెన్సీ ఉంటుంది.
పరుశరామ్‌బాహు పట్వర్ధన్ స్కాలర్‌షిప్, కొలొనిల్ కెండల్ ఫ్రాంక్ మెమోరియల్ స్కాలర్‌షిప్, కౌర్ సింగ్ మెమోరియల్ స్కాలర్‌షిప్, అస్సాం గవర్నమెంట్ స్కాలర్‌షిప్, ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, ఒడిశా తదితర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే స్కాలర్‌షిప్స్ ఉన్నాయి.

పదోన్నతులు: శిక్షణ పూర్తయిన తర్వాత ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో, నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాలో, ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాలో ఉద్యోగావకాశం కల్పిస్తారు. తర్వాత ఆర్మీలో జనరల్, నేవీలో అడ్మిరల్, ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌చీఫ్ మార్షల్ హోదా వరకు పదోన్నతిని పొందవచ్చు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
ఫీజు: రూ. 100/-(ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు)
చివరితేదీ: జూన్ 30(సాయంత్రం 6 గంటల వరకు)
అభ్యర్థులకు గైడెన్స్ కోసం కింది నంబర్లులో ఆఫీస్ పనివేళల్లో సంప్రదించవచ్చు.Telephone No.011-23385271/011-23381125/011- 23098543 on working days between 10.00 hrs. to 17.00 hrs.
వెబ్‌సైట్: http://www.upsc.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఐఐఎస్‌ఈఆర్‌లో ప్రవేశాలు,

దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)ల్లో బీఎస్ - ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
బెర్హాంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతిలో ఉన్న ఐఐఎస్‌ఈఆర్‌లో 2017 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు.
-కోర్సు: బీఎస్ - ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: జూన్ 18
-వెబ్‌సైట్: www.iiseradmissions.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిట్ కాలికట్‌లో ఉద్యోగాలు,
కాలికట్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్, క్లినికల్ సైకాలజిస్ట్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. 
nitcalicut 
వివరాలు:
జూనియర్ ఇంజినీర్ (సివిల్)- 8 పోస్టులు
-అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్/బీఈ లేదా డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 17,500/- (కన్సాలిడేటెడ్ పే)
-పోస్టు పేరు: క్లినికల్ సైకాలజిస్ట్
-అర్హత: సైకాలజీలో ఎంఏ/ఎమ్మెస్సీ క్లినికల్ సైకాలజీలో ఎంఫిల్, సోషల్ వర్క్‌లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.

-పే స్కేల్: రూ. 30,000/- (కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తు నింపి ఇంటర్వ్యూ రోజున పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి 
-ఇంటర్వ్యూ తేదీ : జూన్ 15,16
-వెబ్‌సైట్ : www.nitc.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మంగళూరు యూనివర్సి టీలో ఉద్యోగాలు.

మంగళూరు యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 


వివరాలు:
మంగళూరు యూనివర్సిటీ న్యాక్ ఏ గ్రేడ్ పొందిన సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య-49 
-ప్రొఫెసర్-5 పోస్టులు
-అసోసియేట్ ప్రొఫెసర్-3 పోస్టులు
-అసిస్టెంట్ ప్రొఫెసర్-14 పోస్టులు 
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. యూజీసీ నెట్, సెట్, స్లేట్‌లో అర్హతను సాధించాలి. సంబంధిత సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీతోపాటు రిసెర్చ్/టీచింగ్ విభాగంలో అనుభవం ఉండాలి.నాన్‌టీచింగ్ పోస్టులు-27. వీటిలో రేడియేషన్ ఫిజిసిస్ట్-1, అసిస్టెంట్ లైబ్రేరియన్-2, అసిస్టెంట్ ఇంజినీర్-2, క్యూరేటర్-1, కోచ్-1, స్టాఫ్ నర్స్-1, కంప్యూటర్ ఆపరేటర్-1, ఫస్ట్ డివిజన్ అసిస్టెంట్-2, స్టోర్ కీపర్-1, ల్యాబొరేటరీ (టెక్నీషియన్-1, అసిస్టెంట్-1), సానిటరీ ఇన్‌స్పెక్టర్-1, సెకండ్ డివిజన్ అసిస్టెంట్-1, టైపిస్ట్ కమ్ క్లర్క్-3, పంప్ ఆపరేటర్-1, అసిస్టెంట్ కుక్-1, బైండర్-1, కిచెన్ అసిస్టెంట్-1
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 10
-వెబ్‌సైట్: www. mangaloreuniversity.ac.in


0 comments:

Post a Comment