Wednesday, 14 June 2017

Scientific Assistants in IPC,JRF jobs in DRDO,Project Assistants at the National Environmental Institute Research Zonal Laboratory. ఐపీసీలో సైంటిఫిక్ అసిస్టెంట్లు, డీఆర్‌డీవోలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జోనల్ ల్యాబొరేటరీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్స్.


ఐపీసీలో సైంటిఫిక్ అసిస్టెంట్లు,

ఘజియాబాద్‌లోని ఐపీసీ ఖాళీగా ఉన్న సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IPC-SCIENTIFIC-ASSSISTANTS
వివరాలు:
ఐపీసీ అనేది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు అనుబంధగా పనిచేస్తుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15 (జనరల్-6, ఓబీసీ-6, ఎస్సీ-3)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫార్మస్యూటికల్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి అసోసియేట్‌షిప్ డిప్లొమా ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కెమికల్, ఫిజియోకెమికల్, డ్రగ్స్ టెస్టింగ్‌లో ఏడాది అనుభవం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్‌లో మంచి పరిజ్ఞానం ఉండాలి.
పే స్కేల్ : రూ. 9,300-34,800 + గ్రేడ్ పే రూ. 4,200/-
వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
ఎంపిక: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి.
చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోగా దరఖాస్తులను పంపాలి. పూర్తి వివరాలకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (జూన్ 10-16)చూడవచ్చు.
వెబ్‌సైట్:www.ipc.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవోలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,

పుణెలో ఉన్న రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఇంజినీర్స్)లో ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నది.
drdo
వివరాలు:
రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఇంజినీర్స్) అనేది డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో పనిచేస్తుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 4 (మెకానికల్-2, ఎలక్ట్రికల్-1, కంప్యూటర్ సైన్స్-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత. నెట్, గేట్‌లో అర్హత సాధించాలి. వెబ్ డెవలప్‌మెంట్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్, ఈఆర్‌పీ, ఏఎస్‌పీలో పరిజ్ఞానం ఉండాలి.
వయస్సు: 28 ఏండ్లు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ. 25,000/-+ హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. పూర్తి వివరాలతో దరఖాస్తులను నింపి, పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: Director, R and DE (Engrs), Alandi Road, Kalas, Pune-411015
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపాలి.
వెబ్‌సైట్: www.drdo.gov.in




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జోనల్ ల్యాబొరేటరీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్స్.


హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్ - నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జోనల్ ల్యాబొరేటరీలో పీఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
NEERI
వివరాలు:
సీఎస్‌ఐఆర్ - నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జోనల్ ల్యాబొరేటరీ తార్నాకలోని ఐఐసీటీ క్యాంపస్‌లో ఉంది.
పోస్టు: ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ (పీఏ)
-ఖాళీల సంఖ్య - 2
అర్హతలు: బీఎస్సీ (కెమిస్ట్రీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ బయాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా మైక్రోబయాలజీ/ మెరైన్ సైన్స్)
-ఈ పోస్టులను ఏడాది కాలపరిమితికి తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
జీతం: నెలకు రూ. 15,000/-
వయస్సు: 28 ఏండ్లు మించరాదు.
ఎంపిక: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 14 (ఉదయం 10 గంటల నుంచి)
వెబ్‌సైట్: www.neeri.res.in


0 comments:

Post a Comment