Monday, 5 June 2017

Professor posts in JIPMER,JRF jobs in CIET, IHBT Recruitment Notification,Scientist jobs in NIELIT జిప్‌మర్‌లో ప్రొఫెసర్ పోస్టులు, సీఐఈటీలో జేఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలు, ఐహెచ్‌బీటీలో ఉద్యోగాలు, ఎన్‌ఐఈఎల్‌ఐటీలో సైంటిస్టు ఉద్యోగాలు.

జిప్‌మర్‌లో ప్రొఫెసర్ పోస్టులు,

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) వివిధ విభాగాల్లోఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
jipmer
వివరాలు:
భారత ప్రభుత్వ పరిధిలో నడుస్తున్న సంస్థ ఇది.
-మొత్తం పోస్టుల సంఖ్య-74(జనరల్-36, ఓబీసీ-28, ఎస్సీ-7, ఎస్టీ-3)
-పోస్టు పేరు: ప్రొఫెసర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్స్-44, ప్రొఫెసర్స్-30)
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా ఎండీ/ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత లేదా సంబంధిత విభాగం నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉతీర్ణత. సంబంధిత విభాగం నుంచి పీజీ పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతపరిచి పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: The Director,JIPMER, Puducherry- 605 006
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 14
-వెబ్‌సైట్: www.jipmer.edu.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఐఈటీలో జేఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలు,
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (సీఐఈటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆహ్వానిస్తున్నది. 
ciet-recruitement 
వివరాలు:
సీఐఈటీ అనేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్టీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ.
-ఖాళీల వివరాలు: జూనియర్ ప్రాజెక్టు ఫెలో (జేఆర్‌ఎఫ్) - 5, ప్రాజెక్ట్ అసోసియేట్స్ (పీఏ) - 2, కంటెంట్ డెవలపర్ (టెక్నికల్) - 7, గ్రాఫిక్ ఆర్టిస్ట్ - 1.
-పే స్కేల్: జేఆర్‌ఎఫ్ పోస్టులకు నెట్ ఆర్హత ఉంటే రూ.16,000, నెట్ అర్హత లేకపోతే రూ.14,000, ప్రాజెక్ట్ ఆసోసియేట్‌లకు రూ.20,000, కంటెంట్ డెవలపర్(టెక్నికల్)లకు 24,000, గ్రాఫిక్ ఆర్టిస్టుకు రూ.29,000. 
-అర్హతలు: సంబంధిత పోస్టులను అనుసరించి పీజీ, ఐటీ, ఎంసీఏ, ఎంఏ, బీటెక్, ఐసీటీ, ఎంఈటీసీఏ. దీంతోపాటు నిబంధనల మేరకు ఉద్యోగానుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్ నైపుణ్యం తప్పనిసరి. జేఆర్‌ఎఫ్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీలో నెట్ ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యం ఉంటుంది. 
-వయోపరిమితి: 30 ఏండ్లలోపు ఉండాలి.
-ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా. 
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ఈ -మెయిల్ (pmd.ciet@gmail.com) ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 9

-వెబ్‌సైట్: http://www.ciet.nic.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐహెచ్‌బీటీలో ఉద్యోగాలు,
హిమాచల్‌ప్రదేశ్‌లోని పాలంపూర్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్‌బీటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
ihbt 
వివరాలు:

ఐహెచ్‌బీటీ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న అనుబంధ సంస్థ.
-పోస్టుల వివరాలు: సీనియర్ సైంటిస్ట్, సైంటిస్ట్ - 19, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్ - 4.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి డిప్లొమా, బీఎస్సీ, ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ, ఎంఎస్సీ, బీటెక్/(బీటెక్+ఎంబీఏ) లేదా (ఎంఎస్సీ+ఎంబీఏ).
-వయస్సు: సీనియర్ సైంటిస్టు పోస్టులకు 37 ఏండ్లు, సైంటిస్ట్ పోస్టులకు 32 ఏండ్లు, జేఆర్‌ఎఫ్‌కు 28 ఏండ్ల లోపు ఉండాలి.
-పే స్కేల్: సీనియర్ సైంటిస్ట్ - రూ. 74,150, సైంటిస్ట్ - రూ.66,550, 
-సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ - రూ. 55,925, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ - రూ .35,000. 
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్.
-దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నింపి, సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి నిర్ణీత అడ్రస్‌కు పంపాలి. 
-దరఖాస్తులు చేరడానికి చివరితేదీ: జూన్ 19

-వెబ్‌సైట్: www.ihbt.res.in




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఈఎల్‌ఐటీలో సైంటిస్టు ఉద్యోగాలు.

న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ఖాళీగా ఉన్న సైంటిస్ట్ గ్రేడ్ బీ పోస్టుల భర్తీకి అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
nielit
వివరాలు:
ఎన్‌ఐఈఎల్‌ఐటీ అనేది స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీ) తరపున పనిచేస్తుంది.
-పోస్టు పేరు: సైంటిస్ట్ గ్రేడ్ బీ
-పనిచేసే ప్రదేశం: దేశంలోని ఎన్‌ఐఈఎల్‌ఐటీతో పాటు అనుబంధ సంస్థల్లో ఎక్కడైనా
-మొత్తం పోస్టుల సంఖ్య: 27(జనరల్-13, ఓబీసీ-8, ఎస్సీ-4, ఎస్టీ-2)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
-పే స్కేల్: రూ. 15,600-39,100+గ్రేడ్ పే రూ.5400/-
-ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొనేటప్పుడు వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. 
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 14

-వెబ్‌సైట్: www.nielit.gov.in




0 comments:

Post a Comment